UFO : అవిగో ఎగిరే పళ్లాలు... నిజం ఒప్పుకున్న అమెరికా నేవీ

Real UFO Videos : ఎగిరే పళ్లాలు ఉన్నాయా లేవా అన్నది ఓ మిస్టరీ. ఎంతో మంది అవి ఉన్నాయంటూ ఆధారాలు చూపిస్తున్నా... ఎప్పటికప్పుడు అమెరికా కొట్టిపారేస్తూ వచ్చింది. తాజాగా మాత్రం అమెరికా నౌకా దళ విభాగం... కొన్ని వీడియోలను నిజమైనవేనని ఒప్పుకుంది. మరైతే... ఆ వీడియోల్లో కనిపించిన ఎగిరేపళ్లాలు ఎక్కడివి? ఎలా వచ్చాయి? ఎక్కడికి వెళ్లాయి?

Krishna Kumar N | news18-telugu
Updated: September 20, 2019, 3:02 PM IST
UFO : అవిగో ఎగిరే పళ్లాలు... నిజం ఒప్పుకున్న అమెరికా నేవీ
అవిగో ఎగిరే పళ్లాలు... నిజం ఒప్పుకున్న అమెరికా నేవీ (Credit - arabtimesonline.com)
Krishna Kumar N | news18-telugu
Updated: September 20, 2019, 3:02 PM IST
అమెరికా సైన్యానికి సంబంధించి 2017 నుంచీ కొన్ని బ్లాక్ అండ్ వైట్ వీడియోలు ఇంటర్నెట్‌లో సర్కిల్ అవుతున్నాయి. వాటిలో ఎగిరేపళ్లాలున్నాయి. ఆ వీడియోలను ఇన్నాళ్లూ కొట్టిపారేసిన అమెరికా నౌకాదళ విభాగం... తొలిసారిగా అవి నిజమైన వీడియోలేనని ఒప్పుకుంది. ఆ వీడియోల్లో కనిపిస్తున్నవి ఎగిరే పళ్లాలు లేదా గుర్తించని ఎగిరే వస్తువులు (UFOs) అని నిర్ధారించింది. ఇన్నాళ్లూ అమెరికా సైన్యం ఆ వీడియోలను ప్రజలకు రిలీజ్ చెయ్యలేదు. కానీ... కొందరి వల్ల అవి బయటకు వచ్చేశాయి. అమెరికా మాజీ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి లూయిస్ ఎలిజోండో... ఆ వీడియోలను రిలీజ్ చేశారు. 2017లో అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌లోని UFO అధ్యయన సంస్థ... అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ ఈ వీడియోలను పరిశీలించింది. కానీ వాటిని బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడింది.


మొత్తం మూడు వీడియో క్లిప్పుల్లో మూడు రకాల UFOలు కనిపిస్తున్నాయి. మిలియరీ నేవీ పైలట్లు ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్న సమయంలో... ఆ ఎగిరే పళ్లాలు కనిపించాయి. ఇప్పుడున్న వైమానిక టెక్నాలజీతో... అలాంటి గుండ్రటి ఎగిరే పళ్లాలను తయారుచెయ్యడం సాధ్యం కాదని అమెరికా సైన్యం తెలిపింది. అవి ఎలాంటి టెక్నాలజీతో అలా ఎగరగలుగుతున్నాయో సైన్యానికి అర్థ కాలేదు. ఇప్పటికీ అవేంటో తమకు తెలియదనీ, అందుకే ఆ వీడియోలను రిలీజ్ చెయ్యలేదని అమెరికా సైన్యం చెబుతోంది. కానీ... ఆ వీడియోల్లోని ఎగిరే పళ్లాలు మాత్రం నిజమైనవేనని అంటోంది. మరైతే... అవి ఎక్కడి నుంచీ వచ్చాయి? ఎక్కడికి వెళ్లాయి? వాటిలో గ్రహాంతర వాసులు ఉన్నారా? వాళ్లతో అమెరికా సంప్రదింపులేమైనా జరిపిందా? ఇలా ఎన్నో ప్రశ్నలున్నా... వాటికి సమాధానం చెప్పేందుకు అమెరికా ఆర్మీ సిద్ధంగా లేదు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...