యుగాంతం ఎప్పుడు?... ఎలా?... లెక్క తేల్చేసిన భౌతిక సిద్ధాంతవేత్తలు...

ప్రళయం వస్తుంది... ప్రపంచం అంతరిస్తుంది... అనే మాటలు మనం తరచూ వింటున్నాం. ఈ కరోనా వచ్చిన కొత్తలో కూడా అలాగే అన్నారు కొందరు. ఐతే... కచ్చితంగా విశ్వం ఎప్పుడు అంతమవుతుందో క్లారిటీ ఇచ్చారు భౌతిక సిద్ధాంత వేత్తలు. ఎప్పుడో తెలుసుకుందాం.

news18-telugu
Updated: August 18, 2020, 7:46 AM IST
యుగాంతం ఎప్పుడు?... ఎలా?... లెక్క తేల్చేసిన భౌతిక సిద్ధాంతవేత్తలు...
విశ్వ అంతం ఎప్పుడు?... ఎలా?... లెక్క తేల్చేసిన భౌతిక సిద్ధాంతవేత్తలు...
  • Share this:
భౌతిక సిద్ధాంత వేత్త మాట్ కాప్లాన్ (Matt Caplan)... ఈ విశ్వం ఎప్పుడు పూర్తిగా అంతమవుతుందో వీలైనంతవరకూ టైమ్ ద్వారా లెక్క తేల్చారు. మనం టెన్షన్ పడాల్సిన పనిలేదు. యుగాంతం ఇప్పట్లో లేదు. అది జరిగేందుకు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టనుందని తేల్చారు. రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీకి చెందిన మంత్లీ నోటీసెస్ అనే జర్నల్‌లో ఈ అధ్యయన రిపోర్టు ఉంది. ఆ రిపోర్టు ప్రకారం... విశ్వం అంతరించేటప్పుడు ఈ విశ్వంలోని నక్షత్రాలు... కంటిన్యూగా పేలుతూనే ఉంటాయి. ఐతే... అలా పేలినప్పుడు బిగ్ బ్యాంగ్ లాంటిదేదీ జరగదు. బాణసంచా కాల్చినప్పుడు ఎలా చిటపటలాడుతాయో... అలా నక్షత్రాలు కూడా చిటపటలాడుతూ పేలతాయని తెలిపారు. యుగాంతం తర్వాత... చనిపోయిన నక్షత్రాలు, ఖాళీగా ఉన్న బ్లాక్ హోల్స్ మాత్రమే మిగులుతాయని ఆయన వివరించారు. ఆ సమయంలో కాంతి కూడా ప్రయాణించే అవకాశం ఉండదన్నారు. అంటే... అంతా చీకటే.

యుగాంతం తర్వాత ఉండేది విషాదకరమైన, ఒంటరైన, అతి చల్లటి ప్రదేశమేనట. దాన్ని హీట్ డెత్ అని పిలిచారు. అక్కడ ఫుల్లుగా బ్లాక్ హోల్స్, కాలి బూడిదైన నక్షత్రాలు ఉంటాయన్నారు కాప్లాన్. నక్షత్రాలు ఎలా చిటపటలాడతాయో, ఎలా అవి నల్లటి మరుగుజ్జు నక్షత్రాలుగా మారిపోతాయో కూడా తన రిపోర్టులో ఆయన వివరించారు.

ప్రస్తుతం మన సూర్యుడి కంటే... 10 రెట్లు చిన్నగా ఉండే నక్షత్రాలు... గ్రావిటీ లేదా సాంద్రత లేక... తమ కేంద్ర స్థానంలో ఐరన్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేక... సూపర్‌నోవాలా పేలిపోతున్నాయి. అవి తెల్లటి మరుగుజ్జు నక్షత్రాల్లా మారి.... కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు చల్లబడి... చీకటిగా మారి... చివరకు గడ్డకట్టిపోతాయని... నల్లటి మరుగుజ్జు నక్షత్రాల్లా తయారవుతాయని కాప్లాన్ వివరించారు. ఇక అవి ఎప్పటికీ కాంతిని ఇవ్వలేవన్నారు.

మరి ప్రపంచ అంతం ఎప్పుడు? త్వరలో ఈ భూమి అంతం అవుతుందా అనే భయాలకు కూడా సైంటిస్టులు చెక్ పెట్టారు. వచ్చే వెయ్యి సంవత్సరాల వరకూ... ప్రకృతి విపత్తుల ద్వారా ఈ భూమి అంతరించే పరిస్థితి ఉండదన్నారు. కానీ... యుగాంతాన్ని నమ్మేవారు మాత్రం... అంతా అయిపోయిందంటున్నారు... ఇది ప్రపంచ నాశనానికి చివరి రోజులు అని నమ్ముతున్నారు. అంతేకాదు... మన సౌరకుటుంబం చివర్లో మరో పెద్ద గ్రహం ఉందనీ... అది క్రమంగా భూమివైపు వచ్చి... భూమిని ఢీకొట్టనుందనే నమ్మకంతో వారు జీవిస్తున్నారు. దాని పేరు నిబిరు (Nibiru) గ్రహం లేదా ప్లానెట్ X అని కూడా పెట్టారు. ఆ గ్రహం భూమిని ఢీకొట్టినప్పుడు ప్రపంచ మానవులు అంత్యంత దారుణంగా చనిపోతారని వారు నమ్ముతున్నారు. ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఈ ప్లానెట్ X అనేది లేదనేందుకు ఆధారాలు లేవన్న నాసా... ఉంటే ఉండొచ్చని అంది. ఎవరైనా దాన్ని కనిపెడితే చెప్పాలని అంది. (https://solarsystem.nasa.gov/planets/hypothetical-planet-x/in-depth/) ఈ ప్రకటన ఇప్పుడు కాదు... ఐదారేళ్ల కిందటే చేసింది. అప్పటి నుంచి యుగాంతాన్ని నమ్మేవారు మరింతగా నమ్మకాన్ని పెంచుకున్నారు.

ఇలా ఎవరికి వారు యుగాంతంపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త అభిప్రాయాలు, అంచనాలూ వేస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: August 18, 2020, 6:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading