ఈ యాప్‌తో బిడ్డ కడుపు నిండిందో లేదో తెలుసుకోవచ్చు..

ఏంటి.. విచిత్రం.. కన్నబిడ్డ కడుపునిండిందో లేదో చెప్పడానికి ఓ యాప్...ఆఆఆఆ.. ఏంటో ఏమో మాయదారి మనుషులు.. ఇలాంటి ఆలోచనలు కాస్తా పక్కనపెట్టాలి. ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమానంగా చూసుకునే నేటి మహిళ ఇలాంటి ప్రత్యామ్నాయాలపై ఆధారపడితే తప్పేం లేదు.. అయినా.. ఇదేదో పాపం కాదు.. చిన్నారులపై తమ బాధ్యతను నిర్వర్తించే స్మార్ట్ పద్ధతి

Amala Ravula | news18-telugu
Updated: February 24, 2019, 2:58 PM IST
ఈ యాప్‌తో బిడ్డ కడుపు నిండిందో లేదో తెలుసుకోవచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 24, 2019, 2:58 PM IST
ప్రపంచం మారింది.. సాంకేతికత పెరిగింది. ప్రతి ఒక్క పని చేసేందుకు మనిషి టెక్నాలజీ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే చిన్నారుల సంరక్షణ కోసం కూడా పలు యాప్స్ వచ్చాయి. వీటి వల్ల మొదటిసారి తల్లులైన మహిళలకు చాలా ఉపయోగకరం.
బిడ్డ ఏ సమయంలో పాలు తాగుతుంది.. ఎంతసేపు పాలు తాగింది.. చిన్నారి బొజ్జ నిండిందా లేదా.. ఎంతసేపు పాలు తాగితే చిన్నారి కడుపు నిండుతుంది. ఇలాంటి విషయాలన్నీ ఈ యాప్స్ వల్ల మకు తెలుస్తాయి. బేబీ కనెక్ట్ అనే యాప్ సమాచారం మొత్తం రికార్డ్ చేస్తుంది. అంతేకాదు, ఇందులో అలారం కూడా ఉంటుంది.

ఈ కారణంగా ఎప్పుడు పాలుపట్టాలి, డైపర్లు మార్చాలి.. వాళ్లు ఎంతలా ఎదిగారు అన్న విషయానల్ని తెలుసుకోవచ్చు. కేవలం ఇదొక్కటే కాదు.. ఫీడ్ బేబి వంటి యాప్స్ కూడా ఇప్పుడు బాగా పాపులర్. వీటిలో ఇంకా సరికొత్త ఫీచర్స్‌ని చేర్చడానికి నిపుణులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

కాబట్టి.. మీరు క్షణం తీరిక లేని నేటి మహిళ అయితే.. ఈ యాప్స్‌ని ఉపయోగించండి.. మీరూ, మీ చిన్నారు హ్యాపీగా ఉండండి..
First published: February 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...