Home /News /technology /

THESE ARE THE SMARTPHONES THAT WILL BE LAUNCHED IN APRIL FROM THE LEADING BRANDS TAKE A LOOK AT THE MODELS GH VB

Smartphones: ప్రముఖ బ్రాండ్ల నుంచి ఏప్రిల్‌లో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మోడళ్లపై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏప్రిల్‌లో ప్రముఖ బ్రాండ్ల నుంచి భారతదేశంలో లాంచ్ అయ్యే ఫోన్‌లు ఏవో తెలుసుకుందాం.

ప్రముఖ మొబైల్ మేకింగ్ కంపెనీల నుంచి ప్రతి నెలా అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు (Smartphones) లాంచ్ అవుతుంటాయి. అయితే ఈ నెల అంటే ఏప్రిల్ (April)లో కూడా చాలా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్(Release) కానున్నాయి. షియోమీ(Xiomi), రియల్‌మీ(Realme), ఒప్పో(Oppo), మోటారోలా(Motorola) వంటి అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఈనెల ఇండియాలో(India) కొన్ని ఫోన్‌లు (Phone) లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో చాలా వరకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లేదా కొన్ని మార్కెట్లలో లాంచ్ అయ్యాయి. మరి ఏప్రిల్‌లో ప్రముఖ బ్రాండ్ల నుంచి భారతదేశంలో లాంచ్ అయ్యే ఫోన్‌లు ఏవో తెలుసుకుందాం.

* షియోమీ 12 ప్రో
ఏప్రిల్‌లో విడుదల కానున్న షియోమీ 12 ప్రో 6.73-అంగుళాల డబ్ల్యూహెచ్‌డీ అమోలెడ్ (WQHD+ AMOLED) డిస్‌ప్లేను కలిగి ఉంది. డాల్బీ విజన్ టెక్నాలజీకి సపోర్ట్ చేసే ఈ ఫోన్ 8జీబీ లేదా 12జీబీ ర్యామ్ తో స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌ సాయంతో పనిచేస్తుంది. ఇందులో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కానీ మెమరీ కార్డ్ స్లాట్ ఉండదు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ లో వైడ్, అల్ట్రా-వైడ్, టెలిఫొటో కెమెరాలన్నీ 50-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో వస్తాయి. 4600ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ వైర్ ద్వారా 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, వైర్‌లెస్‌ ద్వారా 50W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. షియోమీ 12 ప్రో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 12న లాంచ్ కావొచ్చు.

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం.. రెండు రోజులే చాన్స్

* రియల్‌మీ జీటీ 2 ప్రో
ఫ్లాగ్‌షిప్ ఫోన్ రియల్‌మీ జీటీ 2 ప్రో ఇండియాలో ఏప్రిల్ 7న లాంచ్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్ తో రన్ అయ్యే ఈ ఫోన్ 2K అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌ కలిగిన ఈ ఫోన్ లో రెండు 50-ఎంపీ సెన్సార్లతో పాటు ఒక 2-ఎంపీ సెన్సార్ ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉండొచ్చని అంచనా.

* ఒప్పో ఎఫ్21 ప్రో
ఒప్పో కంపెనీ 4జీ, 5జీ వేరియంట్‌లలో తన కొత్త ఎఫ్21 ప్రో ఫోన్స్ తీసుకువస్తోంది. ఒప్పో ఎఫ్21 ప్రో సిరీస్ ఫోన్స్ ఏప్రిల్ 12న లాంచ్ అవుతాయి. ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్నాప్‌డ్రాగన్ 680... ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 695లపై రన్ అవుతాయి. ఫైబర్‌గ్లాస్ లెదర్ డిజైన్‌, బ్రైట్ ఆరంజ్ కలర్ ఆప్షన్ లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఒప్పో ఎఫ్21 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో మెయిన్ కెమెరా 64-మెగాపిక్సెల్ సెన్సార్ కాగా మిగతా కెమెరాలు 2-మెగాపిక్సెల్ సెన్సార్లు కలిగి ఉన్నాయి. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. వీటి ధర రూ.20,000 - రూ. 25,000 మధ్య ఉంటుంది.

Smart Phones Under 20K: రూ.20 వేల లోపు బెస్ట్ బడ్జెట్‌ ఫోన్ కోసం చూస్తున్నారా..? ఈ మోడళ్లను పరిశీలించండి..


* మోటరోలా ఎడ్జ్ 30
మోటరోలా ఎడ్జ్ 30 ఇండియాలో ఏప్రిల్‌లో లాంచ్ అవ్వొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. మోటరోలా ఎడ్జ్ 30 స్నాప్‌డ్రాగన్ 778G ప్లస్ చిప్‌సెట్, 8జీబీ ర్యామ్ తో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరిన్ని ఫీచర్లు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

* వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్
ఏప్రిల్ లో లాంచ్ అయ్యే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో ఇది లాంచ్ అవ్వచ్చు. దీని ధర రూ.18,000 నుంచి రూ.20,000 వరకు ఉండవచ్చని అంచనా.
Published by:Veera Babu
First published:

Tags: 5g mobile, 5G Smartphone, Smart phone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు