హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Elon Musk: షాకింగ్ విషయం చెప్పిన ఎలాన్ మస్క్.. వైరలవుతున్న అపర కుబేరుడి ట్వీట్..

Elon Musk: షాకింగ్ విషయం చెప్పిన ఎలాన్ మస్క్.. వైరలవుతున్న అపర కుబేరుడి ట్వీట్..

Elon Musk

Elon Musk

Elon Musk: కొన్నిసార్లు ఎలాన్ మస్క్ చేసే చిన్న ట్వీట్ సైతం ఒక పెద్ద వార్తగా మారుతుంది. ఆయన ట్వీట్‌ ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ట్రెండ్స్‌ను ప్రభావితం చేయగలదు.

ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ (Elon Musk) అంటే తెలియని నెటిజన్లు చాలా అరుదు. టెస్లా (Tesla), స్పేస్ ఎక్స్ (SpaceX) వంటి ప్రముఖ కంపెనీల CEO అయిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌ (Twitter) లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొన్నిసార్లు ఆయన చేసే చిన్న ట్వీట్ సైతం ఒక పెద్ద వార్తగా మారుతుంది. ఆయన ట్వీట్‌ ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ట్రెండ్స్‌ను ప్రభావితం చేయగలదు. అంతటి శక్తిమంతుడైన మస్క్.. తాజాగా చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాను ఉద్యోగాన్ని వదిలేసి ఫుల్ టైమ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలనుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. దీనిపై తన ట్విట్టర్ ఫాలోవర్ల స్పందన కోరారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

‘నా ఉద్యోగాలను వదిలేసి ఫుల్‌టైమ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని ఆలోచిస్తున్నాను. దీనిపై మీరు ఏమంటారు?’ అని మస్క్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 10న చేసిన ఈ ట్వీట్‌ను ఇప్పటికే 3.8 లక్షల మంది లైక్ చేశారు. దీన్ని సుమారు 29వేల మంది రీట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఉన్న మస్క్ ట్వీట్‌కు ఎంతోమంది రిప్లై ఇస్తున్నారు. ఆయనకు ట్విట్టర్‌లో 65.8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వీరిలో కొందరు మస్క్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం.. ‘మీరు ఇప్పటికే అతిపెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నారు. ఉద్యోగాలు వదిలేయడం ఎందుకు?’ అని కామెంట్లు రాస్తున్నారు.

"యూట్యూబ్ వ్యూస్ ఎలా పొందాలో నేను మీకు శిక్షణ ఇస్తాను!" అని ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మస్క్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. దానికి చేతులు కలిపిన ఎమోజీని జతచేశారు. కొంత మంది మాత్రం.. ‘మా స్థానంలోకి మీరు రండి.. మీ హోదాను మేము స్వీకరిస్తాం’ అంటూ సరదాగా అడిగారు. అయితే మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో ఎప్పుడూ వివిధ అంశాలపై స్పందించే మస్క్.. ఈ ట్వీట్‌ను ఎవరినైనా ఉద్దేశించి చేశారా? లేదా వ్యంగ్యంగా చేశారా అనేది తెలియట్లేదు.

ఈ ఏడాది జనవరిలో ఒక కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ.. పగలు, రాత్రి అంటూ పని చేయకుండా కొంత ఖాళీ సమయాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు చెప్పారు. ‘నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు.. వారానికి 7 రోజులు పని చేయకుండా కొంచెం ఖాళీ సమయం ఉంటే బాగుంటుంది. ఇది చాలా తీవ్రమైన అంశం’ అని మస్క్ తెలిపారు.

ఇది కూడా చదవండి : గంగూలీ ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని కోహ్లీపై ఇప్పుడు పగ తీర్చుకున్నాడా..?

స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీలతో పాటు బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ది బోరింగ్ కంపెనీలకు సైతం ఎలాన్ మస్క్ అధిపతిగా ఉన్నారు. టెస్లా కంపెనీకి చాలా సంవత్సరాలు CEOగా ఉండాలని ఆశిస్తున్నట్లు గతంలో మస్క్ చెప్పారు. అంటే తాజా ట్వీట్‌ను ఆయన సరదగా చేసినట్లు అర్థమవుతోంది.

First published:

Tags: Elon Musk, Space, Tesla Motors, Twitter

ఉత్తమ కథలు