హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

UPI: రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్స్‌పై ఛార్జీలు..కొత్త రూల్ లో బిగ్ ట్విస్ట్ ఇదే!

UPI: రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్స్‌పై ఛార్జీలు..కొత్త రూల్ లో బిగ్ ట్విస్ట్ ఇదే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2023 ఏప్రిల్‌ 1 నుంచి యూపీఐ పేమెంట్స్‌పై ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్‌పై యూజర్లు 1.1% వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ కంపెనీలకు లాభాలు తీసుకురానుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

UPI: దేశంలో చాలామంది ప్రజలు గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి పేమెంట్ యాప్స్‌(Payment apps) వాడుతున్నారు. రూ.10 నుంచి రూ.10 వేల దాకా ఎంతైనా సరే డిజిటల్‌ రూపంలో యూపీఐ పేమెంట్స్‌(UPI Payments) చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఎంత మొత్తమైనా సరే సింపుల్‌గా పేమెంట్స్ యాప్స్ ద్వారా చెల్లిచడం అలవాటైంది. అయితే ఇప్పుడు సీన్‌ మారబోతుంది. ఇకపై యూపీఐ చెల్లింపులతో భారం పడనుంది. దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త రూల్స్ ప్రతిపాదించింది. యూపీఐ ఛార్జీలపై ఇంటర్‌ చేంజ్‌ ఫీజు విధిస్తూ ఎన్‌పీసీఐ మార్చి 24న ఓ సర్క్యూలర్‌ విడుదల చేసింది.

తాజా సర్క్యూలర్‌ ప్రకారం.. 2023 ఏప్రిల్‌ 1 నుంచి యూపీఐ పేమెంట్స్‌పై ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్‌పై యూజర్లు 1.1% వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ కంపెనీలకు లాభాలు తీసుకురానుంది.

* ఏమిటీ ఇంటర్‌ చేంజ్‌ ఛార్జీస్‌?

ఆన్‌లైన్‌లో చెల్లించే లేదా చేసే ఆర్థిక లావాదేవీలకు అయ్యే ఖర్చును ఇంటర్‌ఛేంజ్‌ ఫీజుగా పరిగణించవచ్చు. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్ (ఆన్‌లైన్‌ వాలెట్స్‌, కార్డ్స్‌, పేపర్‌ వోచర్స్‌ లాంటివి) ఉపయోగించి వినియోగదారులు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై ఈ ఫీజు వర్తిస్తుంది. ఈ సర్క్యూలర్‌ ప్రకారం బ్యాంకు , పీపీఐ వాలెట్‌ మధ్య జరిగే పీర్‌-టు-పీర్‌, పీర్‌-టు-పీర్‌-మర్చంట్‌ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీస్‌ ఉండవు.

* ఈ ఫీజు ఎంతంటే..

యూపీఐ చెల్లింపులు అందరికీ ఒకే మాదిరిగా కాకుండా రంగాన్ని బట్టి మారుతుంటుంది. అందులో భాగంగా 0.5% నుంచి 1.1% వరకు ఛార్జీలను వసూలు చేయనున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ చెల్లింపులపై 0.5%, వ్యవసాయం, విద్య , టెలికాం వంటి వాటి కోసం 0.7% సూపర్‌ మార్కెట్లలో 0.9%, రైల్వే, పాలసీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ లాంటి వాటిపై 1% వరకు ఈ మొత్తాన్ని వసూలు చేయనున్నారు. వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉన్న యూపీఐల ద్వారా చెల్లింపులు చేస్తే సదరు పీపీఐని జారీ చేసిన సంస్థలు వినియోగదారుడి బ్యాంకుకు 15 బేసిక్‌ పాయింట్లు చెల్లించాల్సి ఉంటుంది.

* సెప్టెంబర్‌ 30 తర్వాత మరోసారి సమీక్ష

ఫిన్‌టెక్‌ సంస్థలకు ఈ ఛార్జీలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గతేడాది మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే ఫిన్‌టెక్‌ సంస్థలు దీనిపై స్పష్టత, అవగాహన లేక ఆర్‌బీఐని సంప్రదించలేదు. దీంతో గడువు ముగిసిపోయింది. అయితే ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చిన తర్వాత, 2023 సెప్టెంబర్‌ 30 వరకు పరిశీలిస్తామని, ఆ తర్వాత మరోసారి పరిశీలిస్తామని ఎన్‌పీసీఐ సర్క్యులర్‌లో తెలిపింది.

కొంగతో యువకుడి స్నేహం.. తెరవెనక ఆసక్తికర కథ

ఛార్జీలు పడేది వాళ్లమీద మాత్రమే

తాజాగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా... వినియోగదారులకు ఎటువంటి ఛార్జీలు విధించబడదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త రూల్ ప్రకారం, ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలకు (PPI)ఇంటర్‌చేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. అంటే వాలెట్లు, క్రెడిట్ కార్డ్‌లు వంటి PPIల ద్వారా చేసే UPI లావాదేవీలకు 1.1% ఇంటర్‌చేంజ్ ఫీజు ఉంటుంది. బ్యాంక్ ఖాతా నుండి బ్యాంక్ ఖాతా ఆధారిత UPI చెల్లింపులు అంటే సాధారణ UPI చెల్లింపులకు ఎటువంటి ఛార్జీలు లేవు. యూజర్లు UPI ప్రారంభించబడిన యాప్‌లలో... బ్యాంక్ ఖాతాలు, రూపే క్రెడిట్ కార్డ్ మరియు ప్రీపెయిడ్ వాలెట్‌లను ఉపయోగించుకునే ఎంపికను కలిగి ఉంటారు" అని NPCI యొక్క ట్విట్టర్ పోస్ట్ మరింత స్పష్టం చేసింది.

First published:

Tags: Google pay, Phone pay, UPI, Upi payments

ఉత్తమ కథలు