Home /News /technology /

THE REALME 9 PRO AND 9PRO PLUS ARE COMING TO INDIA FULL DETAILS HERE GH VB

Realme 9 Pro: త్వరలోనే రియల్​మీ 9 ప్రో, 9 ప్రో+ స్మార్ట్​ఫోన్లు లాంచ్​.. ఆన్​లైన్​లో లీకైన ఫీచర్ల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త సంవత్సరంలో స్మార్ట్​ బ్రాండ్లు వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రియల్​మీ తన 9 ప్రో సిరీస్​ నుంచి ఒకేసారి రెండు ఫోన్లను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది.

కొత్త సంవత్సరంలో స్మార్ట్​ బ్రాండ్లు(Smart Brands) వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రియల్​మీ తన 9 ప్రో సిరీస్​ నుంచి ఒకేసారి రెండు ఫోన్లను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్​మీ 9ప్రో(Real Me 9Pro), రియల్​మీ 9 ప్రో ప్లస్​ పేర్లతో ఇవి భారత మార్కెట్​లోకి రానున్నాయి. దీనికి సంబంధించి రియల్​మీ వైస్​ ప్రెసిడెంట్, రియల్​మీ ఇంటర్నేషనల్ బిజినెస్​ గ్రూప్​ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ ట్వీట్(Tweet) చేశారు. అంతేకాదు, 9ప్రో, 9 ప్రో ప్లస్​ రెండింటిలో ఏది ముందుగా విడుదలవుతుందో ఊహించండి? అంటూ ఆన్​లైన్​ పోల్​ నిర్వహించారు. ఈ పోల్​లో 4,267 మంది పాల్గొన్నారు. కాగా, పోల్​లో పాల్గొన్న వారిలో 36.3 శాతం మంది రియల్​మీ 9 ప్రో ముందుగా లాంచ్​ అవుతుందని ఓటేశారు. రియల్​మీ 9ప్రో ప్లస్​ ముందుగా లాంచ్​ అవుతుందని 63.7 శాతం మంది ఓటేశారు.

Amazon Great Republic Day Sale 2022: వాటిపై భారీ డిస్కౌంట్.. రూ. 2,799 ధరకే ఆ ప్రొడక్ట్ సొంతం..


కస్టమర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే.. రియల్​మీ 9ప్రో కంటే ముందు రియల్​మీ 9ప్రో ప్లస్ స్మార్ట్​ఫోన్​​ భారత మార్కెట్​లోకి రానుంది. రియల్​మీ నుంచి ఇటీవల భారత మార్కెట్​లోకి లాంచ్​ అయిన రియల్​మీ 9ఐ అమ్మకాలు జనవరి 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే వియత్నాం మార్కెట్​లోకి విడుదలైన ఈ స్మార్ట్​ఫోన్​కు అక్కడ మంచి స్పందన వచ్చింది.

రియల్​మీ 9 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)..
రియల్​మీ 9 ప్రో కీలక స్పెసిఫికేషన్లను ప్రముఖ టిప్​స్టర్​ స్టీవ్​ హెమ్మర్ స్టోఫర్​ ఆన్​లైన్​లో లీక్​ చేశారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, రియల్​మీ 9 ప్రో స్మార్ట్​ఫోన్​లో 6.6 అంగుళాల సూపర్ AMOLED డిస్​ప్లేను అందించనుంది. స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్​పై పనిచేస్తుంది. ఇందులో వెనుకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి.

Flipkart Big Saving Days Sale 2022: ల్యాప్‌టాప్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. తక్కువ ధరకు 5జీ మొబైల్ స్మార్ ఫోన్లు..


వీటిలో 64 మెగాపిక్సెల్​ మెయిన్​ కెమెరా, 8 మెగా పిక్సెల్​ సెకండరీ కెమెరా, 2 మెగా పిక్సెల్​ టెర్టియరీ సెన్సార్​ కెమెరాలు ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్​ కెమెరాను అందించనుంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 65W ఫాస్ట్​ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది. ఇక, ఈ ఫోన్​ మిడ్​ నైట్​ బ్లాక్​, అరోరా గ్రీన్​, సన్​రైజ్​ బ్లూ రంగుల్లో లభించే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు