1TB microSD card : 1టీబీ మైక్రోఎస్డీ కార్డ్ వచ్చేస్తోంది... ప్రపంచంలో మొట్ట మొదటిది

శాన్‌డిస్క్ ఎక్స్‌ట్రీమ్ 1టీబీ మైక్రో ఎస్డీ కార్డ్

1TB microSD card : టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే. అప్పుడే మన అవసరాలు తీరతాయి. మైక్రో ఎస్డీ కార్డులో వచ్చిన విప్లవం సెన్సేషన్ సృష్టించబోతోంది.

  • Share this:
ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హార్డ్ డిస్క్ టెక్నాలజీ పూర్తిగా మారిపోబోతోంది. ఇదివరకట్లా బరువైన హార్డ్ డిస్క్ బాక్సుల్ని మనం కొనుక్కోవాల్సిన పని లేదు. జస్ట్ సిమ్ కార్డ్ సైజులో 1TB మైక్రో SD కార్డును బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో అందరికీ పరిచయం చేసింది శాన్ డిస్క్ కంపెనీ. ప్రపంచంలో తొలి 1TB మైక్రో ఎస్డీ కార్డు ఇదే. మొబైళ్లలో ఎక్కువ స్పేస్ కావాలనుకుంటున్న యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇందులో వీడియోలు, సినిమాలు, సాంగ్స్, మ్యూజిక్ ట్రాక్స్ ఇలా ఎన్ని స్టోర్ చేసుకున్నా... 1024 GB కావడం వల్ల... స్టోరేజ్ స్పేస్ ప్రాబ్లం ఉండదు.

స్మోర్మేజ్ స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులు ఎక్కువ మెమరీ ఉన్న ఎస్డీ కార్డుల్ని కోరుతున్నారు. ఎందుకంటే ఆ ఫోన్లలో కెమెరాలు హై రిజల్యూషన్ ఫొటోలు, వీడియోలు ఇస్తున్నాయి. వాటిని సేవ్ చెయ్యాలంటే మొబైల్ మెమరీగానీ, ప్రస్తుతం ఉన్న ఎస్డీ కార్డుల మెమరీ గానీ సరిపోవట్లేదు. బుల్లెట్ స్ట్రోక్ స్మార్ట్ ఫోన్లకు కూడా ఈ సమస్య ఉంది. అందువల్ల మొబైల్ కంపెనీలు ఎస్టీ కార్డుల మెమరీని పెంచమని కోరుతున్నాయి.

శాన్డిస్క్ ప్రవేశపెడుతున్న 1TB మైక్రో స్టోరేజ్ మెమరీ కార్డ్ సెకండ్‌కి 160 మెగాబైట్ల (160MB/S) వేగంతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న మైక్రో ఎస్డీ కార్డుల కంటే ఇది రెట్టింపు వేగం. అందువల్ల దీన్ని హైఎండ్ ఫోన్లకూ, హైఎండ్ డ్రోన్ కెమెరాలకూ, డిజిటల్, DSLR కెమెరాలకూ ఉపయోగించుకోవచ్చు. 1TB మెమరీ కార్డ్... 16 మెగాపిక్సెల్ ఉండే 1,83,104 ఫొటోలను స్టోర్ చెయ్యగలదు.


ప్రస్తుతం ఈ ఎస్డీ కార్డ్ శాన్‌డిస్క్ వెబ్‌ సైట్లో లభిస్తోంది. మిగతా ఈ-కామర్స్ సైట్లలోనూ లభించాలంటే... ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ఆగాల్సి ఉంటుంది. దీని ప్రారంభ ధరను కంపెనీ రూ.35,496గా నిర్ణయించింది. ఇందులోనే 512GB మైక్రో ఎస్డీ కార్డు ధర రూ.14,210గా కంపెనీ ప్రకటించింది. ఈ కార్డు కూడా ఏప్రిల్ నుంచీ మార్కెట్‌లోకి రాబోతోంది. ఇక్కడో సమస్య ఉంది. ఈ కార్డును వాడాలంటే... మీ మొబైల్ గానీ, కెమెరా గానీ... దీన్ని సపోర్ట్ చెయ్యగలిగేదై ఉండాలి.

ఈ ఎస్డీ కార్డుల రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తే తప్పేం లేదు. ప్రస్తుతం 1టీబీ హార్డ్ డిస్కులు రూ.5,000కే దొరుకుతున్నాయి. వాటితో పోల్చితే దీని ధర ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. ఐతే... ఓ ఏడాది గడిస్తే... శాన్‌డిస్క్‌తో పాటూ చాలా కంపెనీలు ఇలాంటి ఎస్డీ కార్డుల్ని మార్కెట్లలో రిలీజ్ చేస్తాయి. తద్వారా పోటీ ఎక్కువై రేట్లు దిగివస్తాయి. ఒకప్పుడు 3జీ ఇంటర్నెట్ చాలా రేటెక్కువ. ఇప్పుడు 4జీ ఇంటర్నెట్... 3జీ కంటే రేటు తక్కువ. టెక్నాలజీ విషయంలో జనరల్‌గా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులకూ ఈ రూల్ వర్తిస్తూ ఉంటుంది.

 

ఇవి కూడా చదవండి :


ట్రూకాలర్ నుంచీ మన నంబర్ తీసేయడం ఎలా? సింపుల్ ట్రిక్... ఫాలో అవ్వండి మరి


ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలా? మీ కోసమే ఈ వెబ్‌సైట్లు... ట్రై చెయ్యండి మరి


గోల్డ్ స్కీముల్లో డబ్బులు పెట్టారా... కొత్త చట్టం వస్తోంది... అందులో ఏముందంటే...


స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసుకోవాలా... 6 మార్గాలున్నాయి... ఇలా చెయ్యండి

First published: