హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

YouTube: ఆ వ్యక్తి పోలీస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు.. మరో వైపు యూట్యూబ్ లో ఆ వీడియోలు.. చివరకు ఇలా.. 

YouTube: ఆ వ్యక్తి పోలీస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు.. మరో వైపు యూట్యూబ్ లో ఆ వీడియోలు.. చివరకు ఇలా.. 

YouTube: ఆ వ్యక్తి పోలీస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు.. మరో వైపు యూట్యూబ్ లో ఆ వీడియోలు.. చివరకు ఇలా.. 

YouTube: ఆ వ్యక్తి పోలీస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు.. మరో వైపు యూట్యూబ్ లో ఆ వీడియోలు.. చివరకు ఇలా.. 

YouTube: తాను పోలీస్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే సమయంలో.. యూట్యూబ్ లో ఇలాంటివి ప్రచారం చేస్తారా అంటూ కోర్డు మెట్లెక్కిన వ్యక్తికి సుప్రింకోర్డు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

మనకు నచ్చింది చేసేద్దాం.. ఏమవుతుందిలే అని అనుకునే వారికి ఇక్కడ చెప్పే న్యూస్ హెచ్చరిక లాంటిది. ఒక పని చేస్తున్నామంటే.. చాలా సార్లు ఆలోచించి పని మొదల పెట్టాలి. దాని వల్ల నష్టాలు ఉన్నాయా.. లాభాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఆలోచించాలి. ఇలా ఉంటేనే ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి అవుతుంది. ఇక్కడ ఓ వ్యక్తి చేసిన పని కూడా అలానే ఉంది. ఏదో చేద్దామని సుప్రింకోర్టులో(Supreme Court) పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పని కాస్త తిరిగి అతడికే తగిలింది. రూ.75లక్షలు ఆశించి తన చేతి నుంచే రూ.25వేలు కట్టేదాక వచ్చింది. అసలేం జరిగింది పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Panchayat Secretary Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో 2560 పంచాయతీ సెక్రటరీ పోస్టులు..

మధ్యప్రదేశ్ పోలీస్ పరీక్షకు(Madhya Pradesh Police Exam) సన్నద్ధమవుతున్న సమయంలో తన దృష్టిని మరల్చేలా ప్రకటనలు ప్రసారం చేశారనే ఆరోపణలపై యూట్యూబ్(You Tube) నుండి రూ. 75 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ ఒక వ్యక్తి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ దాఖలు చేశాడు. గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ నుండి రూ. 75 లక్షల పరిహారం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ప్లాట్‌ఫారమ్‌లోని ప్రకటనలలోని లైంగిక కంటెంట్‌ను చూసి పరధ్యానంలో పడ్డానని.. అందువల్ల మధ్యప్రదేశ్ పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని ఆరోపించారు.

TSPSC Junior Lecturer Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TSPSC నుంచి జేఎల్(JL) నోటిఫికేషన్ జారీ..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నగ్నత్వంపై నిషేధం విధించాలని కూడా కోరాడు. ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్ మరియు అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం పిటిషనర్ ఆనంద్ కిషోర్ చౌదరి తో విభేదించింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇది ఒకటంటూ ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి పిటిషన్‌ను దాఖలు చేసినందుకు గాను అతనిపై రూ. 25,000 ఫైన్ విధించింది. అటువంటి ప్రకటనలు చూడకుండా ఉంటే సరిపోతుందని.. ఆ సమయంలో వేరే ఏదైనా పని చేసుకుంటే మీకు ఎలాంటి నష్టం ఉండేది కాదు కదా అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది.

అడ్వర్టయిజ్మెంట్ ను చూసి పోటీ పరీక్షల ప్రిపరేషన్ పై శ్రద్ధ లేకుండా పోయిందని ఆరోపించడం సరికాదు. ఆ అడ్వర్టయిజ్మెంట్ ను చూడమని మీకెవరూ చెప్పారు..? దాన్ని మీరు చూడకుండా ఉండాల్సింది. ఇది దారుణమైన పిటిషన్. ఇలాంటి పిటిషన్ల వల్లే న్యాయ వ్యవస్థ విలువైన సమయం వృథా అవుతోంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రారంభంలో.. బెంచ్ పిటిషనర్‌పై లక్ష రూపాయల ఫైన్ విధించింది. అయితే.. అతను కోర్టుకు క్షమాపణ చెప్పాడు. తన తల్లిదండ్రులు కూలీలని పేర్కొంటూ.. అంత మొత్తం తాను చెల్లించలేనని పేర్కొనగా.. రూ.25వేలు జరిమానా విధించారు.

First published:

Tags: 5g technology, Technology, Youtube

ఉత్తమ కథలు