THE SERVICES OF SOCIAL MEDIA PLATFORMS LIKE WHATSAPP FACEBOOK AND INSTAGRAM HAVE FINALLY BECOME AVAILABLE PRV
Social media: క్షమించండంటూ.. ఏడు గంటల అనంతరం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు పునరుద్దరణ..
ప్రతీకాత్మక చిత్రం
ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్ (WhatsApp), ఫేస్బుక్ (face book), ఇన్స్టాగ్రామ్ (Instagram)ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏడు గంటలపాటు ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు బ్రేక్ (break) పడిన సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్ (WhatsApp), ఫేస్బుక్ (face book), ఇన్స్టాగ్రామ్ (Instagram)ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏడు గంటలపాటు ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు బ్రేక్ (break) పడిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 4. 30 గంటలకు వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లు క్షమాపణలు చెప్పాయి.ఊహించని విధంగా ఈ మూడు సోషల్ మీడియా (social media) సేవలకు అంతరాయం (Interruption) ఏర్పడటంతో ఈ ప్లాట్‌ఫాంలను వినియోగించే కోట్లాది మంది వినియోగదారులు (users) ఇబ్బందిపడ్డారు. అసలేం జరుగుతుందో తెలియకపోవడంతో కన్ఫ్యూజ్ అయ్యారు.
అయితే ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో ఫేస్ బుక్ సంస్థకు భారీగా నష్టం (heavy loss) వాటిల్లినట్లు సమాచారం. కేవలం కొన్ని నిమిషాల పాటు సేవలు అందుబాటులో లేనందున మార్కెట్లో ఫేస్ బుక్ సంస్థ షేర్ల విలువ (share value) 6 శాతం తగ్గినట్లుగా (down) కథనాలు వస్తున్నాయి. ఫేస్బుక్ వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరించేందుకు టెకీలు తీవ్రంగా యత్నించారు.
సాయంత్రం నుంచి..
ఇవాళ సాయంత్రం నుంచి వివిధ దేశాల్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ డౌన్ అయ్యింది. దీనిపై యూజర్లు వివిధ ఇతర వేదికల్లో ఫిర్యాదులు చేశారు. ఫేస్బుక్ వెబ్సైట్లోనూ ఇందుకు సంబంధించి మెసేజ్ (message) ఒకటి కనిపించింది. అంతరాయం (Interruption) కలుగుతోందని.. తాము దానిపై పని చేస్తున్నామని ఫేస్బుక్ పేర్కొంది. త్వరలోనే దాన్ని పరిష్కరించి (resolve) మీ ముందుకొస్తామని (will back) వెల్లడించింది. దాదాపు మంగళవారం ఉదయం 4. 30 గంటల సమయంలో సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు వాట్సాప్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ రోజు వాట్సాప్ ఉపయోగించలేకపోయిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు. మేం నెమ్మదిగా, జాగ్రత్తగా ఈ WhatsApp మళ్లీ పని చేసేలా చేశాం. మీ సహనానికి చాలా ధన్యవాదాలు.”అని తెలిపింది.
Apologies to everyone who hasn’t been able to use WhatsApp today. We’re starting to slowly and carefully get WhatsApp working again.
Thank you so much for your patience. We will continue to keep you updated when we have more information to share.
మరోవైపు ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అంతరాయం కలిగిందనే విషయాన్ని చాలామంది యూజర్లు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇండియాలో రాత్రి 9 గంటల సమయంలో ఈ సమస్య మొదలైందని వినియోగదారులు చెప్పారు. కొన్ని చోట్ల యువ యూజర్లు ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
I can hear the Twitter 💪🏽 what’s app Facebook and Instagram down ? Random and peaceful :)
మరోవైపు హీరోయిన్ శ్రుతీహాసన్ సైతం వీటిపై స్పందించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయని ట్విటర్ ద్వారా తెలిసింది. ఇపుడు ప్రశాంతంగా ఉంది అని ట్విటర్లో తెలిపింది.
We’re aware that some people are experiencing issues with WhatsApp at the moment. We’re working to get things back to normal and will send an update here as soon as possible.
ట్విట్టర్లో #DeleteFacebook హ్యాష్‌ట్యాగ్ (hashtag) ట్రెండ్ కావడం మొదలైంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడం కనిపించింది. అమెరికా, ఇంగ్లండ్, బ్రెజిల్, కువైట్ వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థల వెబ్ సర్వీసులను ట్రాక్ చేసే downdetector.com సైతం వీటి యూజర్ల నుంచి ఫిర్యాదు బాగా పెరిగిపోయాయని పేర్కొంది. అయితే అసలు ఈ అంతరాయానికి కారణం ఏమిటనే దానిపై మాత్రం ఫేస్బుక్ ఇంకా స్పందించలేదు. దాదాపు 7 గంటల అనంతరం అంటే మంగళవారం ఉదయం 4. 30 గంటలకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు వీటిపైనే పని చేసే సంస్థలు ఈ పరిణామంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాయి.
కాగా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో సోషల్ మీడియా వెబ్సైట్ ట్విటర్లో యూజర్లు మీమ్లతో సందడి చేశారు. ఫన్నీ ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్ చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.