Home /News /technology /

THE BEST 5G PHONES AT A LOW PRICE IN INDIA UMG GH

5G Phones: తక్కువ ధరలో అదిరిపోయే బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే.. !

5జీ స్మార్ట్‌ఫోన్లు

5జీ స్మార్ట్‌ఫోన్లు

సంవత్సరం ప్రారంభం నుంచి రూ.20 వేల కంటే తక్కువ ధరకు (Low Price) చాలా 5జీ ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. భారతదేశంలో రూ.20,000 ధరల విభాగంలో 2022లో లాంచ్‌ అయిన బెస్ట్‌(BEST) 5జీ ఫోన్‌లు ఇవే.

ఇండియాలో 5G నెట్‌వర్క్‌ (5G Network)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో 5G నెట్‌వర్క్‌(Net Work)ను సపోర్ట్‌ చేసే ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. వినియోగదారులు కూడా 5జీ ఫోన్‌ (5G Phone)లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ.20,000 కంటే తక్కువ సెగ్మెంట్ (Segment) అత్యంత ప్రజాదరణ పొందిన విభాగాలలో ఒకటి. వివిధ బ్రాండ్‌లు ఈ ధర పరిధిలో అనేక ఫోన్‌(Phone)లను విడుదల చేస్తున్నాయి. సంవత్సరం ప్రారంభం నుంచి రూ.20 వేల కంటే తక్కువ ధరకు చాలా 5జీ ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. భారతదేశంలో రూ.20,000 ధరల విభాగంలో 2022లో లాంచ్‌ అయిన బెస్ట్‌ 5జీ ఫోన్‌లు ఇవే..

* Oppo K10 5G
ఒప్పో 2022 జూన్‌లో ఒప్పో కే10 5జీ ఫోన్‌ వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.5-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ప్యానెల్‌, MediaTek డైమెన్సిటీ 810 ప్రాసెసర్, చిప్ Mali G57 GPU, 128GB UFS 2.2 స్టోరేజ్, 8GB RAMతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 బేస్డ్‌ColorOS 12.1పై రన్‌ అవుతుంది. డివైజ్‌ 48MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరాతో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, 8MP ఫ్రంట్ షూటర్‌ ఉంది. 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000mAh బ్యాటరీ ఉంది. భారతదేశంలో 8GB + 128GB వేరియంట్‌ను రూ.17,499కి సొంతం చేసుకోవచ్చు.

* POCO X4 Pro 5G
పోకో ఎక్స్‌4 ప్రో 5జీ ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, Adreno 619 GPUతో పాటు క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌, 8GB LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 బేస్డ్‌ MIUI 13పై రన్‌ అవుతుంది. 64MP ప్రైమరీ సెన్సార్‌తో సహా ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. హై-రిజల్యూషన్ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, 16MP ఫ్రంట్ షూటర్‌ ఉంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. 6GB + 64GB ధర రూ.18,999, 6GB + 128GB ధర రూ.19,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.21,999గా ఉంది.

* Vivo T1 5G
వివో టీ1 5జీ వివో నుంచి భారతదేశంలో లాంచ్‌ అయిన మొదటి T-సిరీస్ ఫోన్‌ ఇది. ఈ డివైజ్ 1080 x 2400 రిజల్యూషన్‌తో 6.58-అంగుళాల ఫుల్‌ HD+ IPS LCD డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌, 8GB RAM, 128GB స్టోరేజ్‌, డివైజ్‌ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌, డెప్త్ సెన్సింగ్, మాక్రో ఫోటోగ్రఫీ కోసం రెండు 2MP సెన్సార్లు, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ వంటి ఫీచర్‌లను అందిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ది బాక్స్‌పై రన్‌ అవుతుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. భారతదేశంలో 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.15,990 నుంచి ప్రారంభమవుతుంది. 6GB + 128GB మోడల్ ధర రూ.16,990 కాగా, 8GB + 128GB మోడల్ ధర రూ.19,990గా ఉంది.

Cheapest Electric Scooters: అత్యంత తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. వాటిపై ఓ లుక్కేయండి..


* Realme Narzo 50 5G
రియల్‌మీ నార్జో 50 5జీ భారతదేశంలో రూ.20,000 లోపు ఉంది. ఇది 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ IPS LCD స్క్రీన్‌, Mediatek డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్‌, 6GB RAM, 128GB UFS 2.1 స్టోరేజ్‌ ఫీచర్లతో వస్తుంది. డివైజ్‌లో 48MP ప్రైమరీ కెమెరా, వెనుకవైపు పోర్ట్రెయిట్ లెన్స్‌, ముందు భాగంలో 16MP సెల్ఫీ స్నాపర్ వస్తున్నాయి. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్‌ రియల్మీ UI 3.0పై రన్‌ అవుతుంది. ఈ ఫోన్‌ మూడు కాన్ఫిగరేషన్‌లలో.. 4GB+64GB ధర రూ.15,999, 4GB+128GB వెర్షన్ ధర రూ.16,999, 6GB+128GB ధర రూ.17,999గా ఉంది.

* POCO M4 5G
పోకో ఎంM 5జీ ఫోన్‌ 6.58-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌, 90Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్, MediaTek Dimensity 700 ప్రాసెసర్, 6GB RAM, 128GB UFS2.2 స్టోరేజ్‌ వంటి ఫీచర్‌లతో వస్తుంది. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్‌ MIUI 13పై రన్‌ అవుతుంది. 50MP ప్రైమరీ షూటర్, 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, సెల్ఫీలు, వీడియో కాల్‌లు 8MP ఫ్రంట్ షూటర్ అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్‌ రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది - 4GB + 64GB ధర రూ.12,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ.14,999గా ఉంది.

* OnePlus Nord CE 2 Lite
వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 లైట్‌ ఫోన్‌ 2412 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, 401ppi పిక్సెల్ డెన్సిటీ, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫుల్‌ HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌, 8GB LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌, 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే5000mAh బ్యాటరీ వంటి ఫీచర్‌లను అందిస్తోంది. ఇందులో 64MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP ఫ్రంట్ షూటర్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 బేస్డ్‌ ఆక్సిజన్‌ఓఎస్ 12.1పై రన్‌ అవుతుంది. ఇండియాలో ఈ ఫోన్‌ రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది - 6GB + 128GB ధర రూ.19,999గా, 8GB + 128GB వేరియంట్‌ ధర రూ.21,999గా ఉంది.

ఇదీ చదవండి: వాట్సాప్ సూపర్ అప్‌డేట్.. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైమ్ లిమిట్‌ పెంపు.. ఎన్ని రోజులంటే..?


* Samsung Galaxy M33 5G
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం33 5జీ ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ఫినిటీ V నాచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌, 6.6-అంగుళాల ఫుల్‌ HD+ IPS LCD డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ డివైజ్‌ ఆక్టా-కోర్ Exynos 1280 ప్రాసెసర్‌తో పాటు Mali G68 GPU, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్‌లను అందిస్తోంది. ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్‌ ఉన్న క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌, 5MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, 8MP ఫ్రంట్ షూటర్‌ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్‌ OneUI 4.1పై రన్‌ అవుతుంది. ఇండియాలో ఈ ఫోన్‌ రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.18,999, 8GB + 128GB ధర రూ.20,499గా ఉన్నాయి.

* Realme 9 Pro
రియల్‌మీ 9 ప్రో ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌, 6.6-అంగుళాల ఫుల్‌ HD+ IPS LCD డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌, 8GB LPDDR4X RAM, 128GB UFS2.2 స్టోరేజీ వంటి ఫీచర్‌లను అందిస్తుంది. డివైజ్లో 64MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP సెన్సార్‌ ఉన్నాయి. ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000mAh బ్యాటరీ యూనిట్‌ ఉంది. ఇది ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్‌ రియల్మీ UI 3.0పై రన్‌ అవుతుంది. ఇండియాలో ఈ ఫోన్‌ రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది - 6GB + 128GB ధర రూ.17,999 కాగా, 8GB + 128GB మోడల్‌ ధర రూ.20,999గా ఉంది.

* Redmi Note 11 Pro Plus
రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల ఫుల్‌ HD+ AMOLED డిస్‌ప్లే, ఇంటిగ్రేటెడ్ Adreno 619 GPU, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌, 8GB LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ వంటి ఫీచర్‌లను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 108MP ప్రైమరీ షూటర్‌తో సహా ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్‌, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ షూటర్‌ ఉన్నాయి. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 బేస్డ్‌ MIUI 13పై రన్‌ అవుతుంది. ఇండియాలో మూడు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది - 6GB + 128GB ధర రూ.20,999, 8GB + 128GB ధర రూ.22,999, 8GB+256GB వేరియంట్ ధర రూ.24,999గా ఉంది.

* Tecno Pova 5G
టెక్నో పొవా 5జీ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేసే బిగ్‌ 6.9-అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తుంది. డివైజ్‌లో 8GB RAM, 128GB స్టోరేజ్‌, MediaTek డైమెన్సిటీ 900 చిప్‌సెట్, 50MP, 2MP డ్యూయల్ రియర్‌ కెమెరా సెటప్‌, ఫోన్ ముందు 16MP కెమెరా ఉన్నాయి. ఇందులో 18W ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్‌ చేసే 6000mAh బ్యాటరీ ఉంది. మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 11- బేస్డ్‌ HiOS అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌పై రన్‌ అవుతుంది. ఇండియాలో ఈ ఫోన్‌ 8GB+128GB వేరియంట్ రూ.19,999లకు లభిస్తుంది.



* iQOO Z6 5G
ఐక్యూ జెడ్‌6 5జీ ఫోన్‌ భారతదేశంలో 2022 మార్చిలో లాంచ్‌ అయింది. ఇది 1080 x 2400 రిజల్యూషన్‌తో 6.58-అంగుళాల ఫుల్‌HD+ IPS LCD డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌, 8GB RAM, 128GB స్టోరేజ్‌ ఫీచర్‌లను అందిస్తోంది. డివైజ్‌ వెనుకవైపు డెప్త్, మాక్రో షూటింగ్ కోసం రెండు 2MP సెన్సార్‌లతో పాటు 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఇది ఫన్‌టచ్‌ ఓస్‌ 12 లేయర్‌తో ఆండ్రాయిడ్ 12పై రన్‌ అవుతుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.15,499లకు లభిస్తుంది. 6GB + 128GB మోడల్ ధర రూ.16,999 కాగా, 8GB + 128GB మోడల్ ధర రూ.17,999గా ఉంది.
Published by:Mahesh
First published:

Tags: 5g mobile, Budget smart phone, Smart phones, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు