హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Laptops Under 20K: రూ.20వేలలో బెస్ట్ ల్యాప్‌టాప్..! ఈ మోడళ్లపై ఓ లుక్కేయండీ..!

Laptops Under 20K: రూ.20వేలలో బెస్ట్ ల్యాప్‌టాప్..! ఈ మోడళ్లపై ఓ లుక్కేయండీ..!

రూ.20 వేలలోపు బడ్జెట్ ల్యాప్‌టాప్స్ ఇవే.

రూ.20 వేలలోపు బడ్జెట్ ల్యాప్‌టాప్స్ ఇవే.

బడ్జెట్ (Budget) ఫ్రెండీ ల్యాప్‌ట్యాప్‌ (Laptop)ల అమ్మకాల ట్రెండ్ కొనసాగుతోంది. మీరు రూ.20వేల రేంజ్‌లో బెస్ట్ డివైజ్ కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించవచ్చు.

కరోనా తర్వాత ట్యాబెట్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కారణంగా బడ్జెట్ ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరిగింది. దీంతో అనేక కంపెనీలు తక్కువ ధరలోనే పీసీలను, ల్యాపీలను లాంచ్ చేశాయి. ఇప్పటికీ బడ్జెట్ ఫ్రెండీ ల్యాప్‌ట్యాప్‌ల అమ్మకాల ట్రెండ్ కొనసాగుతోంది. మీరు రూ.20వేల రేంజ్‌లో బెస్ట్ డివైజ్ కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించవచ్చు.

HP Chromebook 11a

ఈ ల్యాప్‌టాప్ 11.6-అంగుళాల యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేతో, 4GB RAM, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. మీడియాటెక్ MT8183 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్టీరియో స్పీకర్, ఇంటర్నల్ డిజిటల్ మైక్రోఫోన్, 720p HD కెమెరాలతో హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 11a డివైజ్‌ను రూపొందించారు. దీని రిటైల్ ధర రూ. 19,490.

Coconics Enabler Laptop C1C11

ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 4 GB RAM, 128 GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. సెలెరాన్ N4000 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఈ డివైజ్ ఇంటర్నల్ డిజిటల్ మైక్, 720p HD కెమెరా, డ్యుయల్ స్పీకర్‌తో వస్తుంది. కొకొనిక్స్ ఎనేబ్లర్ ల్యాప్‌టాప్ C1C11 ధర రూ. 18,463.

ఇదీ చదవండి: శాశ్వత సైనిక నియామకాల కోసం అగ్నివీరులకు నిరంతర పరీక్షలు.. లెఫ్టినెంట్ జనరల్ కీలక ప్రకటన


AVITA Cosmos 2 in 1 Intel Celeron Dual Core

AVITA కాస్మోస్ 2 ఇన్ 1 ఇంటెల్ సెలెరాన్ డ్యుయల్-కోర్ నోట్‌బుక్ 11.6-అంగుళాల డిస్‌ప్లే, కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 4 GB RAM, 64 GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇంటెల్ సెలెరాన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. విండోస్ 10తో వచ్చే ఈ డివైజ్.. టచ్ స్క్రీన్, ఇంటర్నల్ డిజిటల్ మైక్రోఫోన్, 720p HD కెమెరా వంటివి ఇతర స్పెసిఫికేషన్లు. AVITA కాస్మోస్ 2-ఇన్-1 ఇంటెల్ సెలెరాన్ డ్యుయల్ కోర్ మోడల్ రూ.21,490కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

AVITA ఎసెన్షియల్ రిఫ్రెష్ NE14A2INC43A-MB

14-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఇది అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. ఈ సెలెరాన్-N4020 ల్యాప్‌టాప్ 4 GB RAM, 128 GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. విండోస్ 10తో వచ్చే ఈ డివైజ్.. డ్యుకర్, ఇంటర్నల్ డిజిటల్ మైక్రోఫోన్, 720p HD కెమెరా, ఇతర ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. AVITA ఎసెన్షియల్ రిఫ్రెష్‌ ధర రూ. 22,999.

HP Chromebook 11A G8 ఎడ్యుకేషన్

ఈ ల్యాప్‌ట్యాప్ 11.6-అంగుళాల HD యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేతో వస్తుంది. AMD A4-9120C APU డ్యుయల్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4 GB RAM, 32 GB SSD స్టోరేజ్ దీని సొంతం. డ్యుయల్ స్టీరియో స్పీకర్, ఇంటర్నల్ డిజిటల్ మైక్, 720p HD కెమెరాలతో కంపెనీ ఈ డివైజ్‌ను డిజైన్ చేసింది. దీని ధర రూ. 20,288.

Published by:Mahesh
First published:

Tags: Budget, Laptop, Tech news

ఉత్తమ కథలు