Home /News /technology /

THESE ARE THE BEST CARS THAT COME WITH ADAS TECHNOLOGY THE PRIORITY OF AUTOMOBILE COMPANIES FOR SAFETY FEATURES UMG GH

Car Safety: కారు కొంటున్నారా..? అయితే, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నవాటిని సెలెక్ట్ చేసుకోవడం బెటర్..!

కొత్త కారు కొంటున్నారా..?

కొత్త కారు కొంటున్నారా..?

రోడ్ సేఫ్టీని మెరుగుపరచడానికి కార్ల తయారీ కంపెనీలు తమ సిస్టమ్‌లలో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీని చేర్చడం ప్రారంభించాయి. ADAS అనేది డ్రైవింగ్, పార్కింగ్ ఫంక్షన్‌లలో డ్రైవర్‌లకు సహాయపడే మోడర్న్ సేఫ్టీ టెక్నాలజీ.

ఇంకా చదవండి ...
కారు (Car)ను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు దృష్టి పెట్టాల్సిన ప్రధాన విషయం భద్రత. ఈ రోజుల్లో కార్ సేఫ్టీ (Car Safety) దాని డిమాండ్‌ను నిర్ణయిస్తోంది. అయితే ధర ఎక్కువ ఉందనే కారణంతో చాలామంది అడ్వాన్స్‌డ్ సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్లతో వచ్చిన కార్లను కొనుగోలు చేయట్లేదు. కానీ సేఫ్టీని మెరుగుపరిచే టెక్నాలజీతో వస్తున్న వాహనాలను కస్టమర్లు ఎంచుకోవడం మంచిది. రోడ్ సేఫ్టీని మెరుగుపరచడానికి కార్ల తయారీ కంపెనీలు తమ సిస్టమ్‌లలో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీని చేర్చడం ప్రారంభించాయి. ADAS అనేది డ్రైవింగ్, పార్కింగ్ ఫంక్షన్‌లలో డ్రైవర్‌లకు సహాయపడే మోడర్న్ సేఫ్టీ టెక్నాలజీ. ఇందులో కెమెరాలు, సెన్సార్‌లు, రాడార్‌లు నిర్ణీత ప్రాంతాన్ని స్కాన్ చేయడానికి సమిష్టిగా పనిచేస్తూ, ఆ సమాచారాన్ని కారు సిస్టమ్‌కు అందజేస్తాయి. దీని ద్వారా డ్రైవర్ ప్రమాదాలను నివారించవచ్చు. ఈ టెక్నాలజీతో ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన టాప్-5 కార్లు ఏవో చూద్దాం.

* MG Gloster
MG గ్లోస్టర్ అనేది ఇండియాలో ADAS టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి మాస్-మార్కెట్ కారు. దీని ADAS సూట్‌లో ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటివి ఉన్నాయి. ఈ ఫుల్ సైజ్ SUV.. PM 2.5 ఫిల్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరాలు, పవర్డ్ మసాజ్ సీట్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు వంటి మరిన్ని ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.

* మహీంద్రా XUV 700
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో మహీంద్రా XUV 700 ఒకటి. దీని AX7, AX7L వేరియంట్‌లలో ADAS టెక్నాలజీని అందించారు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై-బీమ్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి అనేక టెక్నాలజీ ఫీచర్లు ఈ కారుకు మంచి సేఫ్టీ, సెక్యూరిటీని అందిస్తున్నాయి. బ్లైండ్-వ్యూ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి టాప్-స్పెక్ AX7 L వేరియంట్‌ ప్రత్యేకతలు.

 ఇదీ చదవండి: షాకింగ్ సర్వే .. ఆ పని చేసే మహిళలకు పెళ్లి కావడం లేదంటా..! కారణాలు చదివితే ఆశ్చర్యపోతారు..!!


* Honda City e: HEV
హోండా సిటీ హైబ్రిడ్, e: HEV అనేది ఈ విభాగంలో బెస్ట్ ADAS టెక్ ఫీచర్లతో వచ్చిన కారు. హోండా సిటీలోని ADAS టెక్నాలజీని హోండా సెన్సింగ్ టెక్నాలజీగా గుర్తిస్తుంది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ టెక్నాలజీతో వచ్చిన కొల్లీషన్ మిటిగేషన్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఏదైనా ఢీకొనే ప్రమాదం జరిగే సూచనలు ఉంటే, ఇది డ్రైవర్‌ రియాక్ట్ అవ్వడానికి విజువల్, ఆడియో వార్నింగ్‌ ఇస్తుంది. డ్రైవర్ అప్పటికీ శ్రద్ధ చూపకపోతే, సిస్టమ్ హార్డ్ బ్రేకింగ్‌ను వర్తింపజేసి, కారు ఆగిపోయేలా చేస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేన్‌లో ఉంచడానికి సహాయపడే లేన్ డిపార్చర్ అసిస్ట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ కారు ఆటో హై-బీమ్ అసిస్ట్‌ను కూడా పొందుతుంది. ట్రాఫిక్‌ను సమీపిస్తున్నట్లు గ్రహించినప్పుడు ఇది హై బీమ్‌ను తగ్గిస్తుంది. హోండా సెన్సింగ్ జాబితాలో చివరిది అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్. ఇది ఆటోమెటిక్‌గా నిర్ణీత పరిమితికి వేగాన్ని తగ్గించడం, పెంచడం ద్వారా పొడవైన హైవే రన్‌లలో పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

* Hyundai Tucson
హ్యుందాయ్ నుంచి ADAS ఫీచర్‌తో వచ్చిన మొదటి మోడల్ టక్సన్. టక్సన్‌లోని ADAS సూట్‌లో ఫ్రంట్ కొలిషన్ అవైడెన్స్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ అవైడెన్స్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ ఫాలో అసిస్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిషన్ అవైడెన్స్ అసిస్ట్ వంటివి ఉంటాయి. ఇతర సేఫ్టీ ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, బ్లైండ్ వ్యూ మానిటర్, సరౌండ్ వ్యూ మానిటర్ వంటివి ఉన్నాయి.



* MG Astor
MG ఆస్టర్ టాప్-ఎండ్ షార్ప్ (O) (Savvy) వేరియంట్‌లో ADAS టెక్నాలజీని అందిస్తుంది. ఆస్టర్‌లోని ADAS సూట్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్/ప్రివెన్షన్, లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై-బీమ్ అసిస్ట్ బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ వంటివి ఉంటాయి. టాప్-ఎండ్ ట్రిమ్‌తో ఆఫర్‌లో ఉన్న ఇతర ఫీచర్లలో 6-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, కనెక్టెడ్-కార్ టెక్‌తో కూడిన 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 360-డిగ్రీ కెమెరా, పర్సనల్ AI అసిస్టెంట్ వంటివి ఉన్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Auto News, Honda, Hyundai, New cars

తదుపరి వార్తలు