2000వ సంవత్సరం అక్టోబర్ 31న రష్యాకు చెందిన సోయుజ్ అంతరిక్ష నౌక కజకిస్తాన్ లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి బయలుదేరింది. అందులో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. రెండు రోజుల తరువాత, నవంబర్ 2న వారు భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు చేరుకున్నారు. అప్పటి నుంచి ఎప్పుడూ కొందరు వ్యోమగాములు ఐఎస్ఎస్ లో ఉంటున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఈ సైకిల్ కొనసాగుతోంది. అంటే సోయుజ్ నౌక బయలుదేరటానికి ముందు వరకే మానవజాతి మొత్తం భూమిపై కలిసి ఉందని అర్థం. ఆ తరువాత నుంచి జరుగుతోన్న అంతరిక్ష పరిశోధనలు ఎంతో పురోగతి సాధించాయి.
ఐఎస్ఎస్ ఏర్పడింది అప్పుడే..
ISS ఏర్పడి 20 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్లలో అంతరిక్షంలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో స్పేస్ స్టేషన్లో కేవలం రెండు మాత్రమే అమెరికన్, రష్యన్ ఎక్స్పరిమెంట్ క్వార్టర్లుగానే ఉండేవి. ఇప్పుడు ఎంతో సామర్థ్యమున్న పరిశోధనా సామగ్రితో విస్తరించిన ప్రయోగశాల, లివింగ్ క్వార్టర్స్ ISSలో ఉన్నాయి. ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్‌లకు కూడా ఐఎస్ఎస్ ఆతిథ్యం అందిస్తోంది. మే 31న స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్కు వెళ్లిన మొదటి ప్రైవేటు కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్‌గా రికార్డు సాధించింది. ఇన్నేళ్లలో ఇది అంతరిక్ష పరిశోధనలకు మూల బిందువుగా ఐఎస్ఎస్ మారింది.
ప్రయోగాలతో ఉపయోగాలున్నాయి..
అమెరికన్ స్పేస్ ఎజెన్సీకి చెందిన నాసా ఐఎస్ఎస్ కు వెళ్లే వ్యోమగాములకు శిక్షణ అందిస్తుంది. నాసాకు చెందిన క్రిస్టియానా కోచ్, స్కాట్ కెల్లీ వంటి వ్యోమగాములకు ISS ఆతిథ్యమిచ్చింది. వీరిద్దరూ దాదాపు ఒక సంవత్సరం పాటు ISSలో గడిపారు. కీలకమైన పరిశోధన ప్రాజెక్టులకు వీరు మార్గాలు చూపారు. వాటిలో పార్కిన్సన్స్ వ్యాధి నివారణ, చర్మం, ఇతర అవయవాలపై అంతరిక్ష వాతావరణం ప్రభావం, మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో సాగు చేయడానికి ప్రయోగాలు చేయడం వంటివి ఉన్నాయి.
వేరే గ్రహాలపై మనుగడ కోసం పరిశోధన..
భూమిపై మానవ జనభా ఏటా వృద్ధి చెందుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.6 బిలియన్లకు (760 కోట్లు) చేరుకుంటోంది. గత రెండు దశాబ్దాల్లో జనాభా రెట్టింపు అయినట్టు అంచనా. అందుకే అంతరిక్షంలో జీవనం సాగించేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అంతరిక్షంలో జీవించడానికి అనువైన వాతావరణం ఉండే గ్రహాలపై నివాసాలు ఏర్పరచుకోవాలనే లక్ష్యంలో స్పేస్ సైంటిస్టులు పనిచేస్తున్నారు.
Published by:Srinivas Munigala
First published:October 08, 2020, 17:03 IST