స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ఫోన్ మోడల్స్‌కు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ, కొత్త ఫీచర్లను పరిచయం చేస్తాయి. అయితే కాలం గడిచేకొద్దీ ఓల్డ్ మోడల్స్‌కు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లు అందించవు. అయితే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తమ పాత OnePlus 7 సిరీస్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఆక్సిజన్ OS 12 అప్డేట్ను అందిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఓఎస్‌తో రానున్న ఫీచర్లు ఏవో చూద్దాం.andrio
అప్డేట్ అందుకోనున్న మోడల్స్‌లో OnePlus 7, OnePlus 7 Pro, OnePlus 7T, OnePlus 7T Pro మోడల్స్ ఉన్నాయి. ఈ అప్డేట్తో వన్‌ప్లస్ ఫోన్లలో కొత్త స్మార్ట్ బ్యాటరీ ఇంజిన్, రీడిజైన్ చేసిన యాప్ ఐకాన్స్, కొత్త పేజీ లేఅవుట్ వంటి సరికొత్త మార్పులు రానున్నాయి. విజన్, హియరింగ్, ఇంటరాక్టివ్ యాక్షన్స్, టాక్‌బ్యాక్ వంటి వాటిని తాజా అప్డేట్లో ఒకే చోట అందిస్తారు. ఇవి ఫోటోలు, ఫోన్, మెయిల్, క్యాలెండర్ సహా మరిన్ని సిస్టమ్ యాప్‌లకు సపోర్ట్ చేస్తాయి.
ఇన్స్పైరింగ్ విజువల్స్‌తో మరింత పర్సనలైజ్డ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం కాన్వాస్ AOD విభిన్న స్టైల్ లైన్స్, కలర్స్ అందిస్తుంది. కొత్తగా యాడ్ చేసిన మల్టిపుల్ బ్రషెస్, స్ట్రోక్‌లు కలర్ అడ్జస్ట్‌మెంట్‌లకు సపోర్ట్ చేస్తాయి. ఆప్టిమైజ్డ్ సాఫ్ట్వేర్ అల్గారిథం ఫేస్ రికగ్నిషన్‌ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేసింది.
రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు.. వచ్చేది ఎప్పుడంటే?
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఫీచర్ ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. ఇది క్విక్ సెట్టింగ్స్ ద్వారా వర్క్, లైఫ్ మోడ్ల మధ్య ఛేంజ్ కావడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా WLB 2.0 ఇప్పుడు స్పెసిఫిక్ లొకేషన్లు, Wi-Fi నెట్వర్క్, సమయం ఆధారంగా ఆటోమేటిక్ వర్క్/లైఫ్ మోడ్ స్విచింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. పర్సనలైజేషన్ ప్రకారం యాప్ నోటిఫికేషన్ ప్రొఫైల్‌లను కూడా అందిస్తుంది. టూ ఫింగర్ పించ్ జెస్టర్‌తో ఇప్పుడు గ్యాలరీలో టూ లేఅవుట్స్ మధ్య స్విచ్ కావచ్చు. బెస్ట్ క్వాలిటీ పిక్చర్లను క్రాప్ చేయవచ్చు. గ్యాలరీ లేఅవుట్‌ను మరింత ఆహ్లాదకరంగా మార్చుకొనే ఆప్షన్లు ఉన్నాయి.
బంగారం, వెండి కొనాలనుకునే వారికి అదిరే గుడ్ న్యూస్.. ఏకంగా రూ.1,400 పడిపోయిన ధరలు!
కార్డ్‌ల కోసం కొత్త అడిషనల్ స్టైల్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. డేటా కంటెంట్లను మరింత విజువల్‌గా, చదవడానికి సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది. షెల్ఫ్‌లో OnePlus స్కౌట్‌కి కొత్తగా యాడ్ చేసిన యాక్సెస్, యాప్‌లు, సెట్టింగ్‌లు, మీడియా డేటా మొదలైన వాటితో సహా ఫోన్లో మల్టిపుల్ కంటెంట్లను సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. డార్క్ మోడ్ ఇప్పుడు మూడు అడ్జస్ట్మెంట్ లెవల్స్‌కు సపోర్ట్ చేస్తుంది. మరింత పర్సనలైజ్డ్, కంఫర్టబుల్ ఎక్స్‌పీరియన్స్‌ను వినియోగదారులకు అందిస్తుంది.
కొత్తగా హైపర్‌బూస్ట్ ఎండ్-టు-ఎండ్ ఫ్రేమ్ రేట్ స్టెబిలైజర్ యాడ్ అవుతుంది. వాయిస్ ఎఫెక్ట్‌ని రికార్డ్ చేయడానికి లేదా రియల్ టైంలో వాయిస్ ఎఫెక్ట్‌ని చెక్ చేయడానికి కొత్తగా యాడ్ చేసిన వాయిస్ ఎఫెక్ట్ ప్రివ్యూ ఉపయోగపడుతుంది. కొత్తగా తీసుకొస్తున్న స్మార్ట్ బ్యాటరీ ఇంజిన్, స్మార్ట్ అల్గారిథమ్, బయోమిమెటిక్ సెల్ఫ్ రీస్టొరేషన్ టెక్నాలజీ ద్వారా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. రీడైజ్ ఐకాన్స్‌కు డెప్త్, టెక్ఛర్ యాడ్ అవుతుంది. స్పేస్‌ను మెరుగ్గా వినియోగిస్తాయి. కీలక సమాచారాన్ని ప్రత్యేకంగా ఉంచడానికి టెక్స్ట్, కలర్ ప్రెజెంటేజన్ను పేజ్ లే అవుట్ ఆప్టిమైజ్ చేస్తుంది. ఆప్టిమైజ్ చేసిన స్పామ్ బ్లాక్ రూల్స్‌తో MMS మెసేజ్‌లను బ్లాక్ చేసే ఫీచర్ వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android 12, Cell phone, Mobile phones, Oneplus, Smartphones