Home /News /technology /

TEN USEFUL WEBSITES YOU MUST CHECK ON THE INTERNET UMG GH

Useful Websites: ఇంటర్నెట్‌ యూజర్లకు అలర్ట్.. ఈ 10 యూజ్‌ఫుల్ వెబ్‌సైట్ల గురించి తెలుసుకోవాల్సిందే..!

బెస్ట్ యూజ్‌ఫుల్ వెబ్‌సైట్లు ఇవే

బెస్ట్ యూజ్‌ఫుల్ వెబ్‌సైట్లు ఇవే

చాలామంది ఇంటర్నెట్ (Internet) యూజర్లకు ఉచితంగా సేవలు అందించే బెస్ట్‌ వెబ్‌సైట్‌ (Website)ల గురించి తెలియదు. మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 10 యూజ్‌ఫుల్ (Useful) వెబ్‌సైట్‌లు ఇవే..

ప్రస్తుత డిజిటల్‌ (Digital)ప్రపంచంలో వివిధ రకాల పనులు ఇంటర్నెట్‌ ద్వారా పూర్తవుతున్నాయి. అన్ని రకాల సేవలు ఆన్‌లైన్‌ రూపం పొందుతున్నాయి. దీంతోపాటు వెబ్‌సైట్‌ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇంటర్నెట్‌ (Internet)లో బిలియన్ల కొద్దీ వెబ్‌సైట్‌ (Website)లు ఉన్నాయి. సాధారణంగా అందరూ ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువ వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉండటంతో ఉపయోగకరమైన, అవసరమైన వెబ్‌సైట్‌ల గురించి తెలుసుకోవడం కష్టమవుతుంది. చాలామంది ఇంటర్నెట్ యూజర్లకు ఉచితంగా సేవలు అందించే బెస్ట్‌ వెబ్‌సైట్‌ల గురించి తెలియదు. మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 10 యూజ్‌ఫుల్ వెబ్‌సైట్‌లు ఇవే..

Have I Been Pawned
వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లు హ్యాక్ అయ్యాయా? లేదా? అనే వివరాలను ఈ వెబ్‌సైట్‌ ఉపయోగించి తెలుసుకోవచ్చు. Haveibeenpwned.com ద్వారా ఈమెయిల్‌ అడ్రస్‌, ఫోన్ నంబర్ సమాచారం సురక్షితంగా ఉందా? లేదా? అనే వివరాలను తెలియజేస్తుంది.

Pixabay
దీని ద్వారా కాపీరైట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైనా పిక్చర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్‌లు లేదా వెబ్‌సైట్ కోసం కాపీరైట్ సమస్యలు లేని ఫోటోలు కావాలంటే.. Pixabay.com ఉపయోగపడుతుంది.

Print Friendly
ఈ వెబ్‌సైట్‌లో దేన్నైనా ప్రింటర్-ఫ్రెండ్లీ ఫార్మాట్‌లోకి మార్చవచ్చు. Printfriendly.com పేరు సూచించినట్లు.. ఏదైనా వెబ్‌పేజీని ప్రింట్-ఫ్రెండ్లీ లేఅవుట్‌గా మార్చి.. PDFగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌ కూడా ఉంది.

ఇదీ చదవండి: మానవత్వం పరిమళించింది.. కుక్క కోసం ఏకమైన ఓ గ్రామం.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!


Mathway
ఈ సైట్‌ ఏదైనా మ్యాథమెటికల్‌ ప్రాబ్లమ్‌ను పరిష్కరిస్తుంది. Mathway.com అనేది గణితాన్ని ఇష్టపడని విద్యార్థులకు సాయం చేసే ఒక వెబ్‌సైట్. యూజర్‌లు ఇందులో ఏదైనా మ్యాతమెటిక్‌ ప్రాబ్లమ్‌ను టైప్‌ చేసి సమాధానం తెలుసుకోవచ్చు.

Earth.fm
ఈ వెబ్‌సైట్‌లో ప్రపంచవ్యాప్తంగా రికార్డ్‌ చేసిన సహజమైన శబ్ధాలను(సౌండ్‌స్కేప్‌)లను వినవచ్చు.
Earth.fm వెబ్‌సైట్‌లో యూజర్స్ స్పెషల్ ప్లేలిస్ట్‌ను కూడా క్రియేట్‌ చేసుకోవచ్చు. ప్రకృతిలో పక్షులు, వివిధ జంతువుల అరుపులు, మనుషులు చేసే శబ్దాలు వంటి వాటిని ఇందులో అప్‌లోడ్‌ చేస్తారు. జాతీయ పార్కులు, ఎవర్‌గ్లేడ్స్ నుంచి రికార్డ్‌ చేసిన సౌండ్‌లను వినే అవకాశం ఉంటుంది.

Disposablewebpage.com
దీనిద్వారా PCలో లోకల్‌గా స్టోర్‌ చేసుకునే వెబ్‌సేజ్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ప్రైవేట్ వెబ్‌పేజీలను సృష్టించడానికి అవకాశం కల్పిస్తుంది. లాగిన్‌లు, అకౌంట్లు అవసరం లేదు.

Zamzar
ఇందులో ఒక ఫైల్‌ను కావాల్సిన ఏదైనా ఫార్మాట్‌లోకి మార్చుకోవచ్చు. Zamzar.com అనేది యూనివర్సల్ ఫైల్ కన్వర్షన్ వెబ్‌సైట్. ఇది వీడియోలు, పిక్చర్‌లు, పేపర్స్‌ వంటి వాటిని ఏదైనా ఫైల్ ఫార్మాట్‌లోకి మార్చుకోవడానికి సపోర్ట్‌ చేస్తుంది.

Tosdr.org
ఈ వెబ్‌సైట్‌ ఏవైనా నిబంధనలు, షరతులను సులువుగా అర్థం చేసుకునేలా సహాయపడుతుంది.
Tosdr.org అనేది విచిత్రమైన నిబంధనలు, షరతులను సులభతరం చేయడానికి రూపొందించిన వెబ్‌సైట్. T&Cల స్వభావం ఆధారంగా గ్రేడింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తుంది. రెడ్‌, గ్రీన్, ఎల్లో రంగులలో నిర్దిష్ట నిబంధనలు, షరతులను హైలైట్ చేస్తుంది.



Kiddle
కిడిల్‌ అనేది పిల్లలకు గూగుల్‌ లాంటిది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా పిల్లలకు అవసరమైన కంటెంట్‌ను పొందవచ్చు. కిడ్స్‌ ఫ్రెండ్లీ డేటాను చూపడానికి ఈ వెబ్‌సైట్‌ ఉపయోగపడుతుంది.

Downdetector
Downdetector.in అనే వెబ్‌సైట్‌ ఆయా యాప్‌ల సేవల్లో ఎప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయనే విషయం తెలియజేస్తుంది. ఈ వెబ్‌సైట్‌ రియల్‌టైమ్‌లో యాప్‌ల పనితీరు గురించి, సేవల గురించి వివరిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Digital, Internet, Tech news, Website

తదుపరి వార్తలు