THESE ARE THE FEATURES OF ANOTHER AMAZING PHONE FROM XIAOMI UMG GH
Xiaomi: ఆకట్టుకునే ఫీచర్లతో అద్భుతమైన షావోమి ఫోన్లు..!
షావోమీ స్మార్ట్ ఫోన్లు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి(Xiaomi) తన 12ఎస్ సిరీస్ ఫోన్లను జూలై 4న లాంచ్ చేయనుంది. షావోమి 12 ఎస్ (Xiaomi 12S), షావోమి 12 ఎస్ ప్రో (Xiaomi 12S Pro), షావోమి 12 ఎస్ అల్ట్రా (Xiaomi 12S Ultra) అనే మూడు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను ఈ సోమవారం చైనాలో విడుదల చేయనుంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి(Xiaomi) తన 12ఎస్ సిరీస్ ఫోన్లను జూలై 4న లాంచ్ చేయనుంది. షావోమి 12 ఎస్ (Xiaomi 12S), షావోమి 12 ఎస్ ప్రో (Xiaomi 12S Pro), షావోమి 12 ఎస్ అల్ట్రా (Xiaomi 12S Ultra) అనే మూడు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను ఈ సోమవారం చైనాలో విడుదల చేయనుంది. ఈ మొబైల్స్ ఇండియాలో కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్రీమియం మొబైల్స్‌లో కంపెనీ అదిరిపోయే ఫీచర్లను అందించింది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అన్ని ఫీచర్లు కూడా మొబైల్ కొనుగోలుదారులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఆ ఆకర్షణీయమైన షావోమి 12S సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
* షావోమి 12S
షావోమి 12ఎస్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.28-అంగుళాల పూర్తి HD+ అమోలెడ్ డిస్ప్లేతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ హోల్-పంచ్ కటౌట్ అందించారు. ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, కోట్లాది కలర్స్‌కు సపోర్ట్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్, 4500mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ వంటి ఫీచర్లున్నాయి. బ్యాక్ సైడ్ 50MP సోనీ IMX707 1/1.28-అంగుళాల సెన్సార్, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 5MP టెలి-మాక్రో కెమెరా అందించగా మంచి వైపు 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఫోన్ 8GB + 128GB, 8GB + 256GB మరియు 12GB + 256GB అనే మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అవ్వొచ్చు. ఆండ్రాయిడ్ 12-ఆధారిత MIUI 13తో లాంచ్ అవుతుంది.
* షావోమి 12S ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
షావోమి 12S ప్రో బ్యాక్‌సైడ్ లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరాలతో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్లో మూడు 50MP సెన్సార్లు ఉంటాయి. 50MP సోనీ IMX707 సెన్సార్ ప్రైమరీ కెమెరాగా వస్తుంది. దీంతోపాటు రియర్ సైడ్‌లో 50MP అల్ట్రావైడ్ కెమెరా, 2x జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా అందించారు. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఆఫర్ చేశారు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ లేదా మీడియా టెక్ డైమెన్సిటీ 9000 చిప్‌తో 12S ప్రో విడుదల కావచ్చు. 4600mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.73-అంగుళాల QHD+ అమోలెడ్ డిస్ప్లే, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ లేయర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి మరెన్నో ఫ్లాగ్షిప్ ఫీచర్లు ఉన్నాయి.
* షావోమి 12S అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
షావోమి 12S సిరీస్‌లో టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌గా షావోమి 12S అల్ట్రా మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ ఫోన్ క్వాడ్-కెమెరా సెటప్‌తో లాంచ్ అవుతుంది. ఇందులో 50MP సోనీ IMX989 1-అంగుళాల సెన్సార్ ప్రైమరీ కెమెరాగా వస్తుంది. రియర్ సైడ్‌లో 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో కెమెరా, 10x ఆప్టికల్ జూమ్‌తో మరో 48MP కెమెరా కూడా ఉన్నట్లు సమాచారం. సెల్ఫీల కోసం హోల్-పంచ్ కటౌట్లో 20MP కెమెరాతో ఫోన్ విడుదల అవుతుంది. అలానే QHD+ రిజల్యూషన్‌తో 6.73-అంగుళాల LTPO 2.0 అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1500+ నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుందని సమాచారం. షావోమి 12S సిరీస్ మూడు ఫోన్లు Harmon-Kardon-tuned డ్యూయల్ స్పీకర్లతో యూజర్లకు అత్యుత్తమ సౌండ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. ఇవి నీరు, ధూళి ప్రవేశించకుండా ఉత్తమ IP రేటింగ్‌తో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.