TENCO POVA 2 PRICE IN INDIA RS 10999 12999 LAUNCH SALE DATE AUGUST 5 SPECIFICATIONS GH VB
Smart Phone: 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ లాంచ్.. అతి తక్కువ ధరలో లభ్యం.. వివరాలివే..
టెక్నో పోవా -2 మొబైల్
చైనాకు చెందిన స్మార్ట్ బ్రాండ్ టెక్నో భారత మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. గతేడాది టెక్నో పోవా 1 మోడల్‌ను లాంచ్ చేయగా.. ఇప్పుడు టెక్నో పోవా 2 మోడల్‌ను లాంచ్ చేసింది. దీన్ని జూన్ 3న తొలుత ఫిలిప్పీన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంలో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.
చైనాకు చెందిన స్మార్ట్ బ్రాండ్ టెక్నో భారత మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. గతేడాది టెక్నో పోవా 1 మోడల్‌ను లాంచ్ చేయగా.. ఇప్పుడు టెక్నో పోవా 2 మోడల్‌ను లాంచ్ చేసింది. దీన్ని జూన్ 3న తొలుత ఫిలిప్పీన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంలో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలోనే వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లను అందించింది. దీనిలో 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించడం విశేషం. ఇది 18W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మాలి G52 GPUతో జతచేసిన మీడియా టెక్ హీలియో జీ85 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. టెక్నో పోవా 2 రెండు స్టోరేజ్, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ధర, లభ్యత
టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ను ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ఆగస్టు 5 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇది మొత్తం రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు.. డాజిల్ బ్లాక్, ఎనర్జీ బ్లూ, పోలార్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక, ధర విషయానికి వస్తే.. 4GB ర్యామ్+ 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 10,999, 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్ రూ. 12,999 వద్ద అందుబాటులో ఉంటుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద వీటిని రూ. 500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
టెక్నో పోవా 2 స్పెసిఫికేషన్లు
టెక్నో పోవా 2 ఆండ్రాయిడ్ 11 బేస్డ్ HiOS లో నడుస్తుంది. ఇది 6.95 అంగుళాల ఫుల్-హెచ్డి+ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో మీడియాటెక్ హీలియో G85 SoC, మాలి G52 GPU ప్రాసెసర్లను అందించారు. ఇది 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీనిలో 'హైపర్‌ఇంగైన్ గేమ్ టెక్నాలజీ'ని అందించారు. తద్వారా అద్భతమైన గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. ఇక, కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంగా AI క్వాడ్ కెమెరా సెటప్‌ను అందించింది. వీటిలో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ AI సెన్సార్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 -మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వంటివి చేర్చింది. ఈ కెమెరా సెటప్‌లో క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్‌ను కూడా అందించింది. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 8 మెగాపిక్సెల్ AI సెన్సార్ కెమెరాను చేర్చింది. ఇది హోల్-పంచ్ కటౌట్లో వస్తుంది. సెల్ఫీ కెమెరా 2K వీడియో రికార్డింగ్, 2x జూమ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 4G LTE, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ ఓటీజీ వంటివి అందించింది. టెక్నో పోవా 2లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తుంది. ఇక, బ్యాటరీ విషయానికి వస్తే,. దీనిలో 8W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 7WmAh బ్యాటరీ ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.