THE TELANGANA GOVERNMENT HAS MADE 17 TYPES OF RTA SERVICES AVAILABLE AT ONLINE VB
Telangana RTA: ఆన్లైన్లో ఆర్టీఏ సేవలు.. ఇక లైసెన్స్ పొందడం సులభతరం.. దాని కోసం ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం (Image credit : google Play store)
Telangana RTA: లాక్డౌన్ నేపథ్యం లో ఆన్లైన్లో 17 రకాల ముఖ్యమైన ఆర్టీఏ సేవలు అందిస్తున్నట్టు రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. వాహనదారులు తమ స్మార్ట్ఫోన్లలో టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఈ సేవలు పొందవచ్చన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్ విధానంలో సేవలందించాలని రవాణా శాఖ నిర్ణయించింది. 17రకాల సేవలను పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో అందించడానికి ‘ఎక్కడైనా - ఎప్పుడైనా (ఎనీవేర్ - ఎనీటైమ్)’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న టీయాప్ ఫోలియో అనే మొబైల్ యాప్‌ను రవాణా శాఖ వినియోగించుకోనుంది. దీనిని గూగుల్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, అందులో పేర్కొన్న సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. ముందుగా దీనిని మొబైల్ లో T App folio యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకొని ఆర్టీఏ ఐకాన్‌పై క్లిక్ చేస్తే 17 రకాల సేవలు కనపడుతాయి. అందులో మనకు అవసరమైన దానిపైన క్లిక్ చేసి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే పేరు, పుట్టిన తేది, ప్రస్తుత లైసెన్స్ నంబరు, వాహనం నంబరు వంటి ప్రాథమిక సమాచారాన్ని అప్లోడ్ చేయాలి. పాస్ ఫొటో కోసం ఫోన్‌తో సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేయాలి. 40 ఏళ్లు పైబడినవారు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే మెడికల్ సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేయాలి. వివరాలతో పాటు కొన్ని రకాల డాక్యూమెంట్స్ కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాతఆన్లైన్లో అఫ్లికేషన్ ఫీజును చెల్లిం చాక ఎస్ఎంఎస్ రూపంలో ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందని కమిషనర్ తెలిపారు. తర్వాత మెయిల్‌కు పీడీఎఫ్ రూపంలో పత్రాలు వస్తాయి.
ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండా ఇళ్ల వద్ద నుంచే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. డూప్లికేట్ లైసెన్స్, ఇష్యూ ఆఫ్ బ్యాడ్జ్, స్మార్ట్‌కార్డు, లైసెన్స్ హిస్టరీ షీట్, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ పర్మిట్, పర్మిట్ రెన్యువల్, టెంపరరీ పర్మిట్ లాంటి పదిహేడు రకాల సేవలు అందుబాటులో ఉన్నట్లు కమిషనర్ తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.