విజయవాడకు భూకంపం ముప్పు... తీవ్రత ఎక్కువే...

Earthquake Alert : మన దేశంలో మొత్తం 50 నగరాలకు భూకంపం ముప్పు పొంచి ఉంది. దురదృష్టం కొద్దీ... విజయవాడలో తీవ్ర భూకంపం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

news18-telugu
Updated: October 15, 2019, 7:35 AM IST
విజయవాడకు భూకంపం ముప్పు... తీవ్రత ఎక్కువే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Earthquake Alert : సముద్రానికి దగ్గరగా ఉండే నగరాలకు భూకంపం వచ్చే ప్రమాదం ఎక్కువే. ఎందుకంటే... సముద్రాల్లోని భూ పలకాల్లో కదలిక ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా... సునామీలు, భూకంపాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న నగరాలు ఏవి అనే అంశంపై పెద్ద అధ్యయనం ఒకటి జరిగింది. మొత్తం 50 నగరాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. వాటిలో విజయవాడ కూడా ఉంది. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (NDMA), కేంద్ర ప్రభుత్వం కలిసి... భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక (Earthquake Disaster Risk Index) రిపోర్టును రెడీ చేశాయి. ఇందుకోసం కొన్ని అంశాల్ని లెక్కలోకి తీసుకున్నాయి. ఎంత మంది ప్రజలు ఉంటున్నారు? ఇళ్ల నిర్మాణం ఎలా ఉంది? నగరాలు ఎక్కడున్నాయి, ప్రజెంట్ వాటి పొజిషన్ ఏంటి? సముద్రానికి ఎంత దూరంలో ఉన్నాయి? ఇదివరకు అక్కడ భూకంపాలు వచ్చాయా? వంటి చాలా అంశాలు లెక్కలోకి తీసుకున్నాయి.

ఈ అధ్యయనం నెలో, రెండు నెలల్లోనో జరిగినది కాదు. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లోని ఎర్త్‌క్వేక్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ERCC) చీఫ్ ప్రొఫెసర్ ప్రదీప్ తన విద్యార్థులను ఈ రీసెర్చ్‌లో భాగం చేశారు. విద్యార్థులు మూడేళ్లపాటూ శ్రమించి రిపోర్ట్ సిద్ధం చేశారు. ఆ రిపోర్ట్‌ని ఐఐటీ ప్రొఫెసర్లు, కేంద్రం మళ్లీ చెక్ చేశాయి.

దేశంలోని 50 నగరాల్లో భూకంప ప్రభావం ఉండగా... వాటిలో 13 నగరాల్లో తీవ్రమైన భూకంపాలు రానున్నాయి. 30 నగరాల్లో రిక్టర్ స్కేలుపై 4 నుంచీ 6 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక... 7 నగరాల్లో అంతంతమాత్రంగా భూకంపాలు రానున్నాయి. ఐతే... అధిక భూకంపాలు వస్తాయని చెప్పిన నగరాల్లో విజయవాడ కూడా ఉంది. దాంతోపాటూ... ఢిల్లీ, కోల్‌కతా, పుణె, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌, సిలిగురి, డార్జిలింగ్‌, ఛండీగఢ్‌ వంటి నగరాలు ఉన్నాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లలో ఉన్నప్పుడు ఎదైనా కదలిక వస్తే... వెంటనే ఇళ్లలోంచీ బయటకు వచ్చేయాలని చెబుతున్నారు.

 


Pics : బొమ్మ కాదు బేబీ... ఇన్‌స్టాగ్రామ్ మోస్ట్ క్యూట్ గర్ల్ వయోలా 


ఇవి కూడా చదవండి :

Health Tips : పార్కులో 20 నిమిషాలు నడవండి... ఎంతో ఆరోగ్యం


Health Tips : బ్రెజిల్ నట్స్ తింటే... 20 రకాల ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips : పన్నీర్‌‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు