DeleteFacebook | డిలీట్ ఫేస్ బుక్ అంటున్న ఎలాన్ మస్క్...

ఫేస్ బుక్‌ను డిలీట్ చేయాలని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్  చేశారు.

news18-telugu
Updated: February 9, 2020, 4:07 PM IST
DeleteFacebook | డిలీట్ ఫేస్ బుక్ అంటున్న ఎలాన్ మస్క్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫేస్ బుక్‌ను డిలీట్ చేయాలని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్  చేశారు. ‘DeleteFacebook. అది చలనరహితమైంది.’ అని ట్వీట్ చేశారు. ఫేస్ బుక్ నియంతృత్వంతో వ్యవహరిస్తోందని, మార్క్ జుకర్ బర్గ్ చేతిలో నుంచి దాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని ప్రముఖ కమెడియన్ సచ్చా బారోన్ కోహెన్ పిలుపునిచ్చారు. దానికి అనుబంధంగా ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు. స్పెస్ ఎక్స్ ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ ఫేస్ బుక్ మీద ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. తాను ఫేస్ బుక్ వాడనంటూ 2018లో ఓ ట్వీట్ చేశారు. ఫేస్ బుక్ నుంచి టెస్లా, స్పేస్ ఎక్స్ అకౌంట్లను డిలీట్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ తాను సోషల్ మీడియా ప్లాట్ ఫాం నుంచి బయటకు వచ్చేసినట్టు ప్రకటించారు. అయితే, ఇది రాజకీయ నిర్ణయం కాదని, ‘ఫేస్ బుక్ అంటే నాకు ఇష్టం లేదు. అంతే.’ అని చెప్పారు. ఇప్పుడు ఫేస్ బుక్‌ను చలనరహితమైనదిగా అభివర్ణించారు.
First published: February 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading