TWS Bluetooth earbuds: ఇండియాలో టీడబ్లూఎస్ వైర్లెస్ ఇయర్‌బడ్స్(Wireless earbuds) మార్కెట్ గణనీయంగా పుంజుకుంటోంది. ఇటీవలి కాలంలో అన్ని మొబైల్ తయారీ కంపెనీలు ఇయర్‌బడ్స్ మార్కెట్‌పై దృష్టి పెట్టాయి. కంపెనీలు బడ్జెట్ ధరలోనే టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. యాపిల్ కంపెనీ 2016లో మొట్టమొదటి ఎయిర్‌పాడ్‌ను ఐఫోన్7తో పాటు ఇంట్రడ్యూస్ చేసింది. అనంతరం కొద్ది కాలంలోనే వీటి మార్కెట్ గణనీయంగా పెరిగింది. మీరు బెస్ట్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా? మార్కెట్లో బెస్ట్ ప్రొడక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శామ్సంగ్ గెలాక్సీ బడ్స్2 ప్రో
ప్రత్యేకమైన మాట్టే ఎండింగ్, కూల్ బోరా పర్పుల్ కలర్ ఆప్షన్‌తో అట్రాక్టివ్ లుక్‌లో కనిపించే TWS ఇయర్‌బడ్‌లలో ఇది కూడా ఒకటి. ఇది అకౌస్టిక్ ఫ్రంట్‌లో 24-బిట్ హై-ఫై ఆడియోను ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రతి ఇయర్‌బడ్ లోపలి భాగం మీకు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఇయర్‌బడ్ శామ్సంగ్ బడ్స్ ప్రో కంటే 15 శాతం చిన్నవిగా ఉంటాయి. ఈ ఇయర్‌బడ్స్‌లో మూడు హై SNR మైక్‌లు, 40 శాతం అన్వాంటెడ్ నాయిస్‌ని ఫిల్టర్ చేసే విండ్ ఫీల్డ్ ఉన్నాయి. దీంతో కాల్ క్వాలిటీ మెరుగవుతుంది. వీటి ధర ప్రస్తుతం రూ.17,999గా ఉంది.
యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో (సెకండ్ జనరేషన్)
చాలా కాలం తర్వాత కంపెనీ ఎయిర్‌పాడ్స్ ప్రోను అప్‌గ్రేడ్ చేసింది. తక్కువ డిస్టార్షన్ డ్రైవర్‌తో కొత్త H2 చిప్‌ను చేర్చింది. ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్)తో ఇది పనిచేస్తుంది. ఇది పరిసరాలను మెరుగ్గా ట్యూన్ చేసి మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ఈ బడ్స్‌ను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయడానికి యాపిల్ వాచ్ ఛార్జర్‌ని కూడా ఉపయోగించవచ్చు. యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో రూ.26,900కి లభిస్తున్నాయి.
నథింగ్ ఇయర్ స్టిక్
నథింగ్ ఇయర్ స్టిక్ యూజర్లను ఆకట్టుకుంటోంది. దీని ఛార్జింగ్ కేసు ఫంకీ, సిలిండ్రికల్ ఛార్జింగ్ ఆకారంలో ఉంటుంది. 12.6 మిమీ కస్టమ్ డైనమిక్ డ్రైవర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది అధిక వాల్యూమ్లలో కూడా నాణ్యమైన మ్యూజిక్‌ను అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. కేవలం10 నిమిషాల ఛార్జింగ్‌తో రెండు గంటల ప్లేబ్యాక్‌ని అందిస్తుంది. నథింగ్ ఇయర్ స్టిక్ ప్రస్తుతం రూ.8,499కి లభిస్తోంది.
గూగుల్ నుంచి విడుదలైన మొదటి ఇయర్ బడ్స్.. పిక్సెల్ బడ్స్ ప్రో. ఇవి ఆండ్రాయిడ్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్. సౌండ్ లీకేజీని తగ్గించడానికి సైలెంట్ సీల్ సిస్టమ్ ద్వారా గూగుల్ దీన్ని రూపొందించింది. ఇవి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, నాయిస్ క్యాన్సిలింగ్ వంటి ఫీచర్లతో వస్తాయి. దీనిలో వాల్యూమ్ ఈక్వెలైజర్ కూడా ఉంటుంది. ఇది వాల్యూమ్‌ను డైనమిక్‌గా మారుస్తుంది. లైవ్ ట్రాన్స్‌లేట్, గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ వంటి గూగుల్ స్మార్ట్ ఫీచర్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. మార్కెట్లో ఇవి రూ.18,990కి అందుబాటులో ఉన్నాయి.
సెన్హైజర్ CX ప్లస్ ఇయర్‌బడ్స్
రూ.15 వేల లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తుంటే.. సెన్హైజర్ CX ప్లస్ ఇయర్‌బడ్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి డీప్ బాస్, నేచురల్ మిడ్స్, స్పష్టమైన, హై-ఫిడిలిటీ స్టీరియో సౌండ్‌ను అందిస్తాయి. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తాయి. 24 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. సెన్హైజర్ CX ప్లస్ ఇయర్‌బడ్స్ ధర రూ.12,890.
సోనీ WF-LS900N ఇయర్‌బడ్స్
సోని TWS ఇయర్‌బడ్స్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో వస్తాయి. దీనిలోని అడాప్టివ్ సౌండ్ కంట్రోల్ ఫీచర్ ద్వారా సౌండ్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతుంది. మాట్లాడటానికి చాట్ వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. ఐదు నిమిషాల "ఫాస్ట్ ఛార్జ్"తో 60 నిమిషాల ప్లేబ్యాక్‌ను పొందవచ్చు. ఈ బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో 20 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. సోనీ సెన్సార్, స్పేషియల్ సౌండ్ టెక్నాలజీకి సహాయంతో బెస్ట్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. వీటి ధర ఇప్పుడు రూ.16,990గా ఉంది.
ఒప్పో ఎన్కో X2
ఒప్పో ఎన్కో X2 హై-ఫై స్పీకర్‌కి సమానమైన ఇయర్బడ్గా పిలవొచ్చు. ఈ TWS ఇయర్‌బడ్‌లను Dynaudio సంస్థతో కలిసి ఒప్పో అభివృద్ధి చేసింది. ఇది ప్రొఫెషనల్ స్పీకర్ స్పేస్‌లో టాప్ ప్లేస్‌లో రాణిస్తోంది. రిచ్ సౌండ్స్టేజ్తో పాటు, ANC సొల్యూషన్, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ IP54 సర్టిఫికేషన్‌తో వస్తాయి. వీటి ధర ఇప్పుడు రూ.8,999గా ఉంది.
బోస్ స్పోర్ట్
బోస్ స్పోర్ట్ ఇయర్‌బడ్స్ స్వెట్ ప్రూఫ్‌తో లభిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ ఫ్లెక్సిబుల్ వింగ్ కలిగి ఉంటాయి. బోస్ స్టే హియర్ మాక్స్ ఇయర్‌బడ్స్‌ను మూడు సైజులలో అందిస్తుంది. వీటిని మృదువైన సిలికాన్‌తో తయారు చేశారు. చెవిలోని సున్నితమైన భాగాలపై తక్కువ ఒత్తిడి కలిగేలా వీటిని రూపొందించారు. ఇవి మార్కెట్లో రూ.15,099కు అందుబాటులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.