Home /News /technology /

THE ACER SWIFT 3 LAPTOP DISCOUNT IS ONE SUCH DEAL YOU SHOULD NOT MISS IN AMAZON FESTIVE SALE GH SSR

Amazon Great Indian Festival: కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా.. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ ఇంత తక్కువకు వస్తుంటే ఇంకేంటి లేట్..

అమెజాన్​ (PC: Amazon)

అమెజాన్​ (PC: Amazon)

పండుగ వేళ యూజర్లను ఆకట్టుకునేందుకు ల్యాప్​టాప్​లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి టెక్​ కంపెనీలు. ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో తక్కువ ధరకే వీటిని అందుబాటులో ఉంచింది. ఈ సేల్​లో ఏసర్ స్విఫ్ట్ 3 ల్యాప్‌టాప్​పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు.

ఇంకా చదవండి ...
కరోనా తర్వాత ఆన్​లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్​కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో ల్యాప్​టాప్​, ట్యాబ్లెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పండుగ వేళ యూజర్లను ఆకట్టుకునేందుకు ల్యాప్​టాప్​లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి టెక్​ కంపెనీలు.

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో తక్కువ ధరకే వీటిని అందుబాటులో ఉంచింది. ఈ సేల్​లో ఏసర్ స్విఫ్ట్ 3 ల్యాప్‌టాప్​పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ల్యాప్​టాప్​పై ఏకంగా రూ. 30 వేల డిస్కౌంట్​ ప్రకటించింది.

ఏసర్ స్విఫ్ట్ 3పై రూ. 30 వేల డిస్కౌంట్​

ఏసర్ స్విఫ్ట్ 3 అసలు ధర రూ. 89,999 వద్ద ఉండగా.. అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా దీన్ని కేవలం రూ. 59,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. మీ పాత ల్యాప్‌టాప్ ఎక్స్​ఛేంజ్​పై అదనంగా రూ. 18,100 తగ్గింపు కూడా పొందవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్​తో కొనుగోలు చేస్తే 10 శాతం అనగా రూ. 1,750 వరకు ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ లభిస్తుంది. సిటీ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ (ఈఎంఐపై రూ. 1750, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ. 15,00 వరకు డిస్కౌంట్) లభిస్తుంది.

రూపే క్రెడిట్​ కార్డ్​ హోల్డర్లు 10 శాతం ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ రూ. 500 వరకు పొందవచ్చు. ఆర్​బీఎల్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డు హోల్డర్లకు 10 శాతం ఇన్​స్టంట్​ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ. 1,750 వరకు, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ. 15,00 డిస్కౌంట్​ పొందవచ్చు.​

ఇది కూడా చదవండి: WhatsApp New Feature: కొత్త ఫీచ‌ర్‌ను తీసుకురానున్న వాట్సాప్... ఇకపై మరింత సులభంగా...

* ఏసర్​ స్విఫ్ట్​ 3 ఫీచర్లు

ఏసర్​ స్విఫ్ట్​ 3 ల్యాప్​ట్యాప్​ 64 బిట్​, విండోస్​ 10 ఆపరేటింగ్​ సిస్టమ్​కు సపోర్ట్​ చేస్తుంది. ఇది 14 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ఐపీఎస్​ డిస్​ప్లేతో వస్తుంది. ఈ ల్యాప్​టాప్​ 18 జీబీ డీడీఆర్​ 4 ర్యామ్​, 512 జీబీ ఎస్​ఎస్​డీ కలిగి ఉంటుంది. ఇది AMD రైజెన్ 5 5500U హెక్సా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలోని 48Wh లిథియం బ్యాటరీ 12 గంటల బ్యాటరీ లైఫ్​ అందిస్తుంది.

హైక్వాలిటీ వీడియోలను రెండరింగ్​ చేసేందుకు వీలుగా AMD రేడియన్ గ్రాఫిక్స్‌, ఫాస్ట్​గా డేటాను స్టోర్​ చేసేందుకు ఎస్​ఎస్​డీ డ్రైవ్​ను కూడా చేర్చింది. వీటితో పాటు కలర్​ కాంట్రాస్ట్​ కోసం అత్యున్నత టెక్నాలజీ ఫీచర్లను అందించింది. సెక్యూరిటీ పర్పస్ కోసం ఫింగర్​ ప్రింట్​ టెక్నాలజీ, వాయిస్​ అలర్ట్​ కోసం అలెక్సా సపోర్ట్​ను చేర్చింది.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Laptop, Latest Technology, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు