Smog tower: ఢిల్లీలో మొట్టమొదటి పొగమంచు టవర్​.. ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్​

పొగమంచు టవర్​ ( ఫొటో: ట్విటర్​​)

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం దేశంలోని మొట్టమొదటి 'స్మోగ్ టవర్(smog tower)'ను ప్రారంభించారు. ఈ టవర్​ ఢిల్లీలో సెకనుకు 1,000 క్యూబిక్ మీటర్ల గాలి చొప్పున ఫిల్టర్(filter)​ చేయనుంది.

 • Share this:
  ఢిల్లీ(Delhi). దేశ రాజధాని. నగరం చిన్నదే అయినా అక్కడ రద్దీ మాత్రం విపరీతంగా ఉంటుంది. అందుకే కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. చలికాలం వచ్చిందంటే చాలు కనీసం రోడ్లు కూడా కనిపించనంత పొగమంచుతో  కూడిన కాలుష్యం వాతావరణం(atmosphere) అంతటా వ్యాపిస్తుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఏటా కాలుష్యం (pollution) పెరిగిపోతూనే ఉంది. ఇలాగే కొనసాగితే మరికొద్ది సంవత్సరాల్లో ఢిల్లీ పౌరులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సైతం హెచ్చరించారు. దీంతో కాలుష్యం(pollution) తగ్గించే ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే వాహనాల సంఖ్యను రూడ్లపై తగ్గించే ఆలోచనలో సరి, బేసి అమలు చేశారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఒక పొగమంచు టవర్(smog tower)​నే ఏర్పాటుచేశారు. కలుషిత గాలిని ఆ టవర్​ పీల్చుకుని ఫిల్టర్​ చేసిన గాలిని వదులుతుందట. ఇంతకీ ఆ పొగమంచు టవర్​ విశేషాలు ఏంటో తెలుసుకుందాం..

  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) సోమవారం దేశంలోని మొట్టమొదటి 'స్మోగ్ టవర్(smog tower)'ను ప్రారంభించారు. ఈ టవర్​ ఢిల్లీలో సెకనుకు 1,000 క్యూబిక్ మీటర్ల గాలి చొప్పున ఫిల్టర్(filter)​ చేయనుంది. టవర్​ చుట్టూ 1 కి.మీ వ్యాసార్థం(radius)లో గాలిని శుద్ధి(filter) చేయనున్నట్లు తెలిసింది. కన్నాట్ ప్లేస్‌లోని శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ వెనుక ఉన్న ఈ టవర్ 24.2 మీటర్ల ఎత్తులో ఉంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) సీనియర్ అధికారి మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల పాటు నిర్వహణ వ్యయంతో సహా మొత్తం ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ. 20 కోట్లుగా వెల్లడించారు. ఢిల్లీలో 'గాలి శుభ్రపరచడం'  ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి టవర్ పైలట్​ ప్రాజెక్టుగా రూపొందించారు. రెండు సంవత్సరాల పాటు ప్రాజెక్టు పనితీరును అధ్యయనం చేయడానికి IIT ఢిల్లీ ,  IIT బాంబె సాంకేతిక సలహాదారులను నియమించారు. ప్రాజెక్టు పనితీరు నెల రోజులకు వస్తుందని సీఎం కేజ్రీవాల్​ వెల్లడించారు. ఒకవేళ ప్రాజెక్ట్ విజయవంతం కాకపోతే, కొత్త టెక్నిక్‌లను ప్రయత్నించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  సెకనుకు 1000 క్యూబిక్​ మీటర్ల గాలి ఫిల్టర్​..

  ప్రాజెక్ట్ వివరాలు చూస్తే.. టవర్ సెకనుకు 1,000 క్యూబిక్ మీటర్ల గాలిని ఫిల్టర్ చేయగలదు. ఇది టవర్ మధ్యలో నుంచి 1 కి.మీ వ్యాసార్థంలో ప్రభావం చూపుతుంది. టవర్ దిగువన మొత్తం 40 ఫ్యాన్లు(fans) ఏర్పాటు చేశారు. ఎగువ నుంచి గాలి పీల్చబడుతుంది, ఫిల్టర్ చేయబడుతుంది. దిగువన ఉన్న ఫ్యాన్ల ద్వారా విడుదల చేయబడుతుంది. టవర్(tower) 5,000 ఫిల్టర్‌లను కలిగి ఉంది. ఎయిర్ ఫిల్టర్లు ఇందులో ఉన్నాయి. డేటాను సేకరించడానికి, దాని పనితీరును పర్యవేక్షించడానికి టవర్‌లో సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (SCADA) వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాగా, ఆనంద్ విహార్‌లో ఇలాంటి టవర్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ పని కూడా దాదాపు పూర్తయింది.
  Published by:Prabhakar Vaddi
  First published: