• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • THESE 7 FOOT ROBOTS ARE BEING USED IN JAPANESE CONVENIENCE STORES TO COMBAT LABOUR SHORTAGE NK

Japan Robots: రోబోలను అలా కూడా వాడేస్తున్నారు... ఇక మనుషులతో పనిలేదా?

Japan Robots: రోబోలను అలా కూడా వాడేస్తున్నారు... ఇక మనుషులతో పనిలేదా?

Japan Robots: రోబోలను అలా కూడా వాడేస్తున్నారు... (credit - youtube)

Japan Robots: జపాన్ ప్రజలకు... రోబోలంటే విపరీతమైన ఇష్టం. ప్రతి అంశంలో రోబో టెక్నాలజీని వాడేసుకుంటున్నారు. కొత్తగా ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.

  • Share this:
    Japan Robots: కరోనా వైరస్... చైనాలో వచ్చినప్పుడు... అది చాలా వేగంగా వ్యాపించింది. ముఖ్యంగా వుహాన్ నగరం సహా చాలా నగరాల్లో ఆస్పత్రులు... టెక్నాలజీని బాగా ఉపయోగించాయి. సరికొత్త హైటెక్ పరికరాల్ని వాడుకున్నాయి. తద్వారా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తూ... డాక్టర్లకు కరోనా సోకకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రోబోలు బాగా ఉపయోగపడ్డాయి. అవే మందులు, ఆహారాన్ని పేషెంట్ల దగ్గరకు తీసుకెళ్లాయి. డాక్టర్లు మాటిమాటికీ పేషెంట్ల దగ్గరకు వెళ్లాల్సిన పనిలేకుండా పోయింది. రోబోలే టెంపరేచర్ తెలుసుకున్నాయి, రోబోలే క్లీన్ చేశాయి. ఐతే... ఆ రోబోలకు 5జీ టెక్నాలజీ ఉంది. ప్రత్యేక మానిటర్లు ఉన్నాయి. తద్వారా డాక్టర్లు వాటితో పేషెంట్ల రికార్డులు తెలుసుకున్నారు.

    ఈ సంవత్సరం 8 నెలల్లో... ఇలాంటి సర్వీస్ రోబో టెక్నాలజీ చాలా వచ్చింది. భారత్ సహా ఎన్నో దేశాలు రోబో టెక్నాలజీని వాడుకుంటున్నాయి. పార్కులు, పబ్లిక్ ప్రదేశాల్లో రోబోలతో సర్వీస్ పొందుతున్నారు. పబ్లిక్ ఏరియాల్లో రోబోలే మానిటరింగ్ చేసే పరిస్థితి ఉంది. సేఫ్ డిస్టాన్స్ పాటించనివారిని రోబోలే హెచ్చరిస్తున్నాయి.

    సింగపూర్‌లో రోబోడాగ్స్... పార్కుల దగ్గర ఉంటూ... సేఫ్ డిస్టాన్స్ పాటించమనీ, మాస్క్ పెట్టుకోమనీ చెబుతున్నాయి. అచ్చం కుక్కలా కనిపించే... నాలుగు కాళ్ల రిమోట్ కంట్రోలింగ్ యంత్రాన్ని బోస్టన్ డైనమిక్స్ తయారుచేసింది. కరోనా పోయే వరకూ... రోబోల వాడకం కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది.

    జపాన్‌వో ఇప్పుడు ప్రత్యేక రోబోలు దర్శనమిస్తున్నాయి. ఆ దేశంలో ముసలివాళ్లు ఎక్కువ. కరోనా సమయంలో వారికి... అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి సమయంలో... వర్కర్ల కొరత ఎక్కువగా ఏర్పడింది. జపాన్‌లోని చాలా స్టోర్స్... ప్రత్యేక రోబోలను రంగంలోకి దింపాయి. ఇవి... వస్తువుల్ని మొయ్యడం, సర్దడం వంటి పనులు చేస్తున్నాయి. మనుషులకు అలసట ఉంటుంది... రోబోలకు అది ఉండదు కాబట్టి... అవి కంటిన్యూగా పనిచేస్తున్నాయి.

    ముసలివాళ్లు ఎక్కువవడంతో... జపాన్‌లో యువతీ, యువకుల కొరత బాగా ఉంది. లేబర్ షార్టేజ్ కనిపిస్తోంది. తమకు సెట్ అయ్యే యువత దొరకట్లేదంటున్న స్టోర్స్ యజమానులు... రోబోలే తమకు ఆధారం అంటున్నారు. జపాన్‌లో మూడొంతుల మంది ప్రజల వయసు 65 ఏళ్లకు పైనే ఉంది. అందుకే... చాలా కంపెనీలు... 6, 7 అడుగుల ఎత్తున్న రోబో వర్కర్లను రంగంలోకి దింపుతున్నాయి.

    ఇవి మోటెల్ టి (Model-T) రోబోలు. వీటిని ఫ్యామిలీ మార్ట్ సంస్థ ముందుగా వాడటం మొదలుపెట్టింది. ఈ సంస్థ జపాన్‌లో రెండో పెద్ద స్టోర్. టెలెక్సిస్టెన్స్ కంపెనీతో డీల్ కుదుర్చుకొని... రోబోలను ఉపయోగించుకుంటోంది. ఆండ్రాయిడ్ అనే మరో రోబో... మనుషుల కంట్రోల్‌లో పనిచేసే రిమోట్ కంట్రోల్ రోబో. ఇది రకరకాలుగా కదులుతూ... ఎన్నో పనులు చెయ్యగలదు. ఇవి భారీ వస్తువుల్ని ఎత్తగలవు, మోసుకెళ్లగలవు, వాటిని ప్రత్యేక ర్యాకుల్లో ఉంచగలవు. ఈ రోబోలను ఆపరేట్ చెయ్యడానికి ప్రతీ స్టోర్‌లో ఓ ఆపరేటర్ కావాల్సి ఉంటుంది.
    Published by:Krishna Kumar N
    First published: