Home /News /technology /

THESE 5G PHONES LAUNCHING IN INDIA IN JULY 2022 UMG GH

5G Smart Phones: గ్యాడ్జెట్స్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. జులైలో లాంచ్ కానున్న 5జీ స్మార్ట్ ఫోన్స్..!

జులైలో లాంచ్ అయ్యే 5జీ మొబైల్స్

జులైలో లాంచ్ అయ్యే 5జీ మొబైల్స్

ఈ ఏడాది ఇప్పటికే సగం పూర్తయింది. ఇప్పటి వరకు అనేక 5జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే గత నెల జూన్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో స్మార్ట్ ఫోన్స్ విడుదల కాలేదు. దీంతో గాడ్జెట్స్ లవర్స్ కొంత నిరాశకు గురయ్యారు. జులైలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే.

ఇంకా చదవండి ...
ఈ ఏడాది ఇప్పటికే సగం పూర్తయింది. ఇప్పటి వరకు అనేక 5జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే గత నెల జూన్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో స్మార్ట్ ఫోన్స్ విడుదల కాలేదు. దీంతో గాడ్జెట్స్ లవర్స్ కొంత నిరాశకు గురయ్యారు. కాబట్టి జులైలో విడుదలయ్యే మోడల్స్ గురించి యూజర్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ల జాబితాపై ఓ లుక్కేయండి.

* నథింగ్ ఫోన్ (1)
నథింగ్ ఫోన్ (1) అత్యంత ప్రచారం పొందిన 5G స్మార్ట్‌ఫోన్. ఇది జులై 12న అంటే నేడు, భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. న్యూ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌కు బదులుగా, నథింగ్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 778G SoC ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌కి సపోర్ట్‌నిస్తుంది. పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌‌తో దీన్ని తయారీ చేశారు. 30W వైర్డు ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది లాంచ్ కానుంది. దీని ధర రూ.30వేల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరాలను అమర్చారు.

ఇదీ చదవండి: పొరిగింటోళ్లకి రూ.19 లక్షల గిఫ్ట్ ఇచ్చిన మహిళ.. ఎందుకో తెలుసా..? ఈ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే


* రెడ్‌మీ కె50ఐ
రెడ్‌మీ చాలా కాలం తర్వాత కె సిరీస్‌ను భారత మార్కెట్లలోకి తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రెడ్‌మీ కె50ఐ మోడల్ ను జులై 20న భారత్‌లో లాంచ్ చేయనుంది. మూడేళ్ల తర్వాత రెడ్‌మి కె సిరీస్ బ్రాండ్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను కొన్నిటిని ఇప్పటికే ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించింది రెడ్‌మీ. మీడియా టెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌‌తో దీన్ని రూపొందించారు. స్నాప్ డ్రాగన్ 870 లేదా స్నాప్ డ్రాగన్ 778G+ SoC ద్వారా ఇది మెరుగైన పనితీరును కనబర్చుతుంది. ఈ 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌‌తో లాంచ్ కానున్నట్లు సమాచారం. దీని ధర రూ. 30వేల వరకు ఉండవచ్చు. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5080mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నట్లు సమాచారం.

* శామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 5జీ
బడ్జెట్ రేంజ్‌లో జులైలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 5జీ. ఇది జులై 14న భారత మార్కెట్లలోకి విడుదల చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన రెండు వెర్షన్‌లను విడుదల చేయడానికి కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఒకటి 4G కాగా, మరొకటి 5G. ఈ రెండు మోడల్స్‌లో వేర్వేరు స్పెసిఫికేషన్‌లు ఉన్నట్లు సమాచారం. ఈ కొత్త సామ్‌సంగ్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నోచ్డ్ డిస్‌ప్లే డిజైన్ ఉంటుంది. ఫోన్ హుడ్ కింద 5,000mAh బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్ 12GB RAM సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC, 90Hz రిఫ్రెష్ రేటుతో 6.5-అంగుళాల HD+ స్క్రీన్‌‌తో రానున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీని ధర రూ. 15,000 రేంజ్‌లో ఉండవచ్చని సమాచారం.



* ఒప్పో రెనో 8 సిరీస్
ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో జూలై 18న సాయంత్రం 6 గంటలకు లాంచ్ కానున్నట్లు ఒప్పో ప్రకటించింది. గొరిల్లా గ్లాస్ 5, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. 6.7-అంగుళాల 120Hz అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ, మారిసిలికాన్ X-పవర్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఒక 32-మెగాపిక్సెల్ కెమెరా ఇందులో అమర్చినట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 29990 నుంచి ప్రారంభం కానుంది.
Published by:Mahesh
First published:

Tags: 5g mobile, 5g smart phone, Android, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు