Home /News /technology /

Tesla plant: బెంగళూరులో ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్‌కు టెస్లా సన్నాహాలు.. అక్కడే ఎందుకు?

Tesla plant: బెంగళూరులో ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్‌కు టెస్లా సన్నాహాలు.. అక్కడే ఎందుకు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా(Tesla) ఎట్టకేలకు భారత్‌లో కాలు మోపింది. కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరులో తమ ప్లాంటు నెలకొల్పేందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంది.

అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా(Tesla) ఎట్టకేలకు భారత్‌లో కాలు మోపింది. కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరులో తమ ప్లాంటు నెలకొల్పేందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంది. దీంతో కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru) ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేరాఫ్‌గా కూడా మారబోతుంది. ఇప్పటికే బెంగళూరులో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ ఆర్ అండ్ డి యూనిట్లను నెలకొల్పిన విషయం తెలిసిందే. వీటికి టెస్లా కూడా తోడవ్వనుంది. కాగా, టెస్లా కంపెనీ బెంగళూరుకు రానుండటంతో ఆ రాష్ట ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప(BS Yediyurappa) ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ..‘‘భారత దేశాన్ని గ్రీన్మొబిలిటీ వైపు నడిపించడానికి కర్ణాటక కేంద్ర బిందువు కావడం సంతోషంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా త్వరలో బెంగళూరులోని తమ ప్లాంటును నెలకొల్పనుంది. ఎలాన్ మాస్క్‌కు స్వాగతం పలుకుతున్నాను. ఆయనకు శుభాకాంక్షలు.” అని అన్నారు. అయితే, మొత్తం ఒప్పందం ఖరారు అయ్యేవరకు ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయరాదని టెస్లా కంపెనీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరడంతో కొద్దిసేపటికే బిఎస్ యడ్యూరప్ప తన ట్వీట్‌ను తొలగించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే అర డజనుకు పైగా ఆటోమోటివ్ కంపెనీలతో, బెంగళూరు దేశానికే సాంకేతిక, ఆర్ అండ్ డి కేంద్రాల అతిపెద్ద సెంటర్‌గా మారింది. బెంగళూరులో మెర్సిడెస్ బెంజ్, గ్రేట్ వాల్ మోటార్స్, జనరల్ మోటార్స్, కాంటినెంటల్, మహీంద్రా & మహీంద్రా, బాష్, డెల్ఫీ, వోల్వో వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన ఆర్ అండ్ డి యూనిట్లు(R&D units) ఉన్నాయి. వీటితో పాటు మహీంద్రా ఎలక్ట్రిక్, ఈథర్ ఎనర్జీ, అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్‌తో సహా 45కి పైగా ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్లు ఉన్నాయి. వీటిలో చాల కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్లను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించే కృషిలో భాగంగా భారత ప్రభుత్వం విద్యుత్ కార్లను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే ప్రపంచంలోనే పేరొందిన టెస్లా కంపెనీ భారత్‌లో తమ ప్లాంట్‌ను నెలకొల్పడానికి నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రం ద్వారా తయారయ్యే కార్లను కేవలం భారతదేశానికే కాకుండా యుఎస్ (US), యూరప్ (Europe), చైనా (China) వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.

బెంగళూరునే ఎందుకు ఎంచుకుంది?
అయితే, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఆర్ అండ్ బీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెస్లాకు ఆఫర్ చేసినా టెస్లా మాత్రం బెంగళూరునే ఎంచుకుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బెంగళూరులో ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు తమ ఆర్ అండ్ బీ యూనిట్లను నెలకొల్పడం. మెర్సిడెస్ బెంజ్తో పాటు చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ ఆర్ అండ్ బీ యూనిట్లు కూడా ఇక్కడే ఉండటం వంటి అంశాలు కలిసొచ్చాయిని చెప్పొచ్చు. అంతేకాక, ఎలక్ట్రిక్ వెహికల్ హబ్(Electric Vehicle Hub) ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం 3 బిలియన్ డాలర్లకు పైగా కేటాయించింది. వీటిలో EV తయారీ కేంద్రాలు, లిథియం -అయాన్ సెల్(Lithium-ion Cell), బ్యాటరీ(Battery) తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రం స్టాంప్ డ్యూటీ(Stamp Duty)పై 100 శాతం మినహాయింపును ఇస్తోంది. లాండ్ కన్వర్షన్ ఫీజు రీయింబర్స్మెంట్ చేయడం, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ సబ్సిడీ(Subsidy) వంటి ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది. ఇవే కాకుండా సాంప్రదాయకంగా బెంగళూరు ఐటి మ్యాన్పవర్ హబ్(IT Manpower Hub) గా నడుస్తోంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, యాక్సెంచర్ వంటి ప్రసిద్ధ ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ టెస్లా బెంగళూరును ఎంచుకోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Bengaluru, Electric vehicle, Karnataka, Tesla Motors

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు