Pegasus: పెగాసస్​పై వివరణాత్మక అఫిడవిట్​ దాఖలుకు నిరాకరించిన కేంద్రం.. రెండు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామన్న సుప్రీంకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

‘పెగాసస్‌’పై స్వతంత్ర దర్యాప్తు (Independent investigation) కోరుతూ పలువురు సుప్రీంకోర్టు (Supreme court) గడప తొక్కిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సోమవారం సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్య కాంత్ , హిమా కోహ్లీల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పెగాసస్​పై వివరణాత్మక అఫిడవిట్ (detailed affidavit )​ దాఖలు చేయలేమని కోర్టు (Supreme court) కు ఆయన తెలిపారు.

 • Share this:
  భారత్‌ (India)తో సహా అనేక దేశాలను గడగడలాడిస్తున్న పెగాసస్‌ స్పైవేర్ (Pegasus Spyware) జర్నలిస్టులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతల మొబైల్ ఫోన్లను ఎక్కువగా టార్గెట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇండియాలో చాలా ఫోన్స్ హ్యాక్ (Phone Hack) అయినట్లు ఇప్పటికే కేంద్రంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. సైబర్ వెపన్ గా ప్రయోగించిన ఈ స్పైవేర్‌ మొబైల్ వినియోగదారుల గోప్యతకు భంగం కలిగిస్తుందని పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ఇజ్రాయెల్‌ (Israel) ఆధారిత ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ డెవలప్ చేసిన స్పైవేర్ ‘పెగాసస్‌’పై స్వతంత్ర దర్యాప్తు (Independent investigation) కోరుతూ పలువురు సుప్రీంకోర్టు (Supreme court) గడప తొక్కిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సోమవారం సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ (Chief Justice of India N V Ramana) నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్య కాంత్ (Surya Kant) , హిమా కోహ్లీ (Hima Kohli)ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్​ జనరల్ (Solicitor General)​ తుషార్​ మెహతా (Tushar Mehta) వాదనలు వినిపించారు. పెగాసస్​పై వివరణాత్మక అఫిడవిట్ (detailed affidavit )​ దాఖలు చేయలేమని కోర్టు (Supreme court) కు ఆయన తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అఫిడవిట్​ రూపంలో ఇవ్వలేమన్నారు.

  కమిటీ ముందు చెప్పగలం..

  అయితే కేంద్రం (Centre) పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తుందా లేదా అనే వివరాలను కమిటీ ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తుషార్​ అన్నారు. "ఇది A సాఫ్ట్‌వేర్ ద్వారా జరిగిందా లేదా B సాఫ్ట్‌వేర్ అని అఫిడవిట్‌లో చెప్పలేం. ప్రభుత్వంతో సంబంధం లేని నిపుణులు దీనిని పరిశీలిస్తారు. మేం అన్నింటినీ వారి ముందు ఉంచుతాం " అని సొలిసిటర్ జనరల్ (Solicitor general) చెప్పారు. దేశ భద్రత దృష్ట్యా రహస్యాలు అఫిడవిట్ (affidavit )​లో ఇవ్వలేం అన్నారు. అయితే ధర్మాసనం స్పందిస్తూ.. ఈ కేసులో వివరణాత్మక అఫిడవిట్ (detailed affidavit) దాఖలు చేయడం గురించి ప్రభుత్వం పునరాలోచించినట్లయితే ఆ విషయాన్ని కోర్టు ముందు ప్రస్తావించవచ్చంది.

  "మేం ఆర్డర్‌ని రిజర్వ్ చేస్తున్నాం. రెండు మూడు రోజుల తర్వాత మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తాం” అని సొలిసిటర్​ జనరల్​కు ధర్మాసనం (Bench) చెప్పింది. కాగా, కేంద్రం ఇంతకు ముందు కోర్టులో క్లుప్త అఫిడవిట్ మాత్రమే దాఖలు చేసింది. అంతేకాదు పిటిషనర్లు చేసిన అన్ని ఆరోపణలను (Allegations) ఖండించింది. అయితే దీనిపై నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటుచేస్తామని కేంద్ర ప్రభుత్వం (Central government ) తెలిపింది.

  ధర్మాసనం స్పందిస్తూ..

  జాతీయ ప్రయోజనాలు, సమస్యల గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం కోర్టు ఆసక్తి చూపట్లేదని (not interested to know about national interest issues), పౌరులపై నిఘా పెట్టడానికి సాఫ్ట్​వేర్​లు ఉపయోగించారా లేదా అనేవి మాత్రమే మేం తెలుసుకోవాలనుకుంటున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం ఇలా చేయొచ్చో లేదో చూడండి. అఫిడవిట్​ దాఖలు చేయబోమని చెబుతున్నారు.. కానీ, మేం కూడా ఎలాంటి భద్రత రహస్యాలను (do not want any security issues ) మా ముందు ఉంచాలని కోరడం లేదని ధర్మాసనం (bench) వ్యాఖ్యానించింది.

  ‘‘మీరు మాత్రం ఒక కమిటీని ఏర్పాటుచేసి నివేదిక సమర్పిస్తామని చెబుతున్నారు. మేం మాత్రం సమస్యను పరిశీలించి మధ్యంతర ఉత్తర్వులు (pass an interim order) జారీ చేస్తాం. మిస్టర్​ మెహతా మీరు పొద చుట్టూ (beating around the bush) కొడుతున్నారు.. దాని గురించి కాదు అడిగేది. పెగాసస్ (Pegasus) వివాదంపై పార్లమెంటులో ఐటీ మంత్రి చేసిన ప్రకటన (IT minister’s statement ) ప్రకారం.. గమనించాల్సినవి మూడు అంశాలు ఉన్నాయి. దీనికి విచారణ అవసరం, దానిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, దీనిని ప్రభుత్వం ఉపయోగించినట్లయితే అది ఒక పద్దతి ప్రకారం ఉంటుంది” అని చీఫ్​ జస్టిస్​ అన్నారు.

  మరోవైపు న్యాయవాది కపిల్ సిబల్ (Kapil sibal) "ప్రభుత్వం వాస్తవాలను దాచాలనుకుంటోంది" అని వాదించారు. కేంద్రాన్ని ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి ఎందుకు అనుమతించాలని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నియంత్రణకు దూరంగా ఉండాలని కపిల్ కోరారు.
  Published by:Prabhakar Vaddi
  First published: