సిలికాన్ వ్యాలీలో అవతరించిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ "టెస్లా" ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ఈ కార్లు అద్భుతమైన టెక్నాలజీతో పనిచేస్తుంటాయి. అలాగే ఈ కార్లలో ప్రయాణించడం చాలా సురక్షితమని వాహనదారులు భావిస్తుంటారు. అయితే ఈ కార్లలో ఆటో పైలట్, రిమోట్ డ్రైవింగ్ వంటి అద్భుతమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫీచర్స్ సహాయంతో టచ్ చేయకుండానే టెస్లా కార్లను కంట్రోల్ చేయవచ్చు. అయితే గత కొద్ది నెలలుగా ఆటో పైలెట్ ఫీచర్ ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. కానీ తాజాగా జరిగిన ఒక ఘటన ఆటో పైలెట్ టెక్నాలజీ పై ప్రజలందరికీ నమ్మకం పోయేలా చేస్తోంది.
తాజాగా ఒక టెస్లా డ్రైవర్ ఆటో ఫైలెట్ సిస్టమ్ లో ఒక భారీ సాంకేతిక సమస్యను గుర్తించారు. అదేంటంటే, ఈ ఆటో ఫైలెట్ సిస్టమ్ చంద్రుడిని చూసి ఎల్లో ట్రాఫిక్ లైట్ అని పొరపాటుగా అర్థం చేసుకుంది. అంతేకాదు, చంద్రుడి వెలుతురునుఎల్లో ట్రాఫిక్ లైట్ అనుకోని కారు వేగాన్ని బాగా తగ్గిస్తోంది. ఒక డిజిటల్ లైట్ కి, ఒక ఎలక్ట్రిక్ లైట్ కి మధ్య ఉన్న తారతమ్యం కూడా గమనించలేకపోతోంది. ప్రపంచంలోనే ది బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లుగా పేరొందిన టెస్లా కార్లు సైతం ఇలాంటి పొరపాటు చేస్తుండటం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. అత్యంత విశ్వసనీయమైన కంపెనీగా భావిస్తున్న టెస్లా కనీసం టెస్ట్ కూడా చేయకుండా ఆటోపైలట్ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తేవడం విడ్డూరంగా ఉంది.
అయితే ఓ టెస్లా డ్రైవర్ ఈ సాంకేతిక సమస్యకు సంబంధించి ఒక వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆటోపైలట్ సిస్టమ్ డివైజ్‌ను చూడొచ్చు. ఈ సిస్టమ్ చంద్రుడిని చూసి ఎల్లో లైట్ అనే వార్నింగ్ ఇస్తూ కారుని స్లో చేయడం చూడొచ్చు. అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటూ సదరు డ్రైవర్ టెస్లా వ్యవస్థాపకుడు అయిన ఎలాన్ మస్క్‌కు సూచించాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తనకు కూడా ఇలాంటి సమస్యే ఎదురయిందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
Hey @elonmusk you might want to have your team look into the moon tricking the autopilot system. The car thinks the moon is a yellow traffic light and wanted to keep slowing down. ?? @Teslarati @teslaownersSV @TeslaJoy pic.twitter.com/6iPEsLAudD
— Jordan Nelson (@JordanTeslaTech) July 23, 2021
టెస్లా ఆటో ఫైలెట్ సిస్టమ్ కేవలం కెమెరా లపై మాత్రమే ఆధారపడదు. కూడలి, ట్రాఫిక్ లైట్స్ లకు సంబంధించిన డేటా పై ఆధారపడుతూ కారును కంట్రోల్ చేస్తుంది. అయితే కొన్ని కూడలిలు చాలా దగ్గర దగ్గరగా ఉండటం వల్ల ఆటో ఫైలెట్ సిస్టమ్ గుర్తించడానికి కష్టమవుతోంది. దీనివల్ల టెస్లా డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10 వేల డాలర్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఆటో ఫైలెట్ సిస్టమ్ పార్క్డ్ లైన్లను కూడా గుర్తించలేక పోతుంది. ముందు వెహికిల్స్ వచ్చినప్పుడు కాస్త స్లో అయ్యి.. మళ్ళీ ఢీకొట్టడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అయితే బోస్టన్, ఫిలడెల్ఫియా తదితర ప్రాంతాల్లో టెస్లా కస్టమర్లకు ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదని సదరు కంపెనీ చెబుతోంది. ఇతర ప్రాంతాల్లో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా టెక్నికల్ ఇష్యూస్‌ను సాల్వ్ చేస్తామని టెస్లా క్లారిటీ ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, Tesla Motors, VIRAL NEWS, Viral Video