Home /News /technology /

THE VIVO S12 AND S12 PRO HAVE OFFICIALLY BEEN UNVEILED HERE IS THE PRICE AND SPECIFICATIONS GH SSR

Vivo S12: వివో ఎస్​ 12, ఎస్​12 ప్రో స్మార్ట్​ఫోన్లు లాంచ్.. ఐదు కెమెరాలతో పాటు అదిరిపోయే ఫీచర్లు

వివో ఎస్12 ప్రో

వివో ఎస్12 ప్రో

ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ వివో వరుసగా స్మార్ట్​ఫోన్లు విడుదల చేస్తూ మార్కెట్​ను విస్తరిస్తోంది. వివో తాజాగా తన వివో ఎస్​12 (Vivo S12) సిరీస్​లో ఒకేసారి రెండు స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేసింది. వివో ఎస్​12, ఎస్​12 ప్రో పేర్లతో వీటిని అధికారికంగా ఆవిష్కరించింది.

ఇంకా చదవండి ...
ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ వివో వరుసగా స్మార్ట్​ఫోన్లు విడుదల చేస్తూ మార్కెట్​ను విస్తరిస్తోంది. వివో తాజాగా తన వివో ఎస్​12 (Vivo S12) సిరీస్​లో ఒకేసారి రెండు స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేసింది. వివో ఎస్​12, ఎస్​12 ప్రో పేర్లతో వీటిని అధికారికంగా ఆవిష్కరించింది.

వివో ఎస్​12, వివో ఎస్​12 ప్రోలు మీడియాటెక్​ చిప్‌సెట్‌ ద్వారా పనిచేస్తాయి. వీటిలో మొత్తం ఐదు కెమెరాలను అమర్చింది. ముందు వైపు రెండు, వెనుక వైపు మూడు కెమెరాలను అందించింది.

వివో ఎస్​12, వివో ఎస్​12 ప్రో ధర

వివో ఎస్​12 బేస్ 8 జీబీ/256 జీబీ వేరియంట్​ CNY 2,799 (సుమారు రూ. 33,200) వద్ద లభిస్తుంది. దీని టాప్-ఎండ్​ 12 జీబీ ర్యామ్​/256 జీబీ వేరియంట్ CNY 2,999 (దాదాపు రూ. 35,550) వద్ద అందుబాటులో ఉంటుంది. మరోవైపు, వివో ఎస్​12 ప్రో బేస్ 8 జీబీ/256 జీబీ వేరియంట్ CNY 3,399 (దాదాపు రూ. 40,300) వద్ద లభిస్తుంది. 12 జీబీ/256 జీబీ వేరియంట్ CNY 3,699 (దాదాపు రూ. 43,850) వద్ద అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: Realme GT 2 Pro: జనవరి 4న రియల్​మీ జీటీ2 ప్రో స్మార్ట్​ఫోన్​ లాంచ్​.. ఆన్​లైన్​లో లీకైన ఫీచర్ల వివరాలివే..

వివో ఎస్​12, ఎస్​ 12 ప్రో స్మార్ట్​ఫోన్లు ఇప్పటికే వివో చైనీస్ ఈ–స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులోకి వచ్చాయి. డిసెంబర్ 30 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే విడుదలైన ఈ స్మార్ట్​ఫోన్లు.. భారత్​తో సహా ఇతర గ్లోబల్​ మార్కెట్​లో లభ్యతపై ఎటువంటి స్పష్టత లేదు.

వివో ఎస్​12 ప్రో స్పెసిఫికేషన్లు

వివో ఎస్12 ప్రో 6.56 -అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 8 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్, 2 ఎంపీ మాక్రో యూనిట్ కెమెరాలను చేర్చింది. ముందు భాగంలో, వైడ్ నాచ్‌లో కూడిన 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెల్ఫీల కోసం 8 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్ కెమెరాలను అందించింది. వివో ఎస్​12 ప్రో 44W ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది. ఇది 4,300 mAh బ్యాటరీని ప్యాక్​తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజన్​ ఓఎస్​పై పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: Xiaomi 11i Hypercharge: జనవరి 6న ఇండియాలో షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ఫోన్ లాంచ్... లీకైన ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే

ఇక, కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 4జీ, 5జీ, వైఫై, బ్లూటూత్, ఎన్​ఎఫ్​సీ, జీపీఎస్​, యూఎస్​బీ టైప్-సి పోర్ట్ వంటివి అందించింది. వివో ఎస్​12 ప్రో వార్మ్ గోల్డ్, ఐలెట్ బ్లూ, షైనింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

వివో ఎస్​12 స్పెసిఫికేషన్లు

వివో ఎస్​12 సైతం 6.44 -అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. వివో ఎస్​12లోని కెమెరాలు ప్రో మోడల్ వలె ట్రిపుల్ రియర్​ -కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. దీనిలోని డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు 44 ఎంపీ మెయిన్​ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్‌ కెమెరాలతో వస్తుంది. ఇది మీడియాటెక్​ డైమెన్సిటీ 1100 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. వివో ఎస్​12 44W ఛార్జింగ్ మద్దతు గల 4,200 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారత ఆరిజన్​ ఓఎస్​పై పనిచేస్తుంది. కనెక్టివిటీ, కలర్​ ఆప్షన్లు ప్రో మోడల్​ లాగే ఉంటాయి.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Smartphones, Technology, Vivo

తదుపరి వార్తలు