ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్(Smart Phone Brand) ఐకూ (iQOO) తన జెడ్ సిరీస్‌లో(Z Series) అదిరిపోయే మొబైల్స్ లాంచ్(Mobiles Launch) చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో ఫోన్లు లాంచ్ చేసిన ఐకూ ఇప్పుడు ఇండియాలో (India) మరొక ఫోన్ ను లాంచ్ చేసేందుకు రెడీ(Ready) అయ్యింది. ఐకూ ఈ ఏడాది జూన్(June) నెలలో భారతదేశంలో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్(Mid Range Smart Phone) ఐకూ జెడ్6 ప్రో (iQOO Z6 Pro)ని లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యింది. దీనికి సంబంధించి అధికారికంగా ఐకూ సంస్థ ఓ టీజ్ (Tease) కూడా చేసింది. ఈ ఫోన్ ని ప్రధానంగా గేమర్స్ (Gamers) కోసం తీసుకొస్తున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Moto G22: రూ.10,000 లోపు బడ్జెట్‌లో మోటో జీ22 రిలీజ్... ఫీచర్స్ ఇవే
ఐకూ తన అధికారిక ఇండియా ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఐకూ జెడ్6 ప్రో ఫోన్ ఏ ప్రాసెసర్‌ని యూజ్ చేస్తుందో చెప్పాలంటూ ఇది ట్విట్టర్ యూజర్లకు ఒక కంటెస్ట్ కండక్ట్ చేస్తోంది. కరెక్ట్ సమాధానం చెప్పిన వారు ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే యూజర్లు పోటీలో పాల్గొనడానికి, కొత్త ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకునే అవకాశాన్ని పొందేందుకు గైడ్ లైన్స్ కూడా ఐకూ లిస్ట్ చేసింది. ఐకూ కంపెనీ ఫోన్ ప్రాసెసర్‌ను రివీల్ చేయనప్పటికీ... ధరను మాత్రం వెల్లడించింది. "ఈ ఫోన్ బెంచ్ మార్క్ అంటుటూ టెస్ట్‌లో 550,000 పాయింట్ల స్కోర్ చేసింది. ఇది రూ.25 వేల ప్రైస్ రేంజ్ లో ఇండియాస్ ఫాస్టెస్ట్ స్మార్ట్‌ఫోన్ గా లాంచ్ కానుంద"ని ఆ సంస్థ వెల్లడించింది. అదే జరిగితే ఈ సెగ్మెంట్‌లో రియల్‌మీ, షియోమీ, వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌ల నుంచి ఇది గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఐకూ జెడ్6 ప్రో స్నాప్‌డ్రాగన్ 778G చిప్ సహాయంతో వర్క్ అవుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ఇదే చిప్ తో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ ధర అక్షరాలా రూ.40,000 కావడం విశేషం. కానీ ఐకూ ఫోన్ మాత్రం బడ్జెట్ రేంజ్ లో లభించే అవకాశం ఉంది. ఇది మధ్యతరగతి గేమర్లకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఐకూ జెడ్6 ప్రో ఫోన్ పెర్ఫార్మెన్స్, గేమింగ్ కి సంబంధించిన బెస్ట్ ఫీచర్లతో లాంచ్ కానుంది.
ఇక ఐకూ జెడ్6 5జీ ఫోన్ ఇండియాలో కొద్ది రోజుల క్రితమే లాంచ్ అయింది. అయితే ఇప్పుడు దీనికి అప్‌గ్రేడెడ్ మోడల్‌గా జెడ్6 ప్రో 5జీ మొబైల్ ప్రియుల ముందుకురానుంది. కొన్ని టెక్ సోర్సెస్ ప్రకారం, మొబైల్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో అమోలెడ్, ఎల్‌సీడీ డిస్ ప్లేతో రావచ్చు. ఇందులో అమోలెడ్ డిస్ ప్లే వాడి ఉండొచ్చని చాలా మంది టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేయొచ్చు. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఇది లాంచ్ అవ్వొచ్చని తెలుస్తోంది. కెమెరాల విషయానికొస్తే, ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. మిగతా స్పెసిఫికేషన్ల గురించి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, New smart phone, Technology