Home /News /technology /

THE BEST SMART PHONES UNDER RS 25000 IN INDIA REDMI NOTE REAL ME ONE PLUS AND MORE PRV GH

Mid-range Phones: ఐక్యూ Z6 ప్రో నుంచి వన్‌ప్లస్ నార్డ్ CE 2 వరకు.. రూ.25వేల లోపు బెస్ట్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం
(image: OnePlus India)

ప్రతీకాత్మక చిత్రం (image: OnePlus India)

టాప్ మొబైల్ తయారీ సంస్థలు రూ.25వేల లోపు ధరలో ప్రీమియం రేంజ్ ఫీచర్లను అందిస్తున్నాయి. మీరు బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించండి.

ఇండియాలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. టాప్ మొబైల్ తయారీ సంస్థలు అన్నీ మార్కెట్లోకి ఈ సెగ్మెంట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. రూ.25 వేల లోపు ధరలో ప్రీమియం రేంజ్ ఫీచర్లను అందిస్తున్నాయి. మీరు రూ.25 వేల రేంజ్‌లో బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ (best Mid-range Phones) కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించండి.

* OnePlus Nord CE 2 5G

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC చిప్‌తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.43-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే దీంట్లో ఉంటుంది. ఫోన్ వెనుక 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంటుంది. నార్డ్ సీఈ 2 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC చిప్‌తో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 23,999.

* iQOO Z6 Pro 5G

ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC చిప్‌తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.44-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో దీన్ని రూపొందించారు. 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ దీంట్లో ఉన్నాయి. ఐక్యూ Z6 ప్రో 5G ఫోన్‌లో 4700 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో ఐక్యూ Z6 ప్రో 5G ఫోన్ బేస్ 6GB RAM వేరియంట్ ధర రూ. 23,999 నుంచి ప్రారంభమవుతుంది.

* Moto Edge 20

ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 24,999. మోటో ఎడ్జ్ 20 ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. 108MP ప్రైమరీ కెమెరా, 16MP అల్ట్రావైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా దీంట్లో ఉన్నాయి. ఈ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4000 mAh బ్యాటరీతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

* Realme 9 Pro+ 5G

రియల్‌మీ 9 ప్రో+ 5G ఫోన్ ప్రారంభ ధర రూ. 24,999. OIS సపోర్టెడ్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను దీంట్లో ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌తో 6.43-అంగుళాల 90Hz AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 SoC చిప్‌తో పనిచేస్తుంది.

* Redmi Note 11 Pro+ 5G

రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5G ఫోన్ 6.67-అంగుళాల 120Hz ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో లభిస్తుంది. దీంట్లో 108MP ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 SoCతో పనిచేస్తుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5G బేస్ మోడల్ ధర రూ. 20,999 నుంచి ప్రారంభమవుతుంది.

* Xiaomi 11i

షియోమి 11i ఫోన్ డైమెన్సిటీ 920 SoC చిప్‌తో రన్ అవుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 108MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ డివైజ్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5160 mAh బ్యాటరీతో వస్తుంది. షియోమి 11i బేస్ వేరియంట్ ధర రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: 5g smart phone, Budget smart phone, ONE PLUS, Redmi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు