THESE ARE THE BEST 5G SMARTPHONES AVAILABLE IN 2022 PREMIUM MODELS RELEASED AMONG THE TOP FEATURES GH VB
Best 5G phones: 2022లో లభిస్తున్న అత్యుత్తమ 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే.. టాప్ ఫీచర్లలో విడుదలైన ప్రీమియం మోడల్స్..
ప్రతీకాత్మక చిత్రం
రాబోయే కాలంలో దేశంలో 5జీ హవా కొనసాగనుంది. కొత్త ఏడాదిలో మీరు కొనగలిగే బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లను (Best 5G phones) పరిశీలించండి. వాటి గురించి తెలుసుకుందాం..
భారత్‌లో 5జీ(India 5G) విప్లవం మొదలైంది. 5జీ టెక్నాలజీ (5G Technology) ఇంకా అందుబాటులోకి రానప్పటికీ.. స్మార్ట్‌ఫోన్(SmartPhones) కంపెనీలు 5జీ స్మార్ట్ఫోన్లను (5G phones) పోటాపోటీగా విడుదల చేస్తున్నాయి. అంతేకాదు, అందుబాటు ధరలోనే వీటిని రిలీజ్ చేస్తుండటంతో అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. దీంతో రాబోయే కాలంలో దేశంలో 5జీ హవా కొనసాగనుంది. 2022 కొత్త ఏడాదిలో మీరు కొనగలిగే బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లను (Best 5G phones) పరిశీలించండి. అందులో మొదటిది.. యాపిల్ ఐఫోన్ 13 సిరీస్. యాపిల్ 2021 సెప్టెంబర్‌లో నాలుగు ఐఫోన్లను ఒకేసారి విడుదల చేసింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ వీటన్నింటిలో 5G సపోర్ట్‌ను అందించింది. ఐఫోన్13 సిరీస్ ధర $729 (54,000) నుంచి ప్రారంభమవుతుంది. ఇవి ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌ను అందించింది.
గూగుల్ పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6..
గూగుల్ పిక్సెల్ ఫోన్లు 5జీ టెక్నాలజీతో విడుదలయ్యాయి. గూగుల్ పిక్సెల్ 6ప్రో, పిక్సెల్6 పేర్లతో ఇవి మార్కెట్లోకి వచ్చాయి. ఈ ఫోన్లు $899 (67,000) వద్ద మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫ్లాగ్షిప్ కెమెరా సెటప్, కొత్త ఏఐ ఫీచర్లు, క్రిస్ప్ డిస్ప్లే వంటి అదిరిపోయే ఫీచర్లను అందించింది.
శామ్సంగ్ గెలాక్సీS21 అల్ట్రా..
శామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా రాణిస్తోంది. ఈ ఎలైట్ ఫ్లాగ్షిప్ ఫోన్లో పెద్ద, శక్తివంతమైన స్క్రీన్, అద్భుతమైన బ్యాక్ కెమెరా సెటప్‌ను అందించింది. అత్యుత్తమ ఫీచర్లు గల ఆండ్రాయిడ్ హ్యాండ్సెట్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
గూగుల్ పిక్సెల్ 4ఎ 5జీ, పిక్సెల్ 5..
గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్ 4A 5G రెండూ 5జీ టెక్నాలజీతో విడుదలయ్యాయి. వీటిలో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని అందించింది. అద్భుతమైన కెమెరాలు, గూగుల్ సాఫ్ట్వేర్ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. పిక్సెల్ 5 ఫోన్లలో 90Hz డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌ను అందించింది. అంటే వైర్లెస్ విధానంలో వీటిని ఛార్జ్ చేయవచ్చు.
మోటరోలా ఎడ్జ్ ప్లస్..
మోటరోలా ఎడ్జ్ ప్లస్ ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఈ 5జీ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 865 చిప్సెట్, భారీ బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్‌తో కూడిన OLED స్క్రీన్ వంటివి అందించింది.
వన్‌ప్లస్ 9, 9 ప్రో..
వన్‌ప్లస్ 9, 9 ప్రో వారి అద్భుతమైన పనితీరు, డిజైన్లు, సాధారణంగా మంచి కెమెరాలతో ఆకట్టుకున్నాయి. రెండింటిలోనూ 5G టెక్నాలజీని అందించింది. సరసమైన ధరలోనే అదిరిపోయే ఫీచర్లను అందించింది. ఇది మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ S21..
శామ్సంగ్ గెలాక్సీ S21 నెక్స్ట్-జెన్ ఫ్లాగ్షిప్ లైనప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా విడులైంది. ఇది $800 (రూ.59,600) ధర వద్ద ప్రారంభమవుతుంది. అద్భుతమైన డిజైన్ గల ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్తో పనిచేస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ A52 5G..
శామ్సంగ్ గెలాక్సీ A52 5G 6.5 అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ నాలుగు బ్యాక్ కెమెరాలతో వస్తుంది. దీనిలోని 4,500-mAh బ్యాటరీ 1.5 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. గెలాక్సీ A52 5G $500 (రూ.37,000) ధర లోపు ఉత్తమ 5G స్మార్ట్‌ఫోన్.
మోటరోలా వన్ 5జీ ఏస్..
జనవరిలో విడుదలైన మోటరోలా వన్ 5G ఏస్ ప్రస్తుతం $400 (రూ.30,000) లోపు అందుబాటులో ఉన్న అత్యుత్తమ 5జీ స్మార్ట్‌ఫోన్. ఇది 6.7 -అంగుళాల పెద్ద IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750 జీ ప్రాసెస్‌తో పనిచేస్తుంది. 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ మాక్రో, 48 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలను అందించింది.
వన్‌ప్లస్ నార్డ్, నార్డ్ ఎన్10 5G..
వన్‌ప్లస్ మిడ్‌రేంజ్ సిరీస్‌లో నార్డ్ N10 5జీ మార్కెట్లోకి వచ్చింది. ఇది 6.49 -అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. మిడ్‌రేంజ్ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందించింది. అయితే, ప్రస్తుతానికి ఇది యూకే మార్కెట్లోనే అందుబాటులో ఉంది.
శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 3..
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫ్లాగ్షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇది మంచి పనితీరు, కెమెరాలు, బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటాయి,
మోటరోలా వన్ 5G..
మోటరోలా వన్ 5G మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మొత్తం ఆరు కెమెరాలు, 90Hz అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించింది. అయితే, ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది.
శామ్సంగ్ గెలాక్సీ A71 5G..
శామ్సంగ్ గెలాక్సీ A71 5G 6.7- అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీనిలో నాలుగు బ్యాక్ కెమెరాలు, బలమైన 4,500-mAh బ్యాటరీని అందించింది. ప్రస్తుతం ఇది యూఎస్ మార్కెట్లో అందుబాటులో ఉంది.
సోనీ ఎక్స్‌పీరియా 5 II..
సోనీ ఎక్స్‌పీరియా 5 II గేమ్‌లు ఆడటానికి, ఫోటో షూట్ చేయడానికి, వీడియో రికార్డ్ చేయడానికి బెస్ట్ స్మార్ట్‌ఫోన్. అయితే, దీని ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. దీనిలో అదిరిపోయే ఫీచర్లను అందించింది. దీనిలోని క్వాసీ మిర్రర్‌లెస్ కెమెరా 4K 120fps వీడియోను రికార్డ్ చేయగలదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.