ఆ ఫోన్‌కి బ్యాటరీ ఉండదు... ఎందుకంటే ఛార్జింగ్ అవసరం లేదు మరి...

No Charging Phone : రోజురోజుకూ ప్రపంచం మారిపోతోంది. బ్యాటరీతో పనిలేని ఫోన్ తయారవుతోంది. అవి వస్తే, మనకిక ఛార్జింగ్ సమస్యలు లేనట్లే.

Krishna Kumar N | news18-telugu
Updated: May 15, 2019, 2:58 PM IST
ఆ ఫోన్‌కి బ్యాటరీ ఉండదు... ఎందుకంటే ఛార్జింగ్ అవసరం లేదు మరి...
ఛార్జింగ్ అవసరం లేని మొబైల్ (Image : Twitter)
  • Share this:
మొబైల్‌లో ఉన్న బ్యాటరీ ఎంతకాలం పనిచేస్తుందన్నదాన్ని బట్టీ... ఆ స్మార్ట్ ఫోన్ ఎంతకాలం వాడొచ్చో నిర్ణయించుకుంటున్నాం. చాలా మంది బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండే స్మార్ట్ మొబైళ్లనే కొంటున్నారు. ఈ రోజుల్లో చాలా ఫోన్లు 3000mAh లేదా 4000mAh బ్యాటరీలతో వస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువవ్వడంతో ఛార్జింగ్ సమస్య వెంటాడుతోంది. ఛార్జింగ్ కోసం మనం అదనంగా పవర్ బ్యాంకుల్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి. మాటిమాటికీ ఛార్జింగ్ డౌన్ అయిపోతుంటే, ఇరిటేషన్‌తో ఫోన్లను నేలకేసి కొడుతున్నారు చాలా మంది. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు... బ్యాటరీలతో పనిలేని మొబైల్ ఫోన్‌ను తయారుచేశారు. బ్యాటరీ లేదంటే ఛార్జింగ్ లేనట్లే. అయినప్పటికీ ఆ ఫోన్ పనిచేస్తోంది.


అసలు ఫోన్లు ఎలక్ట్రిక్ పవర్ బదులు... రేడియో సిగ్నల్స్ వాడుకొని పనిచేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించి, ఆ దిశగా ప్రయోగాలు చేశారు శాస్త్రవేత్తలు. అవి సక్సెస్ అయ్యాయి. ఫలితంగా బ్యాటరీలేని ఆ ఫోన్లు... లైట్ వెయిట్ మైక్రోవేవ్స్‌ని ఉపయోగించి పనిచేస్తున్నాయి. ఆ మొబైల్ ఫోన్ ద్వారా... స్కైప్ కాల్స్ చేయడానికి వీలైంది.

ప్రస్తుతం బ్యాటరీ లేని ఆ మొబైల్ ఫోన్... ఎలక్ట్రిసిటీ పవర్‌తో పనిచేసే వీలుంటుందా అన్నదానిపై పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. అవి సక్సెస్ అయితే, అతి త్వరలో బ్యాటరీలేని, ఛార్జింగ్ అవసరం లేని మొబైల్ ఫోన్లను మనం వాడొచ్చు. అదే జరిగితే... స్మార్ట్ ఫోన్ ప్రపంచమే మారిపోతుంది. స్మార్ట్ ఫోన్లు మరింత స్లిమ్‌ డిజైన్‌తో తయారుచేయడానికి వీలవుతుంది. మొబైల్ ఫోన్ల పరిశోధనల్లో ఇదో విప్లవాత్మక ముందడుగు అనే చెప్పుకోవచ్చు.

 

ఇవి కూడా చదవండి :

చ్యూయింగ్ గమ్ తింటున్నారా... కాన్సర్ వస్తుందట... జాగ్రత్త...!!

ఈ వ్యాపారం చెయ్యండి... నెలకు రూ.1.69 లక్షలు సంపాదించండి...


మహిళల ముందుకు నగ్నంగా వచ్చిన కానిస్టేబుల్... వాళ్లు ఏం చేశారంటే...
First published: May 15, 2019, 2:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading