Home /News /technology /

THE NEW PHONE COMING FROM REALME THESE ARE THE SPECIFICATIONS OF THE NARZO 50 5G GAMING DEVICE GH VB

Narzo 50 5G: రియల్‌మీ నుంచి రానున్న కొత్త ఫోన్.. నార్జో 50 5G గేమింగ్ డివైజ్ స్పెసిఫికేషన్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

త్వరలో నార్జో 50 5జీ (Narzo 50 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు రియల్‌మీ ధ్రువీకరించింది. గత సంవత్సరం విడుదలైన నార్జో 30 5G సక్సెసర్‌గా ఈ మోడల్ రానుంది. ఇది గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది.

స్మార్ట్ బ్రాండ్ రియల్‌మీ (Realme) ఇటీవలే ఇండియాలో రియల్‌మీ జీటీ నియో (Realme GT Neo 3) ఫోన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలోనే 150W ఫాస్ట్ ఛార్జింగ్(Charging) సపోర్ట్‌తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా(Smartphone) ఇది వార్తల్లో నిలిచింది. ఇదే సమయంలో దేశంలో మరో కొత్త, బడ్జెట్ నార్జో సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో నార్జో 50 5జీ (Narzo 50 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు రియల్‌మీ ధ్రువీకరించింది. గత సంవత్సరం విడుదలైన నార్జో 30 5G సక్సెసర్‌గా ఈ మోడల్ రానుంది. ఇది గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ధరకు తగ్గట్లు అత్యుత్తమ ఫీచర్లను అందిస్తుందని, ఈ సెగ్మెంట్‌లో ఫాస్టెస్ట్ 5G ప్రాసెసర్‌తో వస్తుందని రియల్‌మీ వెల్లడించింది.

Sedition Law: సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు.. రాజద్రోహ చట్టం నిలిపివేత.. మోదీ సర్కార్ యూటర్న్‌తో..


ఈ కొత్త ఫోన్ లాంచింగ్ గురించి రియల్‌మీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. ‘ప్రతి నార్జో ఫోన్‌తో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ మరింత మెరుగుపరచడానికి టాప్ ఫీచర్లు, లేటెస్ట్, బోల్డ్ డిజైన్స్‌తో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తాం. 2022 జనవరిలో నార్జో లాంచ్ అయినప్పటి నుంచి 10 మిలియన్లకు పైగా యూజర్ బేస్‌ను చేరుకుంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని పేర్కొంది.

నార్జో సిరీస్‌కు త్వరలో కంపెనీ చేర్పులు చేయనున్నట్లు రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ సేత్ తెలిపారు. ‘కొత్త నార్జో స్మార్ట్‌ఫోన్‌లు మరింత శక్తివంతమైన 5G ప్రాసెసర్లు, బెస్ట్ డిజైన్, అద్భుతమైన డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తాయి. ఇండియాలో 2022లోనే 5G నెట్‌వర్క్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఆన్‌లైన్ ఛానెల్‌లలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎప్పటిలాగే రియల్‌మీ యూత్‌ను టార్గెట్‌గా చేస్తూ ప్రొడక్ట్స్ రూపొందిస్తుంది.’ అని వెల్లడించారు.

* రియల్‌మీ నార్జో 50 5G స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆన్‌లైన్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోన్ 1080x2408 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.58-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 6GB RAMతో పెయిర్ అయిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో రానుంది. దీని ఇంటర్నల్ స్టోరేజ్ 128GB వరకు ఉండొచ్చని అంచనా. మైక్రో SD కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ను మరింత విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 13MP మెయిన్ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌ ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో నార్జో 50 ఫోన్ రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించనుంది. ఈ డివైజ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీతో రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీని ధర గురించి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
Published by:Veera Babu
First published:

Tags: 5g smart phone, Mobile phones, Real me

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు