Honor 10 Lite: రూ.10,000 లోపు ఉత్తమ ఫోన్ అవార్డ్ హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌కే... ఎందుకో తెలుసా?

Honor 10 Lite | హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో ఆసక్తికరమైన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అన్ని ఇన్‌కమింగ్ కాల్స్‌కి వీడియోను రింగ్‌టోన్‌గా పెట్టుకోవచ్చు. కాల్స్, విజన్, సీన్ రికగ్నిషన్ లాంటివాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించడం మరిన్ని విశేషాలు.

news18-telugu
Updated: September 26, 2019, 6:21 PM IST
Honor 10 Lite: రూ.10,000 లోపు ఉత్తమ ఫోన్ అవార్డ్ హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌కే... ఎందుకో తెలుసా?
Honor 10 Lite: రూ.10,000 లోపు ఉత్తమ ఫోన్ అవార్డ్ హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌కే... ఎందుకో తెలుసా? (image: Honor)
news18-telugu
Updated: September 26, 2019, 6:21 PM IST
మీరు రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. రూ.10,000 లోపు బడ్జెట్‌లో అద్భుతమైన డిజైన్, ప్రత్యేకమైన కెమెరాతో హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌కు ఇండియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు మీ పాత ఫోన్ మార్చి కొత్తది కొనాలనుకుంటే హానర్ 10 లైట్ పరిశీలించొచ్చు. సాఫ్ట్‌వేర్, కెమెరా, ప్రాసెసర్, మెమొరీ... ఇలా ప్రతీ అంశంలో హానర్ 10 లైట్ ప్రత్యేకమే. మరి హానర్ 10 లైట్ విశేషాలేంటో తెలుసుకోండి.

Honor 10 Lite: హానర్ 10 లైట్ కెమెరా పనితీరు


కెమెరా విషయానికి వస్తే వైడ్ ఎఫ్/1.8 అపార్చర్ లెన్స్‌తో 13+2 మెగాపిక్సెల్ రియర్ ఏఐ కెమెరా ఉండటం విశేషం. ఎల్ఈడీ ఫ్లాష్, ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ లాంటి ఫీచర్లున్నాయి. 24 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా ఉంది. 4 ఇన్ 1 టెక్నాలజీ, ఎక్స్‌పోజర్ కాంపెన్సేషన్ టెక్నాలజీతో డే అండ్ నైట్ లైటింగ్‌లో అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటు లో-లైట్ సెట్టింగ్స్‌లో కూడా 4128 x 3096 పిక్సెల్ ఫోటోలు, వీడియోలు అద్భుతంగా వస్తాయి. ఇక ఫేస్ డిటెక్షన్, టచ్ టు ఫోకస్, డిజిటల్ జూమ్ లాంటి ప్రత్యేక ఫీచర్లున్నాయి. ఇక ఏఆర్ మోడ్ మీ ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇంకా అద్భుతంగా మార్చేస్తోంది. క్లిక్ చేసి బ్యాక్‌గ్రౌండ్ మార్చి ఫోటోలు తీసుకోవచ్చు. వేర్వేరు ఎఫెక్ట్స్‌తో వీడియోలు రికార్డ్ చేయొచ్చు. ఏజ్, జెండర్, స్కిన్ టోన్, స్కిన్ స్మూథెనింగ్, స్కిన్ టోన్ అడ్జెస్ట్ మెంట్, ఐ బ్రైటెనింగ్ లాంటి ఎఫక్ట్స్‌తో 'ఏఐ బ్యూటీ' ఆల్గరిథమ్ మీ ఫోటోలను అందంగా మార్చేస్తుంది.

honor 10 lite, honor 10 lite price, honor 10 lite flipkart, honor 10 lite price in india, honor 10 lite review, honor 10 lite features, honor 10 lite specifications, honor 10 lite specs, హానర్ 10 లైట్, హానర్ 10 లైట్ ధర, హానర్ 10 లైట్ ఫ్లిప్‌కార్ట్, హానర్ 10 లైట్ ప్రైస్, హానర్ 10 లైట్ రివ్యూ, హానర్ 10 లైట్ ఫీచర్స్, హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్స్, హానర్ 10 లైట్ స్పెక్స్
(image: Honor)

Honor 10 Lite: హానర్ 10 లైట్ డిజైన్, డిస్‌ప్లే


హానర్ 10 లైట్ డిజైన్, డిస్‌ప్లే చూస్తే బెజెల్ లెస్ డిజైన్‌తో 6.21 అంగుళాల (15.77 సెంటీమీటర్లు) ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండటం విశేషం. స్క్రీన్ రెజల్యూషన్ 1080 x 2340 పిక్సెల్స్. స్క్రీన్-టు-బాడీ రేషియో 91%. ఇతర బ్రాండ్స్ బ్లూ లైట్ ఫిల్టర్ వాడితే హానర్ మాత్రం టీయూవీ రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్ ఐ కేర్ మోడ్‌ని ఉపయోగిస్తోంది. మల్టీ టచ్ ఫంక్షనాలిటీతో కూడిన టచ్ స్క్రీన్ ఉంది. ఇక దీని స్టైలిష్ లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. యూజర్ చేతిలో అందంగా కనిపిస్తుంది. హానర్ 10 లైట్ మిడ్‌నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ, స్కైల్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. వెనుకవైపు గ్లాస్ ఫినిషింగ్ ఇవ్వడంతో మరింత స్టైల్‌గా కనిపిస్తుంది.



honor 10 lite, honor 10 lite price, honor 10 lite flipkart, honor 10 lite price in india, honor 10 lite review, honor 10 lite features, honor 10 lite specifications, honor 10 lite specs, హానర్ 10 లైట్, హానర్ 10 లైట్ ధర, హానర్ 10 లైట్ ఫ్లిప్‌కార్ట్, హానర్ 10 లైట్ ప్రైస్, హానర్ 10 లైట్ రివ్యూ, హానర్ 10 లైట్ ఫీచర్స్, హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్స్, హానర్ 10 లైట్ స్పెక్స్
(image: Honor)
Loading...

Honor 10 Lite: హానర్ 10 లైట్ పెర్ఫామెన్స్


హానర్ 10 లైట్ పెర్ఫామెన్స్ చూస్తే హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో కిరిన్ 710 ఆక్టాకోర్ ప్రాసెస్ ఉంది. ఆండ్రాయిడ్ 9 పై, ఈఎంయూఐ 9.1 తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్‌తో పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంటుంది. జీపీయూ 3.0 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్‌ కూడా మెరుగ్గా ఉంటుంది. గేమింగ్ సమయంలో స్పీడ్‌ను పెంచుతుంది. హై ఫ్రేమ్ రేట్‌తో ఎలాంటి అవాంతరాలు లేకుండా షట్టర్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్ చూడొచ్చు. పబ్‌జీ, ఆస్ఫాల్ట్ 9, ఫోర్ట్‌నైట్ గేమ్స్ ఆడేప్పుడు కూడా నిరంతరాయంగా పనిచేస్తుంది. ఈఎమ్‌యూఐ 9.1 అప్‌డేట్‌తో హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో ఆసక్తికరమైన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అన్ని ఇన్‌కమింగ్ కాల్స్‌కి వీడియోను రింగ్‌టోన్‌గా పెట్టుకోవచ్చు. కాల్స్, విజన్, సీన్ రికగ్నిషన్ లాంటివాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించడం మరిన్ని విశేషాలు.

honor 10 lite, honor 10 lite price, honor 10 lite flipkart, honor 10 lite price in india, honor 10 lite review, honor 10 lite features, honor 10 lite specifications, honor 10 lite specs, హానర్ 10 లైట్, హానర్ 10 లైట్ ధర, హానర్ 10 లైట్ ఫ్లిప్‌కార్ట్, హానర్ 10 లైట్ ప్రైస్, హానర్ 10 లైట్ రివ్యూ, హానర్ 10 లైట్ ఫీచర్స్, హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్స్, హానర్ 10 లైట్ స్పెక్స్
(image: Honor)

Honor 10 Lite: హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌పై మీ నిర్ణయం ఏంటీ?


హానర్ 10 లైట్ ధర విషయానికి వస్తే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.8,999. హైఎండ్ వేరియంట్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. స్మార్ట్‌ఫోన్ ఔత్సాహికుల బడ్జెట్‌లోనే హానర్ 10 లైట్ వస్తుంది. ఇన్ని ఫీచర్లున్న హానర్ 10 లైట్ తప్ప మరే ఫోన్ కొనాలన్న ఆలోచన రాదు. అందుకే మీరు కొనాల్సిన ఉత్తమ స్మార్ట్‌ఫోన్ హానర్ 10 లైట్.

ఇవి కూడా చదవండి:

PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఈజీ స్టెప్స్‌తో తెలుసుకోండి ఇలా...

Reliance Jio Plans: రోజుకు 1.5 జీబీ డేటా... రూ.149 నుంచి రిలయెన్స్ జియో ప్లాన్స్

IRCTC: ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
First published: September 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...