Home /News /technology /

TESLA CEO ELON MUSK OFFERS TO BUY TWITTER WITH 43 BILLION DOLLAR SS

Elon Musk: ట్విట్టర్‌ను కొనడానికి ఎలాన్ మస్క్ రెడీ... రూ.3 లక్షల కోట్ల ఆఫర్

Elon Musk: ట్విట్టర్‌ను కొనడానికి ఎలాన్ మస్క్ రెడీ... రూ.3 లక్షల కోట్ల ఆఫర్
(Elon Musk File Photo)

Elon Musk: ట్విట్టర్‌ను కొనడానికి ఎలాన్ మస్క్ రెడీ... రూ.3 లక్షల కోట్ల ఆఫర్ (Elon Musk File Photo)

Elon Musk | ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి బెస్ట్ ఆఫర్ ఇచ్చానని, కంపెనీ అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉందని, దానిని అన్‌లాక్ చేస్తానని ఎలాన్ మస్క్ చెప్పారు. ఈ ఆఫర్ అంగీకరించకపోతే షేర్‌హోల్డర్‌గా తన పాత్రను తిరిగి పరిశీలిస్తానని వివరించారు.

ఇంకా చదవండి ...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్‌ను కొనడానికి ఆఫర్ ఇచ్చారు. 41.39 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ (Twitter) కొంటానని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేశారు. 41.39 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.31,50,23,42,90,000. అంటే మూడు లక్షల కోట్లకు పైనే ఆఫర్ ఇచ్చారు ఎలాన్ మస్క్. ఒక షేర్‌కు 54.20 డాలర్లు ఇస్తానని అన్నారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో ఈ వివరాలు తెలియజేశారు ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ ఏప్రిల్ 1న ట్విట్టర్ స్టాక్ క్లోజింగ్ ప్రైస్ కన్నా 38 శాతం ప్రీమియం ఎక్కువ.

ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి బెస్ట్ ఆఫర్ ఇచ్చానని, కంపెనీ అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉందని, దానిని అన్‌లాక్ చేస్తానని ఎలాన్ మస్క్ చెప్పారు. ఈ ఆఫర్ అంగీకరించకపోతే షేర్‌హోల్డర్‌గా తన పాత్రను తిరిగి పరిశీలిస్తానని వివరించారు. మరోవైపు ఇటీవల ట్విట్టర్ బోర్డులో చేరే ప్రణాళికను విరమించుకున్నట్టు ఎలాన్ మస్క్ తెలిపారు. బోర్డు సీటు తీసుకుంటే ట్విట్టర్‌ను టేకోవర్ చేయడం సాధ్యం కాకపోవచ్చని అన్నారు.

5G Smartphone Offer: తొలిసారి భారీ డిస్కౌంట్‌తో 5జీ స్మార్ట్‌ఫోన్... ధర రూ.10,000 లోపే


ట్విట్టర్‌లో టెస్లా సీఈఓ 9 శాతం వాటాలు కొన్నట్టు ఏప్రిల్ 4న ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో 9.2 శాతం వాటా సొంతం చేసుకున్నట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీంతో ఆయన ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుడిగా మారారు. ఈ వార్తతో ట్విట్టర్ షేర్ ధర 23 శాతం పెరగడం విశేషం. వాక్ స్వాతంత్ర్యం పట్ల ట్విట్టర్ నిబద్ధతను ప్రశ్నిస్తూ మరో కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసే విషయమైన సీరియస్‌గా ఆలోచిస్తున్నానని ఆయన గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Realme GT 2 Pro: ఈరోజు ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్ ఉచితం

ఎలాన్ మస్క్ దగ్గర 73.5 మిలియన్ ట్విట్టర్ షేర్లు ఉన్నాయి. ఆయన వాటా విలువ 2.9బిలియన్ డాలర్లు. ఎలాన్ మస్క్ రివకబుల్ ట్రస్ట్ పేరుతో ఈ షేర్లు ఉన్నాయి. ఈ ట్రస్ట్‌కు ఆయన ఒక్కరే ట్రస్టీ కావడం విశేషం.ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన 2009 లో ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో చేరారు. ప్రస్తుతం 80 మిలియన్లకు పైగా అంటే 8 కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉండటం విశేషం. ట్విట్టర్ వేదికగా ఆయన అనేక ప్రకటనలు చేస్తుంటారు. ఆయన ట్వీట్స్ కూడా వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి ఆయన ట్వీట్స్ వివాదాస్పదం కూడా అవుతుంటాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Elon Musk, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు