THE ICONIC CONTESSA BY HINDUSTAN MOTORS COULD BE COMING BACK SOON UMG GH
Contessa: ఇండియాలో మళ్లీ రిలీజ్ కానున్న కాంటెస్సా కారు.. ఈసారి సరికొత్తగా..!
కాంటెస్సా కారు.. సరికొత్తగా లాంచ్ కానుంది.
కాంటెస్సా (Contessa) బ్రాండ్‌ను ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీ (SG Corporate Mobility) ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయిస్తున్నట్లు తాజాగా హిందుస్థాన్ మోటార్స్ తెలిపింది. ఈ ఐకానిక్ బ్రాండ్‌ను ఎంతకు విక్రయించడానికి ఒప్పుకున్నామనే విషయాన్ని మాత్రం హెచ్ఎం బయటపెట్టలేదు.
హిందుస్థాన్ మోటార్స్ (Hindustan Motors).. ఈ పేరు వినగానే మన అందరికీ అంబాసిడర్ కారు గుర్తుకొస్తుంది. 1942లో బీ.ఎం బిర్లా స్థాపించిన ఈ ఆటోమొబైల్ కంపెనీ 1980 వరకు ఇండియన్ కారు మార్కెట్‌ని ఏలింది. దేశంలోనే తొలి కార్ల కంపెనీగా నిలిచిన హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కారు తర్వాత 1984లో కాంటెస్సా (Contessa) మోడల్ కారును లాంచ్ చేసింది. ఈ లగ్జరీ కారు కూడా సూపర్ పాపులర్ అయ్యింది. ఆ కాలంలో దీనిని ప్రభుత్వ అధికారులు ఇష్టపడి మరీ కొనుగోలు చేసేవారు. అయితే ఇలాంటి పాపులర్ కాంటెస్సా బ్రాండ్‌ను ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీ (SG Corporate Mobility) ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయిస్తున్నట్లు తాజాగా హిందుస్థాన్ మోటార్స్ తెలిపింది. ఈ ఐకానిక్ బ్రాండ్‌ను ఎంతకు విక్రయించడానికి ఒప్పుకున్నామనే విషయాన్ని మాత్రం హెచ్ఎం బయటపెట్టలేదు. అయితే బ్రాండ్‌ను కొనుగోలు చేస్తున్న ఎస్జీ సంస్థ కాంటెస్సా పేరుతో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని యోచిస్తోంది. దీంతో ఈ ఐకానిక్ బ్రాండ్ మరోసారి ఇండియన్ రోడ్లపై సందడి చేయనుందని తెలుస్తోంది.
సీకే బిర్లా గ్రూప్ సంస్థకు చెందిన హిందుస్థాన్ మోటార్స్ తన కాంటెస్సా బ్రాండ్‌ను ట్రాన్స్ఫర్ చేయడం కోసం జూన్ 16, 2022న గుర్గావ్ (Gurgaon) ఆధారిత ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీతో బ్రాండ్ ట్రాన్స్ఫర్ డీల్ కుదుర్చుకుంది. ఇదే డీల్‌లో అప్లికేషన్ నంబర్లు, బ్రాండ్ నిర్దిష్ట సంబంధిత హక్కులతో సహా ట్రేడ్‌మార్క్‌లు కూడా భాగంగా ఉన్నాయి. ఈ విషయాన్ని హిందూస్తాన్ మోటార్స్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీ సంస్థ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ కారు అందరినీ ఆకట్టుకునేలా కాంటెస్సా బ్రాండ్ పాపులారిటీని ఉపయోగించుకోవాలని ప్లాన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ నిజమైతే.. ఎలక్ట్రిక్ కాంటెస్సా ఐకానిక్ యూరో పోనీ-కార్ స్టైలింగ్‌తోనే వస్తుందా అనేది ప్రశ్నగా మారింది.
తాజా ఒప్పందంలో సూచించిన విధంగా నిబంధనలు, షరతులను నెరవేర్చిన తర్వాత బ్రాండ్ ట్రాన్స్ఫర్ విజయవంతంగా పూర్తి అవుతుంది. ఇండియాలో కాంటెస్సా మోడల్ కార్లను 1980ల నుంచి 2000ల ప్రారంభం వరకు హిందుస్థాన్ మోటార్స్ విక్రయించింది. ఈ ప్రీమియం సెడాన్ కంపెనీ అప్పటి ప్రముఖ మోడల్ అంబాసిడర్ కంటే ఎక్కువ ప్రాధాన్యత దక్కించుకుంది. ఈ బ్రాండ్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించినప్పటికీ... మారుతి సుజుకి, హ్యుందాయ్, ఫోర్డ్ వంటి కంపెనీలు భారతీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో దాని అమ్మకాల పై ప్రభావం పడింది. ఫలితంగా ఈ బ్రాండ్ కార్లు దశలవారీగా తగ్గుతూ వచ్చి చివరికి కనుమరుగయ్యాయి.
ఇంటర్నేషనల్ కార్ల కంపెనీల నుంచి తలెత్తిన పోటీతో హిందూస్థాన్ మోటార్స్ పూర్తిగా చాప చుట్టేసింది. ఒకప్పుడు ఇండియాలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ వెలుగొందిన హిందుస్థాన్ మోటార్స్ 2014లో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పరాలో తన తయారీ యూనిట్‌ను క్లోజ్ చేసుకుంది. అంతేకాదు, అంబాసిడర్ కారు ఉత్పత్తిని కూడా నిలిపివేసింది. అంబాసిడర్ బ్రాండ్‌ను ఫ్రెంచ్ కార్ల కంపెనీ PSA గ్రూప్‌కు ఫిబ్రవరి, 2017లో రూ. 80 కోట్లకు అమ్మేసింది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.