హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tesla Recruitment: టెస్లాలో ఉద్యోగం కావాలా? ఎలా దక్కించుకోవాలో చెప్పిన మస్క్

Tesla Recruitment: టెస్లాలో ఉద్యోగం కావాలా? ఎలా దక్కించుకోవాలో చెప్పిన మస్క్

 (Image Source: Reuters)

(Image Source: Reuters)

Tesla Recruitment | టెస్లాలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త చెప్పారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. త్వరలో రిక్రూట్‌మెంట్ ఉంటుందని ప్రకటించారు.

ఫుల్​సెల్ఫ్ డ్రైవిం​గ్​ కార్ల తయారీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ‘టెస్లా’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్కీలకు గుడ్​న్యూస్ చెప్పింది. తమ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టెస్లా బాస్​ ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. ఉద్యోగాలకు ఎంపిక చేసుకునే ప్రక్రియను చెప్పేశారు. మరో నెల రోజుల్లో సిలికాన్ వ్యాలీలో ఈ టెస్టు ఉండనుంది. ఉద్యోగులను నియమించుకోవడం కోసం ఏఐ సాఫ్ట్​వేర్​, హార్డ్​వేర్​ను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని మస్క్ తెలిపారు. "మరో నెల రోజుల్లో టెస్లా ఏఐ డే నిర్వహించాలని చూస్తున్నాం. టెస్లా ఏఐ సాఫ్ట్​వేర్​, హార్డ్​వేర్​ అభివృద్ధిపై ట్రైనింగ్​, ఇన్ఫెరెన్స్​ సెషన్ ఉంటుంది. ఉద్యోగ నియమకాల కోసం ఇది నిర్వహిస్తాం" అని మస్క్ ట్వీట్​ చేశారు. సంస్థ లక్ష్యమైన ఫుల్​ సెల్ఫ్​ డ్రైవింగ్ టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మస్క్​ మరింత ముందుకెళుతున్నారు. ఇటీవల ఈ టెక్నాలజీలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో మెరుగుపరచాలనే ధ్యేయంతో మరింత మంది నిపుణుల కోసం టెస్లా ప్రయత్నిస్తోంది.

Lava Probuds: రూ.2,199 విలువైన ఇయర్‌బడ్స్ రూ.1 ధరకే సొంతం చేసుకోండి ఇలా

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... ఈ రెండు ప్లాన్స్‌పై బెనిఫిట్స్ మారాయి

మనుషుల మీద ఆధారపడకుండా కారు స్వయంగా డ్రైవ్ చేసుకునే ఫుల్​సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఈ ఏడాది తీసుకొస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నామని మస్క్ ఈ ఏడాది జనవరిలో చెప్పారు. అయితే ఫుల్​ సెల్ఫ్​ డ్రైవింగ్ టెక్నాలజీని ఈ ఏడాది పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేమని మేలో కాలిఫోర్నియా డిపార్ట్​మెంట్ ఆఫ్​ మోటార్ వెహికల్​కు టెస్లా చెప్పింది.

అయితే అడ్వాన్స్​డ్ డ్రైవర్ అసిస్టెన్స్​ సిస్టమ్​నే ఫుల్​ సెల్ఫ్​ డ్రైవింగ్​గా టెస్లా ప్రచారం చేస్తూ.. నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలపైనా కాలిఫోర్నియా నియంత్రణ సంస్థ విచారణ చేస్తోంది. టెస్లా టెక్నాలజినీ నిశితంగా పరిశీలిస్తోంది. టెస్లా తన డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్​ను ఆటో పైలట్​, ఫుల్​ సెల్ఫ్​డ్రైవింగ్​గా పిలుస్తోంది. అయితే ఈ ఫీచర్లు డ్రైవింగ్​ను సులభతరం చేస్తున్నా.. అవి సెల్ఫ్​ డ్రైవింగ్ ఫీచర్లు కాదు. దానంతట అదే స్వయంగా డ్రైవ్ చేసుకునే కారును మూడేళ్లలో అందరికి అందుబాటులోకి తెస్తామని గతేడాది సెప్టెంబర్​లో నిర్వహించిన బ్యాటరీ డే సందర్భంగా మస్క్ ప్రకటించారు. దీన్ని 25వేల డాలర్లకు అందుబాటులోకి తెస్తామన్నారు.

Samsung Galaxy M32: రూ.14,999 ధరతో సాంసంగ్ గెలాక్సీ ఎం32 రిలీజ్... ఫీచర్స్ ఇవే

Android New Features: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 7 కొత్త ఆండ్రాయిడ్స్ ఫీచర్స్


మరోవైపు స్పేస్​ ఎక్స్​.. స్పేస్ ట్రిప్ ప్రాజెక్టును కూడా ఎలాన్ మస్క్​ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రయాణికులను అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో స్పేస్ ఎక్స్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం స్పేస్ క్రాఫ్ట్​లను తయారు చేస్తోంది. ఈ ప్రాజెక్టు జోరుతో ఓ దశలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్​ను అధిగమించి ప్రపంచ అత్యంత ధనికుడిగా మస్క్​ అవతరించాడు. అయితే రోజుల వ్యవధిలోనే మళ్లీ రెండో స్థానానికి వచ్చాడు.

First published:

Tags: CAREER, Elon Musk, JOBS, Tesla Motors

ఉత్తమ కథలు