నేటి డిజిటల్ యుగంలో దాదాపు అన్ని రకాల సేవలు యాప్‌ల (Apps) ద్వారా అందుతున్నాయి. ఎంటర్ట్రైన్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వరకు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లకు విడిగా యాప్‌లు డెవలప్ చేస్తుంటారు. తాజాగా ఇంటర్నేషనల్ టెక్ కంపెనీ యాపిల్ (Apple).. యాప్ స్టోర్ అవార్డ్స్-2022 విజేతలను ప్రకటించింది. ఈ ఏడాది విన్నర్స్ జాబితాలో 16 యాప్స్, గేమ్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యాప్ బీ రియల్ ఐఫోన్ యాప్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన BeReal అనే సంస్థ 2020లో అదే పేరుతో యాప్‌ను ప్రారంభించింది. దీని ఇంటర్ఫేస్ ప్రత్యేకంగా ఉంటుంది. BeReal కెమెరా ప్రత్యేకంగా డిజైన్ అయి ఉంటుంది. రియర్, ఫ్రంట్ కెమెరాల నుంచి ఏకకాలంలో ఫోటోలు తీయడం దీని ప్రత్యేకత.
ఐప్యాడ్ యాప్ ఆఫ్ ది ఇయర్ గుడ్నోట్స్5
అదేవిధంగా టైమ్ బేస్ టెక్నాలజీ లిమిటెడ్ నుంచి గుడ్నోట్స్ 5, ఐప్యాడ్ యాప్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు పొందింది. ఎక్కడ పనిచేసినా డిజిటల్ నోట్స్‌ను యాక్సెస్ చేయడానికి Macలో GoodNotes5ను ఉపయోగించుకోవచ్చు. iCloudతో మీ డిజిటల్ నోట్స్ సంబంధించిన డివైజస్‌తో ఏక కాలంలో కనెక్ట్ అవుతాయి. కంప్యూటర్లో డిజిటల్ నోట్స్‌ని యాక్సెస్ చేయడానికి GoodNotes5 యాప్ బాగా ఉపయోగపడుతుంది. మరోవైపు ఐఫోన్ గేమ్ ఆఫ్ ది ఇయర్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ నుంచి అపెక్స్ లెజెండ్స్ మొబైల్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఏ యాప్‌లు, గేమ్‌లు అవార్డులు అందుకున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ అవార్డ్స్‌పై యాపిల్ సీఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం App Store అవార్డు విజేతలు యాప్స్ ద్వారా తాజా, ఆలోచనాత్మక విధానంలో యూజర్స్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగుపరిచినట్లు చెప్పారు.
యాపిల్ యాప్ స్టోర్- 2022 బెస్ట్ యాప్ అవార్డ్స్ విజేతలు
ఐఫోన్ యాప్ ఆఫ్ ది ఇయర్ - బీ రియల్
ఐప్యాడ్ యాప్ ఆఫ్ ది ఇయర్ - గుడ్ నోట్స్ 5
Mac యాప్ ఆఫ్ ది ఇయర్ - MacFamilyTree 10
యాపిల్ టీవీ యాప్ ఆఫ్ ది ఇయర్ - ViX
యాపిల్ వాచ్ యాప్ ఆఫ్ ది ఇయర్ - జెంటలర్ స్ట్రీక్
యాపిల్ ప్లే స్టోర్-2022 బెస్ట్ గేమింగ్ యాప్ అవార్డ్స్
ఐప్యాడ్ గేమ్ ఆఫ్ ది ఇయర్ - Moncage
Mac గేమ్ ఆఫ్ ది ఇయర్ - ఇన్‌క్రిప్షన్
యాపిల్ టీవీ గేమ్ ఆఫ్ ది ఇయర్ - ఎల్ హిజో
యాపిల్ ఆర్కేడ్ గేమ్ ఆఫ్ ది ఇయర్ - వైల్డ్ ఫ్లవర్స్
చైనా గేమ్ ఆఫ్ ది ఇయర్ - లీగ్ ఆఫ్ లెజెండ్స్ ఎస్పోర్ట్స్ మేనేజర్
ఇతర యాప్ స్టోర్ యాప్ వినర్స్
హవ్ వీ ఫీల్(How We Feel), డాట్స్ హోమ్ (Dot’s Home), లాకెట్ విడ్జెట్(Locket Widget), వాటర్లామా(Water Llama)ఇనువా - ఎ స్టోరీ ఇన్, ఐస్ అండ్ టైమ్ (Inua - A Story in Ice and Time) యాప్‌లు కూడా అవార్డులు అందుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple, Apple iphone