Home /News /technology /

THE KIA EV6 HAS BEEN SPOTTED ON THE ROADS OF HYDERABAD AND IT SEEMS THAT THE NEW ELECTRIC VEHICLE IS BEING TESTED ON INDIAN ROADS LETS LOOK HERE THE FEATURES PRV GH

Kia EV6: హైదరాబాద్ రోడ్లపై కియా ఎలక్ట్రిక్ కారు.. ఈవీ 6 మోడల్‌ను ఇండియన్ రోడ్లపై టెస్ట్ చేస్తున్న కంపెనీ

హైదారాబాద్ రోడ్లపై కియా కారు (Photo:Arjit Garg
/Twitter)

హైదారాబాద్ రోడ్లపై కియా కారు (Photo:Arjit Garg /Twitter)

కియా ఈవీ 6 కారు హైదరాబాద్‌ రోడ్లపై కనిపించింది. ఈ కొత్త EVని ఇండియన్ రోడ్లపై టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సాధించిన కియా మోటార్స్ కంపెనీ.. గత ఏడాది Kia EV6 ఎలక్ట్రిక్ కారు (Electric car)ను ఆవిష్కరించింది. కంపెనీ ఇండియాలో లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ కారుగా దీన్ని పరిచయం చేసింది. అయితే దీన్ని త్వరగా ఇండియా (India)లో లాంచింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలో కియా ఈవీ 6 కారు హైదరాబాద్‌ (Hyderabad) రోడ్లపై కనిపించింది. ఈ కొత్త EVని ఇండియన్ రోడ్లపై టెస్ట్ చేస్తున్నట్లు (Test ride) తెలుస్తోంది. Kia EV6 కంప్లీట్లీ బిల్ట్ యూనిట్గా(Completely built unit) ఇండియాకు దిగుమతి అవుతాయి. ఈ కారు ధరపై పెద్ద మొత్తంలో కస్టమ్ డ్యూటీ (custom duty) విధించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ కారు ధర రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఉండవచ్చు.

* Kia EV6 స్పెసిఫికేషన్స్

కియా బ్రాండ్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ EVగా Kia EV6 మోడల్ నిలవనుంది. గ్లోబల్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ కారుకు 528 కిమీ వరకు WLTP రేంజ్ ఉంటుంది. కేవలం కొన్ని నిమిషాల ఛార్జింగ్‌తో వాహనం పెద్ద మొత్తంలో ఛార్జ్ అయ్యి.. ఎక్కువ రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. కియా EV6 కేవలం 4.5 నిమిషాల్లోనే 100 కి.మీ వరకు ప్రయాణించే పవర్‌ను సేవ్ చేసుకుంటుందని, ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఛార్జర్‌తో పాటు కారు ప్రస్తుత బ్యాటరీ శాతాన్ని బట్టి ఛార్జింగ్ మారవచ్చు.

* ఇతర ప్రత్యేకతలు

కియా EV6 ఎలక్ట్రిక్ కారు (Electric Car)లో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ (Powerful batteries)లు ఉంటాయి. ఇవి కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందిస్తాయి. కియా మోటార్స్ కొత్త డిజైన్ ఫిలాసఫీ 'ఆపోజిట్స్ యునైటెడ్'ను చేర్చిన మొదటి గ్లోబల్ మోడల్‌గా EV6కు గుర్తింపు ఉంది. కంపెనీ అధునాతన ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (Electric-Global Modular Platform)  E-GMP ఆధారంగా రూపొందిన మొదటి కియా కారు కూడా ఇదే కావడం విశేషం.

ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ..

కొత్త ప్లాట్‌ఫారమ్‌తో EV6లో అత్యంత విశాలమైన ఇంటీరియర్‌ ఉంది. దీని కారణంగా ఈ సరికొత్త కారును 528 కిమీ వరకు డ్రైవింగ్ రేంజ్‌ (Driving range), 800-వోల్ట్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అందించడానికి వీలు కలిగిందని కియా పేర్కొంది. 2026 నాటికి కియా కంపెనీ లాంచ్ (Launch) చేయాలని భావిస్తున్న ఏడు EV మోడళ్లలో EV6 మొదటిది. ప్రముఖ గ్లోబల్ సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌ 9global sustainable mobility solutions provider)గా అవతరించాలని కియా ప్రణాళిక వేసుకుంది. ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో తాజా ఆల్-ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ EV6 కీలక పాత్ర పోషిస్తుందని కియా పేర్కొంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Electric Car, Hyderabad, Kia cars

తదుపరి వార్తలు