తొమ్మిది నెలల(Nine Months) పాటు తన కడుపులో బిడ్డ పెరిగే మధురమైన అనుభూతిని స్త్రీ మాత్రమే పొందగలుగుతుంది. అయితే భవిష్యత్తులో ఈ సంతోషం మహిళకు దూరమయ్యే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ఒకవైపు ఫేస్‌బుక్(Facebook), యాపిల్(Apple), టెస్లా, మైక్రోసాఫ్ట్(Microsoft), గూగుల్ సహా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు కృత్రిమ మేధస్సుపై పనిచేస్తున్నాయి. దీనిలో నుంచే ఒక టెక్నాలజీకి సంబంధించి వార్త బయటకు వచ్చింది. తల్లి కడుపులో బిడ్డను పెంచడం ఇష్టం లేని మహిళలు... భవిష్యత్తులో తల్లి కావాలనుకునే మహిళలు యంత్రం ద్వారా బేబీకి జన్మనివ్వొచ్చు. ఈ టెక్నాలజీ పేరు ఆర్టిఫిషియల్ యుటెరస్ ఫెసిలిటీ. ఇది ప్రపంచంలోనే తొలి కృత్రిమ పిండంలా పని చేస్తుందని యాక్టోలైఫ్ పేర్కొంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సాంకేతికతలో శిశువును కృత్రిమ గర్భంలో పెంచుతారు. పిండం దశ నుంచి నుండి 9 నెలల తర్వాత బేబీ బయటకు వచ్చే వరకు మొత్తం సంరక్షణ యంత్రాల ద్వారా నిర్వహించబడుతుంది.
బేబీ ఎలా పుడుతుందంటే..
ఆక్టోలైఫ్ అనే సంస్థ కృత్రిమ పిండం నుంచి బిడ్డ పుడుతుందని పేర్కొంది. దీనికి సంబంధించి కంపెనీ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో యంత్రం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సాంకేతికత కారణంగా.. గర్భాశయం లేని వారికి, తీవ్రమైన అనారోగ్యం కారణంగా దానిని తొలగించిన మహిళలకు తల్లి కావాలనే కల నెరవేరుతుంది. అదేవిధంగా పురుషుడికి సంతానలేమి సమస్య ఉన్నా కూడా ఈ యంత్రం ద్వారా తల్లి కావడానికి సహాయం అందుతుంది.
పిల్లలకు ఇన్ఫెక్షన్ లేకుండా..
ఈ టెక్నాలజీతో బేబీ ఇన్‌ఫెక్షన్ లేకుండా పుడుతుందని కంపెనీ పేర్కొంది. Actolife ప్రతి ల్యాబ్‌లో అధిక పరికరాలతో 75 ల్యాబ్‌లు , 400 గ్రోత్ పాడ్‌లను కలిగి ఉంటుది. ఇక్కడ శిశువు పెరుగుతుంది. ప్రతి పాడ్ ప్రత్యేకంగా స్త్రీ గర్భంలో ఉన్న గర్భాశయాన్ని పోలి ఉండేలా రూపొందించబడింది. ఈ మెషీన్‌లో బిడ్డకు కూడా తల్లి పిండం లాంటి అనుభవం ఉంటుందని కంపెనీ తెలిపింది.
గ్రోత్ పాడ్స్ అంటే..?
గ్రోత్ పాడ్‌లు మెషీన్‌కు అమర్చిన బ్రూడర్‌లు. శిశువు యొక్క ముఖ్యమైన కదలికలను పర్యవేక్షించడానికి గ్రోత్ పాడ్‌లో సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. దీని కింద శిశువు చర్మం, పల్స్, ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ స్థాయి, రక్తపోటు, శ్వాస రేటు, గుండె, మెదడు, మూత్రపిండాలు, కాలేయం మరియు ఇతర శరీర అవయవాలను నిజ సమయంలో పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. అంతే కాకుండా.. శిశువు యొక్క ప్రతి కదలిక , పెరుగుదలను చూడగలిగేలా తల్లిదండ్రులకు ఒక యాప్ రూపొందించబడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Artificial intelligence, Technology, Viral Video