హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Messages: గూగుల్ మెసేజ్ నుంచి తాజా బీటా అప్‌డేట్‌.. ఐమెసేజ్ రియాక్షన్స్‌ను సరికొత్తగా డిస్‌ప్లే చేసే అవకాశం

Google Messages: గూగుల్ మెసేజ్ నుంచి తాజా బీటా అప్‌డేట్‌.. ఐమెసేజ్ రియాక్షన్స్‌ను సరికొత్తగా డిస్‌ప్లే చేసే అవకాశం


8.జీమెయిల్‌లో లాగిన్ (Gmail Login) చేసే విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది గూగుల్. జీమెయిల్ లేదా గూగుల్ అకౌంట్‌లో లాగిన్ చేయాలంటే ఇకపై 2-స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ విషయాన్ని మేలో వాల్డ్ పాస్‌వర్డ్ డే రోజున ప్రకటించింది గూగుల్. నవంబర్ 9న ఈ రూల్ అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సెక్యూరిటీ ప‌రంగా గూగుల్ ఎకౌంట్ సేఫ్టే పెరుగుతుంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

8.జీమెయిల్‌లో లాగిన్ (Gmail Login) చేసే విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది గూగుల్. జీమెయిల్ లేదా గూగుల్ అకౌంట్‌లో లాగిన్ చేయాలంటే ఇకపై 2-స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ విషయాన్ని మేలో వాల్డ్ పాస్‌వర్డ్ డే రోజున ప్రకటించింది గూగుల్. నవంబర్ 9న ఈ రూల్ అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సెక్యూరిటీ ప‌రంగా గూగుల్ ఎకౌంట్ సేఫ్టే పెరుగుతుంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఆండ్రాయిడ్ డివైజ్‌లలోని గూగుల్ మెసేజెస్ (Google Messages) సరికొత్త మెజేసింగ్ అనుభవాన్ని యూజర్లకు అందించనుంది. ఈ యాప్ త్వరలో iMessage రియాక్షన్స్‌ను టెక్స్ట్‌కు బదులుగా ఎమోజీలుగా చూపించే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ డివైజ్‌ (Android device)లలోని గూగుల్ మెసేజెస్ (Google Messages) సరికొత్త మెజేసింగ్ అనుభవాన్ని యూజర్లకు అందించనుంది. ఈ యాప్ త్వరలో iMessage రియాక్షన్స్‌ను టెక్స్ట్‌కు బదులుగా ఎమోజీలుగా చూపించే అవకాశం ఉంది. ఈ వివరాలను 9to5Google ప్లాట్‌ఫాం వెల్లడించింది. గూగుల్ మెసేజెస్‌కు వచ్చిన తాజా బీటా అప్‌డేట్‌లో ఐ-మెజేజెస్ రియాక్షన్స్‌ (i message reactions)ను టెక్స్ట్‌గా చూపించడానికి బదులుగా ఎమోజీలు (emojis)గా మార్చే కోడ్ ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

ఎవరైనా ఐఫోన్ యూజర్ ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఉన్న ఫోన్ నంబర్‌కు మెసేజ్ (message) పంపితే.. ఈ కన్వర్జేషన్ SMS ప్రోటోకాల్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే iOS.. RCSకు సపోర్ట్ చేయదు. దీంతోపాటు ఆండ్రాయిడ్‌లో ఐమెసేజెస్‌కు సైతం సపోర్ట్ లేదు. దీంతో ఆ సంభాషణ SMS ప్రోటోకాల్‌లో మాత్రమే కొనసాగుతుంది. అయితే తాజా అప్‌డేట్‌లో ఆండ్రాయిడ్ ఎండ్‌లో మెసేజింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే అప్‌డేట్‌ను గూగుల్ మెసేజెస్ యాప్ (google messages app) తీసుకువస్తోంది. గూగుల్ మెసేజెస్‌లో ఐమెసేజెస్ రియాక్షన్స్‌ను ఎమోజీలుగా చూపే ఫీచర్‌ను యాప్ తాజా వెర్షన్‌లో చేర్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.

iOS, macOSలోని ఐ-మెసేజ్ యూజర్లు.. నవ్వడం, థంబ్స్ అప్ లేదా డౌన్, ఇతర రియాక్షన్స్‌ను సెండ్ చేయవచ్చు. ఈ రియాక్షన్లను ఆండ్రాయిడ్ యూజర్ నుంచి వచ్చే ఎసిగ్రీన్ బబుల్ మెజేస్‌లకు రియాక్ట్ అవ్వడానికి ఉపయోగించవచ్చు. అయితే ఆండ్రాయిడ్ ప్రస్తుతం వాటిని సరిగ్గా రీడ్ (read) చేయట్లేదు. ఐఫోన్‌ నుంచి సెండ్ చేసే థంబ్స్-అప్ రియాక్షన్.. మరొక ఐఫోన్ డివైజ్‌ (I phone device)లో సరిగ్గానే కనిపిస్తుంది. అయితే ఆండ్రాయిడ్ డివైజ్‌లో మాత్రం ఈ రియాక్షన్ టెక్స్ట్‌గా డిస్‌ప్లే అవుతుంది. అంటే ఆ మెసేజ్‌ టెక్స్ట్‌ను యాప్‌ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజా అప్‌డేట్‌ను గూగూల్ మెసేజెస్ యాప్‌ ప్రకటించింది. ఇప్పుడు మెజేజ్‌ (google messages)లలో బర్త్‌డే రిమైండర్‌లను సెట్ చేయగల మరో ఫీచర్‌ సైతం గూగుల్ మెసేజ్‌ యాప్‌లో అందుబాటులోకి రానుంది. అంటే కన్వర్జేషన్ లిస్ట్‌లో రిసీవర్ బర్త్‌డే కనిపిస్తుంది.

* వాట్సాప్ సైతం..

వాట్సాప్‌ సైతం బీటా ఛానెల్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం 2.21.24.8 అప్‌డేట్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఆండ్రాయిడ్ యాప్ కోసం మెసేజ్ రియాక్షన్ నోటిఫికేషన్‌లపై పని చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ గత కొన్ని నెలలుగా మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా ఫేస్‌బుక్ (Facebook) యాప్‌లోని పోస్ట్‌లు, కామెంట్లకు రియాక్ట్ అయ్యే విధంగానే.. యూజర్లు మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వొచ్చని సంస్థ చెబుతోంది. ఇంతకుముందు తమ వినియోగదారులకు మెసేజ్ రియాక్షన్స్ గురించి తెలియజేయడానికి కంపెనీ ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. కానీ iOS యాప్ బీటా వెర్షన్ కోసం వాట్సాప్ ఈ ఫీచర్‌ (feature)ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. ఇప్పుడు తమ ఆండ్రాయిడ్ వినియోగదారులకు సైతం ఈ ఫీచర్‌ను అందించాలని చూస్తోంది.

First published:

Tags: Android, Google, Google Chat, Smart phone

ఉత్తమ కథలు