వాట్సాప్‌ చాట్ చేసేవారిలో వీరే ఎక్కువ.. మీ ఫ్రెండ్స్‌లో అలాంటివారున్నారా..?

వాట్సాప్ యాప్ లాంచ్ అయి 2019 ఫిబ్రవరికి సరిగ్గా 10ఏళ్లు అయింది. ఈ పదేళ్ళలో ఈ సోషల్ యాప్ చాలా పాపులర్ అయింది. ఫేమస్ మెసేజ్ యాప్‌ లిస్ట్‌లో ముందువరుసలో ఉంది. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

Amala Ravula | news18-telugu
Updated: June 13, 2019, 1:29 PM IST
వాట్సాప్‌ చాట్ చేసేవారిలో వీరే ఎక్కువ.. మీ ఫ్రెండ్స్‌లో అలాంటివారున్నారా..?
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: June 13, 2019, 1:29 PM IST
వాట్సాప్ చాట్ చాలామంది ఉపయోగిస్తారు. నేడు ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ దాదాపు ఉండదనే చెప్పాలి. ఎన్నో ఫీచర్స్‌తో రోజురోజుకీ అప్‌డేట్ అవుతూ యూజర్స్ మనసు గెలుస్తున్న వాట్సాప్‌లో చాట్ చేసే వారిలో ఎక్కువగా ఎవరుంటారంటే..
గుడ్ మార్నింగ్/ గుడ్ నైట్ మెసేజింగ్ పంపేవారు : చాలామంది ఉదయం కాగానే గుడ్ మార్నింగ్.. రాత్రి కాగానే గుడ్‌నైట్ మెసేజ్‌లు చెప్పేందుకు ఉపయోగిస్తారు. మిగతా సమయాన్ని ఎక్కువగా పట్టించుకోరు. వీరు ఎక్కువగా రకరకాల కోట్స్, చక్కని ఫ్లవర్స్ ఇమేజ్‌తో కూడిన మెసేజ్‌లు ఎక్కువగా ఫార్వర్డ్ చేస్తుంటారు.
వాయిస్ మెసేజ్ పంపేవారు : చాలామంది బద్ధకస్తులుంటారు. అలాంటివారు ఎక్కువగా మెసేజ్ టైప్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఫీలై వాయిస్ రికార్డ్ చేసి ఫార్వర్డ్ చేస్తారు. మీరు టైప్ మెసేజ్ చేసిన సరే.. వీరి నుంచి వాయిస్ మెసేజ్ మాత్రమే వస్తుంది.

కవితాత్మక సందేశాలు పంపేవారు : చాలామంది కొన్ని విషయాలను కవితాత్మకంగా వారే రచించింది అందరికీ ముందుగా వారే పంపాలని తాపత్రయపడుతుంటారు. వారి ఫ్రెండ్స్, బంధువులు ఇలా ప్రతీ ఒక్కరి కాంటాక్ట్స్‌ని తీసుకుని రోజంతా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు..
కథలు పంపేవారు : ఇలాంటివారు కాస్తా తక్కువగానే ఉంటారు. వీరు సొంతకథలు, నీతికథలు ఇలాంటి పెద్దపెద్ద కథలు పంపిస్తుంటారు. వాటిని తమ స్టేటస్‌గా కూడా పెట్టేస్తుంటారు. రోజూ చూసిచూసి ఇలాంటి మెసేజ్‌లు స్వైప్ చేయడానికే మనం కాస్తా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఇంకొదరేమో పాటలని కూడా పెట్టేస్తుంటారు.
ఎమోజీ లవర్స్: కొంతమంది ఉంటారు. వారు ఎంతపెద్ద మెసేజ్ అయినా సరే.. వారి ఎక్స్‌ప్రెషన్‌ని చిన్న ఎమోజీ ద్వారా తెలియజేస్తారు. కొన్నికొన్ని సందర్భాల్లో వారు పెట్టే ఎమోజీ పూర్తి అర్థం తెలుసుకోలేం.


ఈ లిస్ట్‌లో మరి మీ ఫ్రెండ్స్ ఉన్నారా..
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...