హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco X4 Pro 5G: మార్చి 28న భారత మార్కెట్​లోకి పోకో X4 Pro 5G ఫోన్ లాంచ్​.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Poco X4 Pro 5G: మార్చి 28న భారత మార్కెట్​లోకి పోకో X4 Pro 5G ఫోన్ లాంచ్​.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

చైనీస్ స్మార్ట్​ఫోన్ కంపెనీ పోకో భారత్​లో మరో కొత్త స్మార్ట్​ఫోన్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. మార్చి 28న పోకో ఎక్స్​4 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన కొత్త టీజర్‌ను తన యూట్యూబ్​ ఛానల్​ ద్వారా షేర్ చేసింది.

ఇంకా చదవండి ...

  చైనీస్ స్మార్ట్​ఫోన్ కంపెనీ పోకో(Poco) భారత్​లో మరో కొత్త స్మార్ట్​ఫోన్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. మార్చి 28న పోకో ఎక్స్​4 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​ను(5G Smart Phone) విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన కొత్త టీజర్‌ను తన యూట్యూబ్​ ఛానల్​ ద్వారా షేర్ చేసింది. పోకో X4 ప్రో 5G లాంచింగ్​ మార్చి 28, 12PM సమయంలో జరగనుందని టీజర్​ వీడియోలో స్పష్టంగా పేర్కొంది. కంపెనీ ఈ లాంచింగ్​ ఈవెంట్‌ను యూట్యూబ్(YouTube), ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేయనుంది. పోకో ఎక్స్4 ప్రో 5జీ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరగనున్నాయి. ఇప్పటికే, ఫ్లిప్​కార్ట్​ తన అధికారిక వెబ్​సైట్​లో పోకో ఎక్స్4 ప్రో 5జీ ఫోన్​ లాంచింగ్​ను కన్ఫర్మ్​ చేసింది. పోకో ఎక్స్ 4 ప్రో 5జీని తొలుత ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 (MWC 2022)లో ఆవిష్కరించింది.

  పోకో ఎక్స్​4 ప్రో 5జీ ధర (అంచనా)

  పోకో ఎక్స్4 ప్రో 5G 6 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ బేస్​ వేరియంట్​ ధర EUR 299 (దాదాపు రూ. 25,300) నుండి ప్రారంభమవుతుంది. ఇక, 8జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర EUR 349 (దాదాపు రూ. 29,500) నుండి ప్రారంభమవుతుంది. అయితే, భారత్​లో మాత్రం రూ. 22,000 వద్ద ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్​ లేజర్​ బ్లాక్​, లేజర్​ బ్లూ, ఎల్లో కలర్​ ఆప్షనల్లో అందుబాటులో ఉంటుంది.

  Apple iPhone: యాపిల్​ ఐస్టోర్​లో అదిరిపోయే ఆఫర్​.. ఆ ఫోన్ పై ఏకంగా రూ. 28,900 వరకు డిస్కౌంట్..

  పోకో ఎక్స్​4 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)

  పోకో ఎక్స్​4 ప్రో 5G 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు గల 6.67-అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్​ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. అడిషనల్​ ప్రొటెక్షన్​ కొరకు డిస్​ప్లేను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో డిజైన్​ చేసింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ఆక్టా-కోర్ SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 8 జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్​తో వస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. దీనిలోని ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్​లో 108 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ కెమెరాలను అందించింది. ఈ ఫోన్ ముందు భాగంలో 16- మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కూడా చేర్చింది. పోకో ఎక్స్​4 ప్రో 5G ఫోన్​లో 5000mAh బ్యాటరీని అమర్చింది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

  First published:

  Tags: 5g mobile, 5g smart phone, POCO, Poco X2

  ఉత్తమ కథలు