Home /News /technology /

THE APPLE IPHONE 13 PRO MAX COSTS RS 129900 IN INDIA APPLE RESELLER INDIA ISTORE IS GIVES RS 21000 DISCOUNT HERE THE FULL DETAILS GH SRD

iPhone 13 Pro Max: ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌పై బెస్ట్ డీల్.. రూ.21వేలు డిస్కౌంట్ ఇలా సొంతం చేసుకోండి..

iPhone 13 Pro Max

iPhone 13 Pro Max

iPhone 13 Pro Max: ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 13 మోడల్‌పై ఇప్పటివరకు ప్రకటించిన డిస్కౌంట్లలో ఇదే బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఈ పోర్టల్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్, ఐఫోన్ 12 మిని, ఐఫోన్ SE 3, ఐఫోన్ SE 2022 వంటి అన్ని ఐఫోన్ మోడళ్లపై ..

ఇంకా చదవండి ...
ఇండియాతో పాటు గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అంటే ముందు గుర్తొచ్చేవి ఐఫోన్లు. యాపిల్ కంపెనీ ప్రతి సంవత్సరం కొత్త జనరేషన్ ఐఫోన్లను విడుదల చేస్తుంటుంది. ఇలా ఇప్పటి వరకు ఐఫోన్ 13 సిరీస్ వరకు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. అయితే వీటి ధర ఎక్కువగా ఉండటంతో, చాలామంది ఈ ప్రీమియం డివైజ్‌లపై ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారికి ఒక గుడ్ న్యూస్. యాపిల్ రీసెల్లర్ ఇండియా iStore.. టాప్-ఆఫ్-ది-లైన్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ (iPhone 13 Pro Max)పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు ఐస్టోర్‌లో HDFC బ్యాంక్ కస్టమర్లు ఈ డివైజ్‌ను రూ. 3,000 డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు రూ. 18,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా రూ. 1,29,900 ధర ఉన్న ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ డివైజ్‌ను రూ. 1,08,900కి సొంతం చేసుకోవచ్చు.

* డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలు..

ఐస్టోర్ ఇండియా పోర్టల్‌లో HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వినియోగదారులు ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే.. రూ. 3,000 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. దీంతో డివైజ్ ధర రూ. 1,26,900కి తగ్గుతుంది. వినియోగదారులు ఈ ట్రాన్సాక్షన్‌పై తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకొని మరింత డిస్కౌంట్ పొందవచ్చు.

India iStore వెబ్‌సైట్‌లో పాత iPhone XR 64GB వేరియంట్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకొని రూ. 18,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, వేరియంట్, వర్కింగ్ కండిషన్‌ను బట్టి ఈ విలువ మారుతుంది. ఈ డిస్కౌంట్లు అన్నీ కలిపితే ఐఫోన్ 13 ప్రో మ్యాక్ డివైజ్ ధర రూ. 1,29,900 నుంచి రూ. 1,08,900కి తగ్గుతుంది. అంటే మొత్తం డిస్కౌంట్ రూ. 21,000 వరకు పొందవచ్చు.

ఇది కూడా చదవండి :  రూ.10,000 బడ్జెట్‌లో సైలెంట్‌గా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సాంసంగ్

* ఇప్పటి వరకు ఇదే బెస్ట్ డీల్

ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 13 మోడల్‌పై ఇప్పటివరకు ప్రకటించిన డిస్కౌంట్లలో ఇదే బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఈ పోర్టల్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్, ఐఫోన్ 12 మిని, ఐఫోన్ SE 3, ఐఫోన్ SE 2022 వంటి అన్ని ఐఫోన్ మోడళ్లపై ఇలాంటి క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంచ్ ఆఫర్‌లు ఉన్నాయి. ఐఫోన్ 12 కొనుగోలుపై రూ. 5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Apple iphone, Apple store, Iphone, Smart phones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు