• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • THE MOON AND EARTH SHARED THE SAME MAGNETIC FIELD 3 5 BILLION YEARS AGO SHOWS NEW NASA STUDY NK

Earth and Moon: యుగాంతం నుంచి భూమిని కాపాడిన చందమామ... నాసా పరిశోధనలో షాకింగ్ విషయాలు

Earth and Moon: యుగాంతం నుంచి భూమిని కాపాడిన చందమామ... నాసా పరిశోధనలో షాకింగ్ విషయాలు

Earth and Moon: యుగాంతం నుంచి భూమిని కాపాడిన చందమామ... నాసా పరిశోధనలో షాకింగ్ విషయాలు

Earth and Moon: యుగాంతం వచ్చి భూమి అంతమవుతుందనే ప్రచారం మనం వింటూనే ఉంటాం. అలాంటి ఓ ప్రమాదం నుంచి చందమామ భూమిని కాపాడిందని నాసా పరిశోధనలో తేలింది.

  • Share this:
    Moon saved Earth: మన భూమికి ఉపగ్రహంగా చందమామ లేకపోతే ఏమవుతుందో తెలుసా... మన సముద్రాల్లో అలలు రావు. ప్రతి రోజూ రాత్రివేళ మనకు ఆహ్లాదాన్ని ఇస్తున్న జాబిల్లికి సంబంధించి అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA)... ఓ ఆసక్తికర విషయం చెప్పింది. ఇప్పటికి 350 కోట్ల సంవత్సరాల కిందట... మన భూమిని చందమామే కాపాడిందని తెలిపింది. ఇంకా చెప్పాలంటే... ఇప్పుడు భూమిపై జీవం ఉందంటే... దానికి కారణం చందమామేనట. ఎలాగంటే... ఒకప్పుడు చంద్రుడికి బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్ (అయస్కాంత క్షేత్రం) ఉండేది. అది సూర్యుడి నుంచి భూమిపై పడే అతి నీలలోహిత (సోలార్ రేడియేషన్) కిరణాల నుంచి భూమిని కాపాడిందని నాసా పరిశోధనలో తేలింది. అప్పట్లో భూమిపై ఇంకా జీవరాశి లేదు. అప్పుడప్పుడే భూమి తయారవుతున్న దశ అది. అంటే... క్రీస్తుపూర్వం 410 కోట్ల సంవత్సరాల నుంచి 350 కోట్ల సంవత్సరాల వరకూ... చందమామ, భూమి రెండూ... ఒకే అయస్కాంత క్షేత్రాన్ని కలిగివున్నాయని నాసా తెలిపింది. ఈ వివరాల్ని సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్ లో తెలిపింది.

    "అప్పట్లో సౌర గాలులు అత్యంత ప్రమాదకరంగా ఉండేవి. వాటి వల్ల భూమిపై వాతావరణం నాశనం కాకుండా చందమామకు చెందిన అయస్కాంత క్షేత్రం... భూమిని కాపాడింది" అని నాసా చీఫ్ సైంటిస్ట్ జిమ్ గ్రీన్ తెలిపారు. "ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా... మేం వ్యోమగాములను చందమామపైకి పంపాం. వారు చందమామ దక్షిణ ధ్రువం నుంచి కొన్ని శాంపిల్స్ తెచ్చారు. వాటిని పరిశోధించినప్పుడు ఈ విషయం మాకు తెలిసింది" అని ఆయన చెప్పారు.

    ఈ కొత్త పరిశోధనతో మరో విషయం కూడా అర్థమైంది. ఏంటంటే... చందమామపై ఒకప్పుడు పవర్ ఫుల్ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేదని తెలిసింది. భూమి చుట్టూ ఉన్న ఈ అయస్కాంత క్షేత్రం వల్లే యూరప్ దేశాలు, ఆర్కిటిక్, అంటార్కిట్ ధృవాల్లో ఆకాశంలో రంగురంగుల అరోరాలు కనిపిస్తున్నాయి. సైంటిస్టులు భూమి, చందమామపై అయస్కాంత క్షేత్రం ఎలా పనిచేసిందో కంప్యూటర్ మోడల్ తయారుచేశారు. తద్వారా లోతుగా పరిశోధిస్తున్నారు. భూమి, చందమామల ధృవాల దగ్గర కనెక్షన్ ఉండటం వల్ల రెండూ కలిసి ఒకే అయస్కాంత క్షేత్రాన్ని పంచుకున్నాయని తెలిపారు.

    మొత్తానికి భూమిని చందమామే కాపాడిందని తేలిపోయింది. అదే జరగకపోయి ఉంటే... తుఫానులా కురిసే సోలార్ రేడియేషన్ వల్ల భూమిపై జీవం అన్నదే లేకుండా పోయేది. భూమి కూడా మిగతా గ్రహాల్లాగా అయిపోయేదే. ఇప్పుడు చందమామ మాగ్నెటిక్ ఫీల్డ్ ని పరిశీలించడం ద్వారా... చందమామ లోపల ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఐతే... 320 కోట్ల సంవత్సరాల నుంచి చందమామపై అయస్కాంత క్షేత్రం క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. 150 కోట్ల సంవత్సరాల కిందట అది పూర్తిగా మాయమైంది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు