హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Services | అక్టోబర్ 1 నుంచి 5జీ సేవలు.. ముందుగా ఈ 13 ప్రాంతాల్లో అందుబాటులో!

5G Services | అక్టోబర్ 1 నుంచి 5జీ సేవలు.. ముందుగా ఈ 13 ప్రాంతాల్లో అందుబాటులో!

అక్టోబర్ 1 నుంచి 5జీ సేవలు.. ముందుగా ఈ 13 ప్రాంతాల్లో అందుబాటులో!

అక్టోబర్ 1 నుంచి 5జీ సేవలు.. ముందుగా ఈ 13 ప్రాంతాల్లో అందుబాటులో!

5G In India | మొబైల్ ఫోన్ వాడే వారికి గుడ్ న్యూస్. అతిత్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 1న 5జీ సేవలను అధికారికంగా ఆవిష్కరించబోతున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయో తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  5G Launch | దేశంలో 5జీ విప్లవానికి అంతా రెడీ అయ్యింది. వచ్చే నెల నుంచి 5జీ సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ (Modi) 5జీ (5G) సర్వీసులు ఆవిష్కరించబోతున్నారు. అక్టోబర్ 1న ప్రగతి మైదాన్‌లో జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ కార్యక్రమంలో 5జీ సేవలను అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. దీంతో టెలికం యూజర్లు హై స్పీడ్ ఇంటర్నెట్‌తో కూడిన 5జీ సేవలు అందబాటులోకి రానున్నాయి.

  నేషనల్ బ్రాండ్‌బాండ్ మిషన్ ఒక ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్‌ కింద సేవలు అందించే నేషనల్ బ్రాడ్‌బాండ్.. అక్టోబర్ 1న ప్రధాని మోదీ 5జీ సేవలను ఆవిష్కరిస్తారని వెల్లడించింది. ఆసియాలో జరుగుతున్న అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్‌గా నేషనల్ మొబైల్ కాంగ్రెస్‌ను చెప్పుకుంటారు. అంతేకాకుండా ఇండియా మొబైల్ కాంగ్రెస్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రధాని మోదీ 5జీ సర్వీసులను ఆవిష్కరిస్తారనే విషయం ఉంది.

  బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా పడిపోయిన ధరలు!

  ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా ఇండియా రవీందర్ ఠక్కర్ అందరూ ప్రధాని మోదీతో వేదికను పంచుకోబోతున్నారు. కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వంటి వారు కూడా కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.

  ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. ఇలా చేస్తే రూ.549కే స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు!

  తొలిగా 5జీ సేవలు 13 పట్టణాల్లో అందుబాటులోకి రానున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అన్ని కూడా ఒకేసారి 5జీ సేవలను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇండియా మొబైల్ కాంగ్రెట్ అక్టోబర్ 1 నుంచి 4 వరకు జరగుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్), సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

  అహ్మదాబాద్, బెంగళూరు, ఛండీగర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్ , జామ్ నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణే వంటి పట్టణాల్లో తొలిగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా 5జీ ఫోన్ ఉపయోగించే వారు 5జీ సేవలను వచ్చే వారం నుంచి పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు చేయొచ్చు. పలు రకాల కంపెనీలు 5జీ ఫోన్లను అందిస్తున్నాయి. వీటిల్లో మీకు నచ్చిన బ్రాండ్‌ ఫోన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: 5G, 5g mobile, 5g phones, 5g service, Narendra modi

  ఉత్తమ కథలు