కొత్త ఏడాదిలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో అనేక స్మార్ట్ఫోన్లు యూజర్లను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. రెడ్మీ నోట్ 11S, ఒప్పో రెనో 7 5G, రెనో 7 ప్రో 5G, గెలాక్సీ S22, గెలాక్సీ S22 అల్ట్రా, రియల్మీ 9 ప్రో ఫోన్లు వచ్చే నెలలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి. ఒప్పో రెనో 7 సిరీస్.. ఒప్పో రెనో 7 సిరీస్‌లో ఒప్పో రెనో 7 5G, ఒప్పో రెనో 7 SE 5G, రెనో 7 ప్రో 5G ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. వీటిని ఫిబ్రవరి 4న భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు ఒప్పో సంస్థ ధ్రువీకరించింది. కాగా, ఒప్పో రెనో 7 సిరీస్ గతేడాదిలోనే చైనా మార్కెట్లోకి విడుదలైంది. అక్కడ మంచి స్పందన రావడంతో ఫిబ్రవరిలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సంస్థ సిద్ధమవుతోంది. చైనా వేరియంట్ల ప్రకారం, ఒప్పో రెనో 7 5G క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అయితే, ప్రో మోడల్ మీడియా టెక్ డైమెన్సిటీ 1200- మాక్స్ SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్..
శామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్‌లో గెలాక్సీ S22, గెలాక్సీ S22 ప్రో, గెలాక్సీ S22 అల్ట్రా ఫోన్లు విడుదల కానున్నాయి. వచ్చే నెలలో నిర్వహించనున్న గెలాక్సీ అన్ప్యాక్డ్–2022 ఈవెంట్లో గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ కానున్నాయి. అయితే, ఈవెంట్ తేదీని మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. గెలాక్సీ అల్ట్రాతో పాటు నోట్ ఎస్ S బాక్సీ డిజైన్‌తో రానుంది. ఇతర రెండు మోడళ్లు శామ్సంగ్ గెలాక్సీ S22, S22+ కర్డ్వ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.
వన్‌ప్లస్ నార్డ్ CE 2..
వన్‌ప్లస్ నార్డ్ CE 2 వచ్చే నెలలో భారత మార్కెట్లోకి విడుదల కానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 ఇప్పటికే అన్ని టెస్టింగ్ దశలను పూర్తి చేసుకుంది. తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్సైట్లో మోడల్ నంబర్ IV2201, ఇవాన్ కోడ్‌నేమ్‌తో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.4- అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్తో పనిచేస్తుంది. దీనిలో 64- మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించనుంది.
New Smartphone: వివో V23 Pro నుంచి షియోమి 11T Pro వరకు.. ఈ నెలలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే..
రియల్మీ 9 ప్రో, రియల్మీ 9 ప్రో..
రియల్మీ నుంచి వచ్చే నెలలో రియల్మీ ప్రో, రియల్మీ ప్రో ప్లస్ రెండు మోడళ్లు ఫిబ్రవరిలో భారత మార్కెట్లోకి లాంచ్ కానున్నాయి. రియల్మీ ప్రో ప్లస్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 920 5G చిప్సెట్తో పనిచేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. మరోవైపు, రియల్మీ 9 ప్రో 6.6 -అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్తో పనిచేస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించనుంది. ఇది 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.