THE BEST 5G PHONES AVAILABLE FOR LESS THAN RS 20000 THESE ARE THE MODELS FROM THE TOP BRANDS GH VB
5G Phones: రూ.20వేల లోపు లభిస్తున్న బెస్ట్ 5G ఫోన్లు.. టాప్ బ్రాండ్ల నుంచి వచ్చిన మోడళ్లు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
ఫాస్టెస్ట్ ఇంటర్నెట్, బెస్ట్ కనెక్టివిటీ కోసం 5G ఫోన్లను అందిస్తున్నాయి టాప్ బ్రాండ్లు. మన దేశంలో ఈ ఏడాదే 5జీ స్ట్పెక్ట్రమ్ అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు తక్కువ ధరలోనే 5జీ డివైజ్‌లను అందిస్తున్నాయి.
ఫాస్టెస్ట్ ఇంటర్నెట్(Internet), బెస్ట్ కనెక్టివిటీ(Best Connectivity) కోసం 5G ఫోన్లను అందిస్తున్నాయి టాప్ బ్రాండ్లు(Top Brands). మన దేశంలో ఈ ఏడాదే 5జీ స్ట్పెక్ట్రమ్(5g Spectrum) అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు తక్కువ ధరలోనే 5జీ డివైజ్‌లను(Device) అందిస్తున్నాయి. మీరు రూ.20 వేలలో బెస్ట్ 5G ఫోన్(Phone) కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించండి.
POCO X4 ప్రో
పోకో X4 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర రూ.18,999. ఇది 6GB RAM, 64 GB స్టోరేజ్ ఆప్షన్లో లభిస్తుంది. 5000 mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ, 6.67-అంగుళాల Full HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో ఇది ఎట్రాక్టివ్‌గా కనిపిస్తోంది.
* Realme X7 5G
రియల్మీ X7 ఫోన్ 6.4 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ ఉంటుంది. 64 + 8 + 2 + 2 MP రియర్ కెమెరా సెటప్, 32 MP ఫ్రంట్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.
* iQOO Z6 5G
ఇది మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న 5G స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఐక్యూ Z6 5G ఫోన్ 6.58-అంగుళాల AMOLED ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వచ్చే ఈ డివైజ్, మూడు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. యూజర్లు 4GB + 128GB, 6GB + 128GB లేదా 8GB + 128GB వేరియంట్లను ఎంచుకోవచ్చు.
* Oppo A74 5G
ఈ ఫోన్ 6 GB RAM, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 480 5G CPU, 48 + 8 + 2 MP రియర్ కెమెరా సెటప్, 8 MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది.
* Samsung Galaxy M33 5G
శామ్సంగ్ గెలాక్సీ M33 5G ఫోన్లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. 6.6-అంగుళాల TFT డిస్ప్లే, Exynos 1280 చిప్సెట్ వంటివి ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128 GB స్టోరేజ్.. 8GB RAM, 128 GB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది.
* OnePlus Nord CE 2 Lite 5G
వన్‌ప్లస్ నుంచి తాజాగా రిలీజైన ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్సెట్తో వస్తుంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉండే 6.59-అంగుళాల LCD స్క్రీన్‌తో రిలీజైంది. 128GB 6GB RAM, 128GB 8GB RAM వంటి రెండు వేరియంట్లలో, బ్లాక్ డస్క్, బ్లూ టైడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
* Realme Narzo 30 Pro
నార్జో 30 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.5-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్, 6 GB RAM, 256GB వరకు విస్తరించగల స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి. 48 MP ట్రిపుల్ కెమెరా, 5000 mAh లిథియం-పాలిమర్ బ్యాటరీ వంటివి దీని ప్రత్యేకతలు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.